ఆలోచనల బంధిఖానా

కవిత

   బండ అరుణారెడ్డి

అరిషడ్వర్గాలలోపల
అనుభవం అందించిన
అందమైన జైలుగోడలా
గతవర్తమానాల వారధిలా
జాగరూకతల ఊచల్లా
కదిలీ…కదలనట్లున్న
మనిషి జీవితం
ఓ కవనంలా
ఓకథనంలా
కడలికెరటంలా
ఒక బంధిఖానానుండి
మరొక కార్ఖానావైపుకు నడక…
ఒక చట్రం నుండి
మరో ఛత్రం కిందికి
ఆలోచనల బంధీయై
జైలు – బెయిలుల మధ్య
నిరంతరం తిరిగే బొంగరంలా..
అటుపై ఆశల తీరం ఆవల
కోరికల కోవెల లోపల
మిణుకుమిణుకు దివ్వెలా
మనిషి ఊగిసలాట ఓకల…

Written by Banda Aruna Reddy

బండ అరుణారెడ్డి
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,
MGKLISP నాగర్కర్నూల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిరంతర ప్రవాహి -శ్రీమతి గుడిమెట్ల శారద

తరుణి _తరణి..