హాయిగా ఆట పాటలతో గడిచిపోయే బాల్యం నుండి చదువు పూర్తి చేసుకోవడం, బాధ్యతాయుతంగా ఉద్యోగాన్ని సంపాదించుకోవడం ఇవన్నీ అందరి జీవితాల్లో ఉండేవే. ఉద్యోగం చేయడం నచ్చని వాళ్ళు వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఎలా సంపాదించుకున్న జీవితాన్ని తమకిష్టమైన పద్ధతిలో అనుభవిస్తుంటారు.ఈ జీవన పరిణామ క్రమంలో కొడుకు, కూతురు అనే అనుబంధాల నుండి అమ్మాయిలకు అబ్బాయిలు అబ్బాయిలకు అమ్మాయిలు జతకుదురుచుకుని, భర్త భార్య అనే స్థానాలకు ఎదిగిన తర్వాత తల్లి తండ్రి అనే పరిణతి దశకు వచ్చినప్పుడు పరిస్థితులు మారిపోతాయి.
కన్న తల్లిని క్షణం వదిలిపెట్టకుండా ఉండాలనిపించే బాల్య చేష్టల ఆలోచన నుండి భార్య కావాలని కోరుకోవడం భర్త కావాలని కోరుకోవడం సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. కానీ ఎంత ఎదిగినా కన్నవాళ్ళను దూరం చేసుకోకుండా ఉండాలి. ఇది తెలుసుకోవాలంటే,
“తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు/ పుట్టనేమి వాడు గిట్టనేమి /పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అన్నాడు ఒక కవి. చెదలు చెట్టు లోపల మట్టి లోపలను దాగినంతవరకు ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయి. ఎంతటి పెద్ద చెట్టునైనా తిని పడేస్తాయి కానీ ఎప్పుడైతే గాలి వెలుతురు వాటిపై వస్తాయో చనిపోతాయి. అందుకే కవి మూలస్థానాన్ని వదిలిన వ్యక్తి ఈ చెదల వంటి వాడే అని.అంటే, బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కాకుండా ఉన్నవాళ్లు సమాజ మనుగడ పరిశీలించక తల్లిదండ్రులను దూరం చేసుకునేవాళ్ళు పనికిరాని ఏవిధమైన ఉపయోగం లేని చెడును మాత్రమే చేసే చెదపురుగులతో పోల్చాడు.ఎంత విలువైన వాళ్ళో వాళ్ళ మనుసులు విరిగాక కానీ అర్థం చేసుకోలేరు. ఇది కన్నతల్లి మీద మరీ ఎక్కువ ప్రభావం పడుతుంది.
Take it as grant అన్నట్టు తల్లి మీద ఎక్కువ చొరవతో చనువుతో పెరుగుతారు కాబట్టి. ఎందుకంటే స్త్రీలు ప్రసూతి, delivery తర్వాత harmonial imbalance వలన ఆరోగ్యాన్ని కోల్పోయి శరీరము మనసు ఒక విధమైన వస్తులో పడిపోతుంది. అయినా తన కన్న పిల్లలను ఎంత ఓపిక ఉన్నా లేకున్నా లాలిస్తుంది. ఇది సహజ సిద్ధంగా వచ్చే ప్రేమవల్ల. తండ్రికి బాధ్యత ఉంటుంది కానీ ఈ బాధ ఉండదు. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిందే. గర్భంతో ఉన్నప్పుడు పొట్ట పెరుగుతుంటే చర్మంపై విపరీతమైన దురదరావడం, దానితో rub ఇస్తారు కాబట్టి స్ట్రక్చర్స్ గీతలు పడడం, రొమ్ము లు పెరిగి, చను మొదళ్ళలో నొప్పి వంటి బాధలు ఆమెపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. Estrogen , Progesterone hormones వల్ల ఈ మార్పులు వస్తుంటాయి. పిల్లలు పాలుతాగడం కోసం కొరకడం లాగడం చేస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. కోపం తెచ్చుకున్నా, విసుగు పడినా ” అబ్బా” అంటూ అరిచినా …. ఏం చేసినా పాలు రావడం తగ్గిపోతుంది, పాలు వెనక్కి పోతాయేమో నా శిశువుకు నా పాలు అవసరం అని అనుకుంటుంది కాబట్టి తనకు గతంలో లేని సహనాన్ని కోరి తెచ్చుకుంటుంది. అన్ని కష్టాలను భరిస్తుంది. డెలివరీతో వచ్చిన ఈ మార్పును తల్లి మాత్రమే అనుభవిస్తుంది. తండ్రి ఆమె కొరకు ఆరాటపడతాడు.