ఆషాడం – ఆచారం

ఆషాడ మాసం కొత్తగా పెళ్లయిన దంపతులు ఒకచోట ఉండకూడదు అనడానికి ప్రధాన కారణం….

ఆషాడ, శ్రావణ మాసాలలో వర్షాలు నిండుగా కురుస్తాయి. వర్షాలు కురవగానే తప్పకుండా విత్తనాలు నాటుకోవడం చేయాలి. వర్షం కురువగానే ఆ ఇంటి పెద్ద తెల్లవారక ముందే లేచి పొలం పనులకు వెళ్లటం జరుగుతుంది. కానీ అంతకుముందు నెలల్లో కొత్తగా పెళ్లయిన దంపతులు హాయిగా నిద్రపోతుంటారు. అది చూసిన అత్తగారు భర్త పొలానికి వెళ్లడం…. కొడుకు కోడలు ఇంకా నిద్ర లేవకపోవడం చూసి కోడలితో పెద్దవారు మామగారు లేచి పొలం పనులకు వెళ్తుంటే నువ్వు ముందు లేచి నీ భర్తను మామగారి కూడా వెంట పంపాల్సిన బాధ్యత నీది కాదా? అని కోడల్ని నిందించటం జరుగుతుoది. అప్పుడు ఆ కోడలు చిన్న బుచ్చుకొని ముభావంగా ఉండటమో…. లేదా అత్త గారితో గొడవ పడటం …భర్తని సూటిపోటి మాటలు అనటం చేస్తుంది. అలా చేయటం వలన ఆ ఇంట్లో గొడవలు మొదలై మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ పేరుతో నూతన దంపతులను కాస్తయడంగా ఉంచితే తండ్రి కొడుకుకి సాయం గా ఉంటాడని తద్వారా తర్వాత వచ్చే ఆరు నెలలు కడుపునిండా భోజనం చేయగలరని… అలాగే కోడలికి కూడా అత్తవారి ఇంటి మీద భర్త పైన బెంగగా ఉండి తిరిగి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా గడపగలుగుతుందని పెద్దలు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ ఆచారాన్ని తేవటం జరిగిందట.
ఆషాడ మాసం కొత్త దంపతులును వేరుగా ఉంచడానికి గల ప్రధాన కారణం ఇది. ఎటువంటి అరమరికలు లేకుండా వారి భావిజీవితం, దాంపత్యం సజావుగా సాగటానికి పెద్దలు నిర్ణయించిన చక్కటి పరిష్కారం.

సర్వేజనా సుఖినోభవంతు

ప్రవచనకర్తల సౌజన్యంతో

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తులసి

ఆషాఢం