ఎంత బాగుండో

కవిత

నాకే పసివయసు వస్తే
ఎంత బాగుండో!
కాలం నన్ను
వృద్ధాప్యంలోకి
నెట్టేస్తుంది
నవ యవ్వనం వస్తే
ఎంతబాగుండో!
పసిపిల్లనైతే
ఎంత బాగుండో!
కాలచట్రంవెనక్కి
తిరిగితే ఎంత బాగుండో!
పాకే ప్రాయం వస్తేఎంత బాగుండో!
తస్మా జాగ్రత్త
అంటూ కాలం నన్ను హెచ్చరిస్తుంది.
నా మనసు
ఆ హెచ్చరికని
స్వీకరించనటోoది
కాలాన్ని వెనక్కి
పంపే శక్తి
నాకుంటే
ఎంత బాగుండో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు -షహనాజ్ బతుల్!

లోటికా సర్కార్