పుడమిని పచ్చని కావ్యంగా మలిచిన చేతులు,
ఈ నేల ఎడారిగా మారుతుంటే
చివరికి కన్నీటి సంతకంతో
తమ ఉనికినే వేలం వేసుకొంటున్నారు రైతన్నలు..!
కాయ కష్టానికి కాసుల కరువై,
అప్పుల భారమైన వేళ…
కన్నతల్లి వంటి నేలను అమ్ముకొని
కన్నీటి బాటలో పయనమవుతున్నారు రైతన్నలు..!