యూని”వర్సిటీ’ లైఫ్…

ఇదొక గోప్ప అనుభవం…మధురమైన అనుభూతి…!!

గమ్యం ఏటో తెలియకుండా మొదలైంది నా పయనం. ఈ జీవితపు రైలు చక్రాలు  ఎటు నడిస్తే అటే ఇక!!

మాదొక చిన్న పల్లెటూరు…ఏకైక కూతర్ని  కాదు గానీ..కనిష్ఠ పుత్రికను నేను!

 మా ఊరికి ఓ మూడు మైళ్ల దూరంలో పదవతరగతి వరకు చదివాను…  జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు…ఓకే బెంచీ లో కూర్చున్న వాళ్ళం కూడా తరువాత ఒకే కోర్సులు చదవలేదు. ఎవరి అభిరుచిని బట్టి మార్గాన్ని ఎంపికచేసుకున్నాం….

 మరో ఇరవై మైళ్ల దూరంలో గురుకుల కళాశాలలొ నా ప్రీ డిగ్రీ పూర్తిచేసాను. మరో యాభై మైళ్లలో డిగ్రీ కుడా పూర్తయింది.ఇప్పుడే మొదలైంది అసలైన ఘట్టం….ఇప్పుడే తీసుకోవాలి అతి కీలకమైన నిర్ణయం… జీవిత గమనాన్ని నిర్దేశించే మలుపు ఇది…

“కష్టే ఫలి’.. అనుకున్నట్లు గానే నేను  అనుకున్న విశ్వవిద్యాలయం లోనే  నాకు సీటు వఛ్చింది. అక్కడ చదుకోవాలనేది నా అభిలాష!!

ఇదొక గమ్మత్తైన ప్రపంచం..నిజమే ఇదొక వింత ప్రపంచమే… బయటి టైమూ….మనుషులు ఆచారాలు..అలవాట్లు అన్నీ వేరే….

మెదటి రోజు కాలేజీ కి వెళ్ళేటప్పుడు..’ జుట్టుకి నూనే రాసుకుని వెళతావా..?? అన్న నా సహచరిని మాటలు వెరైటీ గా అనిపించాయి నాకు…. ఈ కాస్త శ్రద్ధ లేకపోతే ఉన్న చీపురుకట్ట కాస్త కొత్తిమీర కట్టైనా ఆశశ్చర్యం లేేదు..!!

       స్వదేశీయులకన్నా  విదేశీయులతోనే నిండిపొయింది క్యాంపస్. కొత్తదనం వాతావరణం మనుషుల్లోనే కాదు…భోజనం లో కూడా… చప్పటి మెతుకుల పప్పు, చిన్నరొట్టే,కూరగాయ తొక్కు,చారు ,పెరుగు…… కంచం ఎంత నిండుగా ఉన్నా నా కడుపుని మాత్రం నింపలేకపోయాయి…

     నేనో చిన్నపాటి భక్తురాల్ని ప్రతీ శనివారం  తలంటుకుని,కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుని పోతే…తదేకమైన చూపులు…మా స్నేహితుల కాంప్లిమెంట్లు..కామెంట్లు…

మనం ఉండే చోటు మారినా…మనం మన సాంప్రదాయాలు…అలవాట్లు మారవు కదా మరి!!

      ఒక్కోసారి గడవమన్నా గడవని కాలం ఇక్కడ చక్రాలేసుకుని మరీ పరిగెడుతుంది…రోజు కాలేజీకి వెళ్ళటం రావటం ఇరవైనాల్గు గంటలు సెకన్లలాగ గడిచేవి…ఇక్కడ కాలం మనుషులు రెండూ ఫాస్టే…!!

కొత్త విద్యార్థులకు టీ పార్టీ కహానీలు..కబుర్లు..ఆటపాటలతో స్వాగతం పలికారు మా సీనియర్లు…ఆ కార్యక్రమంలో వర్షం కూడా మాతో పాల్గొంది.

మళ్ళీ పక్షం రోజులకే ఫ్రెషర్స్ పార్టీ…ఆ చల్లటి సాయంత్రాన..లైట్ల వెలుగులు…తారలు..

బాగానే తయారయి వెళ్ళాం…

వారి కళలతోఅందర్ని ఆశ్చర్యగొలిపారు…ఒక్కొక్కరు ఒక జాతిరత్నమే…!!

ఆరోజు సందడి గురించి చర్చించుకునే లోపే..సెమిస్టర్ వచ్చేసింది… వారం రోజులల్లోనే ప్రశ్నాపత్రాలు గాల్లో ఎగిరాయి.

      ఏమాటకామేటె చెప్పాలి..స్నేహం ఎక్కడైనా తీయని ఫలమే… రకరకాల పండ్లరసం లాంటిది ఆరోగ్యమూ..ఆనందమూ..!

మా మిత్రులగురించి ఒక్క మాటలో చెప్పాలంటే…

‘కెంపులు…రత్నాలు…పగడాలు..ముత్యాలు  అన్ని కలగలసిన హారం” అలా ఉంటాం మేమంతా…

      నాకూ…నలుగురు ఆణిముత్యాలు దొరికారు…మా కాలక్షేపంలో సమయం రన్నింగ్ రేస్ పెట్టినట్లు పరిగెడుతుంది…

       ప్రతీ ఒక్కరి జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయే కొన్ని గోల్డెన్ డేస్ ఉంటాయి..అవి కాలేజీ రోజులనటం లో సందేహం లేదు…

   ఏదేమైనా…కొన్ని రోజుల తరువాత ఈ అనుభూతుల  గురించి…అవి కష్టాలైనా..ఇష్టాలైనా..కలహమైనా..స్నేహమైనా…ప్రేమైనా..ఈ జ్ఞాపకాలన్నింటిని

తమవైన అనుభవాలను నెమరవెస్కుంటూ అనాల్సిందే…” ఆరోజులూ…మళ్ళీ రావూ…ఈరోజుల్లా కానేకావు!..అంతే లేని ఆనందాలు…

వెంటే వస్తే అంతే చాలు..!!!

Written by Sushma Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

రమక్క తో ముచ్చట్లు -21