ఎగురుతోంది- ఎగురుతోంది

పాట

ఎగురుతోంది ఎగురుతోంది
మువ్వన్నెల జెండా ,ఆకాశం నిండా
స్వాతంత్ర్య జ్యోతియై ఎగురుతోంది
ఎగురుతోంది…

1.చ.  వందేమాతరమని నినదించిన
త్యాగధనుల బలిదానం
సత్యాగ్రహ,ఉద్యమాల
స్వాతంత్ర్య యోధుల శ్రమఫలితం..
దాస్య శృంఖల విచ్ఛిన్నం
దేశమాతనలరించిన స్యాతంత్ర్యం..
!!ఎగురుతోంది!

2.చ. ఎనభై వసంతాలు నిండిన
స్వాతంత్ర్యపు పండుగా
స్వయం సిద్ధ భారతమిదియని
చాటిచెప్పే మెండుగా
ఇంటింటా ఎగురవేయు త్రివర్ణ పతాకం
భరతమాత హృదినిండిన సంతోషపు
సంబరం…!! ఎగురుతోంది!!

3.చ. కోట్ల జనులు ఐక్యమై
ఆలపించు వందేమాతర గీతం
దేశభక్తి,రాష్ట్రభక్తి పెరిగేందుకు సంకేతం
జనగణమన అధినాయక జయహే
జయహే అంటూ, నలుదెసలా
ఘోషించును జెండా వందన గీతం… ! ఎగురుతోంది!

Written by Savithri Ranjolkar

సావిత్రి రంజోల్కర్,నవీముంబై*
9833497812

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రావి సీతాదేవి

పసిదనంతో ప్రయాణం (కాలమ్ 11)