అమృతలత మేడమ్ ను మొదటిసారి మేము (నీహారిణి వదినగారు,వేణుగోపాలరావు అన్నయ్య,మా శ్రీవారు, నా చిన్నబిడ్డ వైణిక) కలసి నా పెద్ద మనవరాలు కేయూరాను బాసర సరస్వతి అమ్మవారి గుడికి తీసుకొని వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వదినగారు ఒక్కసారి అమృత లత మేడమ్ ను కలసి వెళ్దామంటే అందరమూ మేడమ్ స్థాపించిన విద్యా సంస్థ(School)లో కలిసాము. మేడమ్ ను చూసిన వెంటనే ఆమె మీద గౌరవభావం ఏర్పడింది.
తను చాలా విద్యా సంస్థలను స్థాపించారు అని తెలిసి ఆశ్చర్యమేసింది, అయినా చాలా సాధారణంగా కనిపించడం ఆమె గొప్పతనము. మా అందరిని ఎంతో ఆత్మీయంగా పలకరించి తనతో పాటు స్వయంగా తను స్థాపించించిన శ్రీ వెంకటేశ్వర దేవాలయము కు తీసుకొని వెళ్లి దగ్గర ఉండి అది స్థాపించడం ఎలాజరిగిందో వివరించారు. అదే కాక కళ్యాణ మండపం కూడా నిర్మించారు, అదంతా చూసాక మేడమ్ వాళ్ల ఇంటికి భోజనానికి తీసుకెళ్ళారు, వారి అతిథి మర్యాదలకు విస్తూపోయాము. వారి ఇల్లు ఒక ఇంద్ర భవనం లా నిర్మించారు, అదే కాక ఇంటిని చాలా బాగా అందంగా అలంకరించారు, దానితో తన కళాహృదయం అర్థం అవుతుంది.
మేడమ్ స్వీయ చరిత్ర చదివాక తను ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అనిపించింది. పుస్తకాన్ని పూర్తిగా చదివాను, తన జీతం ఎన్నో కష్టాలను అనుభవించిన కూడా ఎంతో నిలతొక్కుకొని ఈ స్థాయికి చేరడము అనేది సాధారణ విషయం కాదు, సామాన్యులకు అస్సలే సాధ్యమయ్యే విషయం కాదు.
కనుక ఆమె ఒక అసాధారణ వ్యక్తి అని అర్థమవుతుంది.
మేడమ్ కథలో నాకు బాగా హృదయానికి హత్తుకున్న విషయము ఏంటంటే వారి నాన్న గారు పరమపదించిన సమయం లో తను నిజామాబాద్ నుండి వారి ఊరికి చేరే విషయము చదువుతుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఏం జరిగిందంటే తనకు వాళ్ల నాన్న పోయారని తెలిసినప్పటికీ రాత్రి వాళ్ల ఊరి చివరి బస్ కూడా వెళ్లిపోయింది. కానీ ఎలా అయినా వాళ్ల నాన్నను చివరి సారీ గా చూడాలనే తపనతో ఎలాగా అయినా ఊరికి చేరాలనే పట్టుదలతో ఆ రాత్రి భయలుదేరడం అనేది అనూహ్యం. ఆ రాత్రి ప్రయాణం చాలా భయంకరమయినది, ఏమి దొరకకపోతే అర్ధరాత్రి కొంత దూరం లారీ లో వెళ్లి అక్కడి నుండి ఊరి వరకు రిక్షాలో ప్రయాణం చేయడమనేది మామూలు విషయమూ కాదు.
మేడమ్ ఎడమ చేతి వేళ్లు ఎలా పోయాయో విషయము కూడా అనిర్వచనమయింది.
తన అవటి తనాన్ని చూసి కూడా ఒక పెద్దమనిషి ఆమెను వివాహము చేసుకుంటే ఎంతో పెద్ద మనసు కలవాడు అనుకోవడ జరుగుతుంది, కానీ అది ఎంత కాలము నివాలేదు ఒక అమ్మాయి పుట్టాక వదిలేయడం తో ఆమెకు ఇంకొక పరీక్ష మొదలయ్యింది.తన బిడ్డ ను వంటరి గా పెంచడం, సమాజం లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ తన కూతురిని విద్యాబుద్ధులు నేర్పించి మంచి విద్యావంతురాలిని చేసి మంచి గుణవంతుడు సంస్కారవంతుడైన అబ్బాయిని తెచ్చి వివాహము చేసినారు. ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికా లో ఉటున్నట్టు చెప్పారు.
చివరిగా చెప్పవలసింది ఏంటంటే తన కష్ట సమయాలలో తన తోబుట్టువులు తనకు అండగా ఉన్నారని తెలిపారు, అది చాలా ప్రశంసనీయం. అమృతలత మేడమ్ ఇంకా పది కాలాలు ఇలాగే విద్యా దానం చేస్తూ , శ్రీవేంకటేశ్వరుని సేవలో తరించాలని మనసార కోరుకుంటూ ఆ భగవంతుడు ఆమేకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ ఆమె కు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను