ఈ సంత్సరమైనా…

కొత్తగ క్యాలెండర్లు ఎన్ని పుట్టినా
ఎన్ని రోజులు గడిచినా
ఎన్ని తేదీలు మారినా
మన బతుకుల్లో కష్టాలు తగ్గుతయా
మన బాధలు తీరుతయా

క్యాలెండర్లు కొత్తగా పుట్టినట్టు
మన బతుకుల్లో
సంతోషపు పువ్వులు కొత్తగా పూస్తయా
బాధలు ఆనందాల జల్లులలో కొట్టుకుపోతయా
ఐనా ఎన్ని కొత్త క్యాలెండర్లు చూసినా
కన్నీరు మనల్ని వీడి
సంతోషమొచ్చి మనతో దోస్తాన్ చేస్తదా

అవును కొత్త సంవత్సరం ఒచ్చిందని
సంక్రాంతికేసే ముగ్గుల్లోని రంగులొచ్చి
అంధకారంలో అంతమైపోతున్న మన జీవితంలో
కొత్తగా రంగులుచ్చి వాల్తయా
మనకి ఎన్ని కొత్త ఏడాదులు ఎదురైపోయినా
ప్రతీసారి బాధల అగ్ని వర్షమే కురిసింది తప్ప ‌
ఎప్పుడైన ఆనందాల వర్షం కురిసిందా

ఔనూ కొత్త క్యాలెండర్లు అచ్చైనయని
మన జీవితంలో
రోజూ నడిచే ముళ్ళదారులు మాయమైపోయి
పూల బాటలు ప్రత్యక్షమైతయా
ఇది విచిత్రం కాకపోతే
గిసుంటి ఎన్ని కొత్త సంవత్సరాలు ఎదుర్కొన్నా
పేదరికపు పంజరంలోంచి తప్పించుకొని
ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛా పక్షులమైతమా

ఏమో! కానీ
ఎప్పటిలా మాకు బాధ మిగిల్చకుండా
ఈ సంవత్సరమైనా
మాకు సంతోషాలను తెచ్చి పెట్టే
కొత్త సంవత్సరం కావాలన్నదే మా ఆకాంక్ష

Written by P. Bhavyasri

9వ తరగతి
జి.ప.ఉ.పా రంగంపేట,మెదక్ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నదీమతల్లి-9వ భాగం

కొత్త సంవత్సరం మరో అవకాశం