అందుకే తల్లి అంటే మరింత… మరింత… ఎక్కువ అని అభిప్రాయం. కొంతమంది తల్లులకు ప్రసూతి తర్వాత పాలు పడవు. అది వాళ్ళ తప్పు కాదు. కొంతమంది డెలివరీ నొప్పులు పడకుండా ఆపరేషన్ చేసి పిల్లల్ని తీస్తారు అది వాళ్ళ తప్పు కాదు. ఎవరు కోరి చేసుకోరు. కొందరు ఈ మధ్యకాలంలో మరీను ఆరోగ్యం అన్ని విధాలా బాగున్నా పరిస్థితులు కూడా బాగున్నా పిల్లల్ని కనకుండా ఎవరైనా అనాధలను తెచ్చుకొని పెంచుకుందాం అనుకుని మరి పెంచుకుంటున్నారు. వాళ్లకి కూడా గర్భం దాల్చడం, డెలివరీ ,పాలు నొప్పులు ఇవి ఉండవు కావచ్చు కానీ ఏ తల్లి కైనా తప్పని కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆహారాన్ని అందించడం ఒకే అయితే మలమూత్ర విసర్జనలు చేస్తున్న పిల్లల్ని సాకడం మరో ఎత్తు. ఇవి ఏ తల్లి కైనా తండ్రి కైనా తప్పని బాధలు. కానీ వాటిని బాధలు అనుకోరు, కష్టమే అయినా ఇష్టంగానే చేస్తారు. పూర్వకాలంలో లంగోటీలు కట్టి మలమూత్ర విసర్జన బాగోగులు చూసేవాళ్ళు. ఆ పీతి గుడ్డలను ఉతికి శుభ్రపరచి వాళ్లు. ఈ కాలంలో డైపర్స్ వచ్చాయి. అవైనా క్లీన్ చేయాలి కదా! అంతేకాదు పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి . ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరైన సమయంలో నడక, మాట, మనుషుల్ని గుర్తించడం వంటివేవీ సరిగా చేయకున్నా ఇక ఆ తల్లిదండ్రుల బాధ ఊహాతీతం. ఈ స్టేటస్ లను అన్ని దాటుకొని బడిలో వేయడం,చదువు చెప్పించడం దగ్గరికి వచ్చేసరికి పిల్లలకు చదవు అర్థం అవుతుందా కావడంలేదా పరీక్షల్లో ఎలా కృతజ్ఞులవుతారో అనే భయం అదొక ఎత్తు. ఈ స్థితిలో నీ దాటుకున్న తర్వాత యుక్త వయసు రాగానే ఈ పొరపాట్ల వైపు మొగ్గు చూపుతారనే ఆందోళన ఎక్కువవుతుంది.వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఎంచుకుంటే బాగుంటుంది. ఎవరైతే అలా చేయరో వాళ్ళని చూస్తే కన్న వాళ్ళకి కష్టాల ఊబే ఇంకా. కక్కలేక మింగలేక తమలో ఆమె కృంగిపోతారు. వయసు వచ్చాక ప్రేమించడం పెళ్లి చేసుకోవడం సహజం కదా ఎందుకు మా పిల్లలు చేసుకోవడం లేదు అనేదీ అనవసరమైనటువంటి ఆరాటం అని కొట్టి పడేయలేం. వాళ్ళు ఎంచుకున్న జీవిత భాగస్వామి వాళ్లకు సరైనదో కాదు అని తెలుసుకున్నారో లేదో అని ఆత్రుతగా ఉంటుంది. ఇవన్నీ ప్రపంచంలోని ఏ తల్లిదండ్లకైనా సమానమే. కానీ కన్నతల్లికి పిల్లల్ని పెంచినంత సేపు వాళ్ళని హృదయపూర్వకంగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి పిల్లల మనస్తత్వాలు ఇట్టే పసిగట్టేస్తుంది కాబట్టి ఇక అక్కడ ఏమీ చేయలేక అత్తగారు స్థానాన్ని పదులపరుచుకుంటూ జీవిస్తుంది. అందుకే “కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు/ నష్టపెట్టబోకు నాన్న పనులు/ తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా ” అన్నాడో కవి. మన భారత దేశ వివలలో తల్లికి దైవ స్థానం ఇచ్చారు పెద్దలు. తండ్రి కన్నా, గురువు కన్నా, అతిథిలకన్నా ప్రథమ స్థానాన్ని ఇచ్చారు.
” యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితాః
యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితాః
యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితాః” అని కూడా బుద్ధికీ శక్తికి
సర్వవస్తల్లోనూ మాతృ స్థానాన్ని ప్రత్యేకంగా చెప్పారు.
