ఇంతి చేవ్రాలు

కవిత

 

మా ఇల్లు మనసున్న రత్నగర్భ
తన కడుపులో ఎంతమందినైనా ఆర్తిగా పొదుముకుంటుందిట్టే

మా అలారం గడియారానికి ఎదిరించడం అస్సలురాదు అందరితో
పీక నొక్కించుకుంటున్నా కిక్కురుమనదు పాపం

మా టీవీకి హృదయ వైశాల్యం
మరీ ఎక్కువ
అడ్డమైన చెత్తంతా మదినిండా నింపుకుని
అవసరమెరిగి వినోదాన్ని పంచుతుంటుంది

కొడుకు దశను దాటుతున్న మా
అబ్బాయి తలూపడంలో దిట్ట
అదే వాడికి మునుమందు శ్రీరామరక్ష

పెళ్లీడుకొచ్చిన మా అమ్మాయి పొదుపు పాఠాలు నేర్వడం మొదలుపెట్టింది
పాపం జానెడు గుడ్డ ముక్కలతో సర్దుకోవడం నేర్చుకుంటుంది

ఆధునికత అంటేనే గిట్టని
మా ఇంటి పెద్దదిక్కు పిదపకాలమంటూ తిట్ల
పురాణం వల్లిస్తూ కాలక్షేపం చేస్తుంటుంది ఎల్లవేళలా…

అసహనానికి మారుపేరైన శ్రీవారేమో!
చిటపటలాడే ముఖానికి చలువలేపనం అద్దాలని
యోగిపుంగవునిలా మారి
ముక్కు మూసుకుని పిరమిడ్ ను ఆశ్రయిస్తారు

రాధికాసూరి

నేనేమో వంటింటి సామ్రాజ్ఞినాయె! ఇసిరెలతో కసరత్తు చేస్తూ
కూరగాయల కుత్తుకలు తీసి షడ్రుచుల ఓగిరాన్ని సిద్ధం చేస్తాను దిగ్విజయంగా!

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కనుపర్తి వరలక్ష్మమ్మ

కుమారి ఐశ్వర్యరాయ్ తో ముఖాముఖి