అలుపెరుగని శ్రామికురాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా

డాక్టర్ అరుణాపరంధాములు తెలుగు అధ్యాపకురాలు భువనగిరి మహిళా కళాశాల.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అలుపెరుగని శ్రామికురాలు
అలసట తెలియని ప్రేమికురాలు
అత్యంత పనిమంతురాలు
అందర్నీ ఆదరించే గుణవంతురాలు
అమ్మ అనే పిలుపు కోసం
ఆరాటపడే ఆత్మీయురాలు
ఆడది అని పిలిపించుకునే దురదృష్టవంతురాలు
ఆధారపడి బతకాలని నిర్ణయించబడ్డ నీచురాలు
అందరి కడుపులు నింపే కరుణామయురాలు
అందరి చేత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పించుకుంటున్నా మహనీయురాలు

డాక్టర్ అరుణాపరంధాములు
తెలుగు అధ్యాపకురాలు
భువనగిరి మహిళా కళాశాల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళ

నీలాకాశంలో నక్షత్రం