” యత్ర నార్యంతు పూజతే రవంతే తత్రదేవతాః” కనిపించని దేవుడి కన్నా కనిపించే కన్నతల్లి మిన్న. తల్లే కావాలని కాదు స్త్రీమూర్తులందరికీ కూడా ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో అక్కడే దేవతలు సంచరిస్తారని చెప్పారు.
ఇంతటి చక్కటి సంస్కరణాభిలాషతో మంచి మాటలు చెప్పిన దేశం మనది.
కానీ ఎప్పుడైతే ఈ ఆధునిక యుగంలో 1910లో అమెరికా దేశంలోని వర్జీనియా రాష్ట్రంలో , ఉడ్రోవిల్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ప్రారంభించిందో అప్పటినుంచి ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆరంభం చేసినప్పటి నుంచి భారతదేశం కూడా నిర్వహిస్తున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి వైపు మార్గం వేసే దిశగా, కొత్త తరానికి కూడా ప్రేరణగా ఉండేలా మనదేశం కూడా కొత్త అడుగులు వేసింది. ఈ పరిణామాన్ని కూడా ఆహ్వానించాలి.
పెరిగిపోతున్న అన్యాయాలను, తరిగిపోతున్న విలువలను దృష్టిలో పెట్టుకొని స్త్రీలకు ఏ విధంగా తిరిగి మాతృ స్థానాన్ని గౌరవపరిచాలా అని ఆలోచిస్తూ ఉంటే మరోవైపున ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు ఈ వైవిధ్యమైన విషయాలను తరచి చూస్తే ఆలోచనాపరులకు తప్పకుండా ఆవేదన కలిగిస్తుంది. 72 వ మిస్ వరల్డ్ పోటీలు 2025 సంవత్సరానికి గాను మే 7 నుంచి 31 వరకు హైదరాబాదులో జరపడానికి నిశ్చయించడం చూస్తున్నాం. 1996లో బెంగళూరులో 2023లో ముంబైలో మన దేశంలో జరిగాయి. స్త్రీవాదులు గొంతెత్తి ఎదుర్కొన్న సంఘటనలో ఉన్నాయి. అయినా ఏది ఆగదు. ఏవీ సామాన్యులు పట్టించుకోరు. మాన్యులకు తీరిక దొరకదు. కేవలం వ్యాపారులకు మాత్రమే ఉపయోగమైన ఈ పోటీలు స్త్రీలను కించపరుస్తున్నావా? స్త్రీలను అందలాలెక్కిస్తున్నవా? తెలుసుకోలేని ఒక మూర్ఖపు, ఒక అయోమయ వాతావరణంలో ఆడవాళ్లంతా పడిపోయారు.
ఆడవాళ్లే కాదు సభ్యసమాజము తేల్చుకోలేకపోతున్నది. ఇప్పుడైతే సమాజమంతా లోతైన చర్చ చేస్తుందో అప్పుడే ఫలితాలు బాగా వస్తాయి. What is the ultimate philosophical truth అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇటువంటి సందర్భంలో బాల బాలికలపై యువతపై చెడు ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడడానికి మన మూలకందాలైన మాతృదేవత స్థానాన్ని ఇచ్చిన మనవైన ఆచార వ్యవహారాలను మరొక్కసారి మరొక్కసారి తరచి తరచి చూడాల్సిన అవసరం ఉన్నది.
ఆడవాళ్ళను దైవంతో భావిస్తూ అమ్మవారి కటాక్షం అంటూ ఉన్న దేశం అమ్మకు ఒక్కరోజు ఏంటి? అనే వితండవాదాన్ని వదిలేయాలి. సినిమాల్లో హీరోయిన్ అందంగా లేకుంటేనే విమర్శించే మనస్తత్వం ఉన్న మనుషులందరికీ మదర్స్ డే ను, అందాల పోటీలను విమర్శించే హక్కు లేదని గ్రహించాలి.
హాయిగా ఆటపాటలతో గడుపుతున్న బాల్యంలోనే ఇంట్లోని సభ్యులంతా బాధ్యతగా సంస్కారాన్ని నేర్పిస్తే… అది కూడా నేర్పించినట్టుగా కాకుండా తామే అలవర్చుకుంటూ ఉంటే పిల్లలు పెద్దవాళ్ళను చూసి నేర్చుకుంటారు. అందుకే- ” అమ్మలను గౌరవిద్దాం! ఆడవాళ్లనూ గౌరవిద్దాం!!”
ఇదే ఒక పెద్ద ఇంటి పని! It’s a big Homework !!