దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ

మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని సంఘటనలు జరిగే ఉంటాయి.  జీవితాంతం అవి  వెన్నాడుతూనే ఉంటూ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మంచి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునప్పుడల్లా ముందు జీవితమంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. చెడు జ్ఞాపకాలు మనిషిని అధైర్య పరుస్తాయి. కొంతమంది ఈ చెడు జ్ఞాపకాలను నుండి బయట పడతారు. మరికొంతమంది వెనకటివేవో తలుచుకొని వెక్కివెక్కి ఏడ్చినట్టు డిప్రెషన్కు బలవుతారు.

ఈ మధ్యకాలంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది. పూర్వ కాలం తో ఈనాటి మహిళలను పోల్చుకుంటే ఆనాటి మహిళలు చెప్పుకోలేని ,భరించలేని కుటుంబ త్యాగాలు చేశారు. బాధలను అనుభవించారు. కానీ ఈ డిప్రెషన్ అనే పదం ఆనాటి సమాజపు డిక్షనరీలో లేదు. దానికి కారణం వారు ఏది చేసినా అది తమ బాధ్యతగా, కర్తవ్యం గా చేశారే తప్ప డిప్రెషన్కు గురి కాలేదు. ఈనాడు చాలామంది మహిళలు ఈ మాట అంటుంటే కారణాలు తెలుసుకుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. పిల్లలు చెప్పిన మాట వినడం లేదనో, అత్తమామల నుండి దూరంగా వెళ్లిపోవాలనో, అందుకు భర్త తన మాట వినడం లేదనో, ఎవరితోనో పోల్చుకొని తను తక్కువగా ఉన్నట్టు ఇలాంటి సవాలక్ష కారణాలు. అందులో ఒక్కటిీ బలమైన కారణం వుండదు.

అసలు ఈ డిప్రెషన్ నుండి బయట పడాలి అనుకునేవారు ముందుగా ఈ పదాన్ని మైండ్ నుండి బయటికి తీసివేయాలి. ఎందుకంటే డిప్రెషన్ అనేది కేవలం ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకని  ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోవాలి. గతంలో జరిగిన అవమానాలు అవి ఇంట్లో గాని, బంధువులలో గాని, లేదా ఆఫీస్ లలో గాని జరిగినవి, లేదా గతంలో పడిన కష్టనష్టాలు గాని పదే పదే గుర్తు చేసుకొని, ఎప్పుడో జరిగిన అవమానాన్ని, చేదు అనుభవాలను గురించి ఆలోచిస్తూ బాధ పడటం వలన శరీరంలోని  ఎనర్జీ లెవెల్స్  తగ్గిపోతాయి. ఒక్క నిమిషం సంతోషంగా ఉంటే ఎంత ఎనర్జీ ని పొందుతామొ అదే ఒక్క నిమిషం బాధతో పది రెట్ల ఎనర్జీని పోగొట్టుకుంటాము.

ముఖ్యంగా నిన్న అలా జరిగింది. రేపు ఏం జరుగుతుందో?. నాపిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో?. నేను ఎలా ఉంటానో?. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో? ఏమైనా జరిగితే రోడ్డున పడి పోతానేమో ఈ విధంగా ఏమో ఏమో అనే భయం కూడా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గించేస్తాయి. అటు గతం, ఇటు భవిష్యత్తు  భయం ఈరోజును మింగేస్తాయి. నిన్న జరిగిన దానికి భయం, రేపు జరగబోయే దాని గూర్చి అయోమయం ఈ రెండు వదిలేసి ఈ రోజును అంటే వర్తమానంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. లేదంటే నిన్నటి భయం ఈ రోజును మింగేయడమేకాక రేపటి ని కూడా చీకటిమయం చేస్తుంది.

అసలు మన శరీరమంతా జ్ఞాపకాల పుట్ట. ఒక్కోసారి అనుకోకుండా  బాల్యంలో జరిగిన మంచి చెడు సంఘటనలు గుర్తుకొచ్చి  అప్పుడు అలా ఎందుకు జరిగింది. ఇంత చిన్న విషయానికే ఎందుకలా చేశాము. అని మనలో మనం నవ్వుకుంటాం. అంటే అంత చిన్న విషయాలు కూడా స్టోర్ చేసేది మన మెదడు. మరి ఆ స్టోరేజ్ని ఎప్పటికప్పుడు వెకేట్ చేయాలి.

ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన  ఆడవాళ్లకు బాధ్యతలన్నీ తీరి ఖాళీగా ఉండటం వలన మరీ మరిీ మంచి కంటే ఎక్కువగా చెడు జ్ఞాపకాలు వేధిస్తుంటాయి. దీన్ని అధిగమించాలంటే మనలో చిన్ననాటి నుండి  ఏమూలో దాగి ఉన్న మనకిష్టమైన కళను బయటికి లాగాలి. ఎందుకంటే ప్రతిీ ఒక్కరిలో ఏదో ఒక కళ అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటుంది. అంతవరకూ పిల్లలు, వాళ్ల పెంపకం , చదువులు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ఆ ఇష్టమైన వాటిని అణిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిీ స్త్రీ  అప్పటివరకు తనను తాను మరచి పోతుంది.తనకోసం తను బ్రతకదు. ఇది అతిశయోక్తి కాదు. అందుకని తనకు ఇష్టమైన దానిని వ్యక్తం చేసే సమయం గాని, శ్రద్ధ గాని, సాహసం గాని, ప్రోత్సాహం గాని అప్పుడు ఉండవు. కాబట్టి వయస్సు మీరుతున్నప్పుడైనా ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలను పాటిస్తూ  చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ  చుట్టూ ఉన్న వారితో పాజిటివ్ థింకింగ్ తో ఉండేలా మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలి. ఏ పరిస్థితినైనా ఎదిరించే మనలోనే ఉన్న దైర్యాన్ని వెతుక్కొని ప్రదర్శిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలి.

by వేముగంటి శుక్తిమతి

Add your submission

Image Video Audio Text

This field is required

Drop Images Here

or

You don't have javascript enabled. Media upload is not possible.

Get image from URL

Maximum upload file size: 2 MB.

Processing...

This field is required

Drop Video Here

or

You don't have javascript enabled. Media upload is not possible.

e.g.: https://www.youtube.com/watch?v=WwoKkq685Hk

Add

Some of the supported services:

Maximum upload file size: 10 MB.

Processing...

This field is required

Drop Audio Here

or

You don't have javascript enabled. Media upload is not possible.

e.g.: https://soundcloud.com/community/fellowship-wrapup

Add

Some of the supported services:

Maximum upload file size: 5 MB.

Processing...

This post was created with our nice and easy submission form. Create your post!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళా లైంగిక వేధింపు నిరోధక , నిషేధ మరియు సంస్కరణ చట్టము

స్వేచ్చగా ఎగురు