
రామాయణంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు సంజీవనీ ఆకులు తెమ్మని హనుమంతుణ్ణి పంపిస్తారు. హనుమంతుడు తెచ్చిన సంజీవనీ చెట్టు ఆకుల్ని వాసన చూపించి లక్ష్మణుడ్ని మూర్ఛ నుంచి మేల్కొలిపారు. భూమ్మీద ఉన్న ఎన్నో చెట్లులో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అటువంటి వాటిలో కొన్ని ఝౌ షధ మొక్కల్ని సేకరించి, వాటి శాస్త్రీయ నామాలు, వాటి ఉపయోగాలు చెపుతూ పిల్లల కోసం చార్టులు తయరు చేశాను. ఎక్కువ బొమ్మలు, తక్కువ రాతల ద్వారా పిల్లలను విజ్ఞాన వంతుల్ని చేయాలనే ఆకాoక్షతో నేనీ చార్టుల నిర్మాణం 2006లో మొదలు పెట్టాను. పక్షులు, పువ్వులు, ప్రకృతి అంటూ రకరకాల థీమ్ లతో దాదాపు 600 చార్టులు చేశాను. ఈ ఛార్టుల చుట్టూ డిజైన్ గా తెలుగు అక్షరాలను ఉపయోగించాను. మీకు అప్పుడప్పుడు ఇలా కాన్నింటిని పరిచయం చేస్తాను.
మొదటగా మెనిస్పెర్మేసి కుటుంబానికి చెందిన తిప్పతీగ ను గురించి తెలుసుకుందాం. దీనిని అమృత, గుడుచి, అని కూడా పిలుస్తారు. యునాని లొ దీనిని ‘గిలీ’ అని పిలుస్తారు. హిందీ లో ఈ తిప్పతీగను ‘గిలో’, ‘గుర్చా’ అని పేర్లున్నాయి. దీని మొక్క శాస్త్రీయనామం “టీనోస్పోరా కార్డిఫోలియా”. ఈ తిప్పతీగ మొక్కలో వేరు, కాండం వైద్య పరంగా ఉపయోగపడుతాయి. వీటి ఆకులు హృదయాకారంలో ఉంటాయి. ఇది తీగ జాతి మొక్క. వాడిపోయిన మొక్కను వాడేకన్నా, పచ్చిగా ఉన్న మొక్కలు చక్కగా సమర్థవంతంగా పని చేస్తుంది.
తిప్పతీగ రసం మూత్ర సంబంధ వ్యాధులకు, జలుబు జ్వరాలకు ఉపయోగపడుతుంది. ఆకలి మందగించడం, డయాబెటిస్, రుమాటిజమ్, డిస్పెప్సియా వంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. కొమ్

మను కత్తిరించి అంటు పెట్టడం ద్వారా కొత్త మొక్కను మొలకెత్తించవచ్చు. ఎర్రటి పండ్లు గుత్తులుగా పూస్తాయి.
కాండం నుంచి తీసిన రసాన్ని నేరుగా నోటిలోకి తీసుకుంటే ఒక్కొక్కసారి కొంతమందికి తలనొప్పి, ముక్కు నొప్పి వస్తుంది అలాగే చర్మానికి వీటి రసాన్ని పూసినప్పుడు కొంత మందికి మంట, దురద మరియు ఎరుపుదనం వంటివి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే గర్భధారణ సమయంలోనూ, పాలు ఇచ్చే సమయంలోనూ కూడా తల్లులకు ఇవ్వవచ్చో లేదో కూడా ఇంకా పరిశోధనల్లో వెల్లడి కాలేదు . అలాగే చర్మానికి పై పూతగా కూడా రాసుకోవచ్చో లేదో పూర్తి రక్షణ కలగ చేస్తుందో లేదో తెలియలేదు. అందువలన వాటిని వాడే ముందు జాగ్రత్తలు తీసుకొని సరియైన విషయాలు తెలుసుకుని మాత్రమే వాడాలి.
“ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా” అనే శాస్త్రీయ నామం కలిగిన మరో ఔషధ మొక్కను గురించి తెలుసుకుందాం! దీనిని ‘నేల వేము’ అంటారు. దీనికి హిందీలో ‘కాల్ మేగ్’ అనీ, ఇంగ్లీషులో ‘క్రీట్’ అనీ అంటారు. దీనిని ఆయుర్వేదంలో కూడా ‘కాల్ మేగ్’ అనే పిలుస్తారు ఇంకా దీనికి ‘కింగ్ ఆఫ్ బిట్టర్స్’ , గ్రీన్ కిరెట్టా, ఇండియన్ కిరెట్టా అని రకరకాల పేర్లున్నాయి.

ఇది అకాంథేసి కుటుంబానికి చెందిన మొక్క ఏడాది పొడవునా పచ్చగా ఉండే పొదలా పెరుగుతుంది. భారత్, శ్రీలంక దేశాల్లో సాగుచేయబడుతుంది. తేమ, నీడ ఉన్నటువంటి ప్రదేశాల్లో నిటారుగా ఉ౦డే మొక్క. దీనిని కుండీలలో పెoచుకోవచ్చు. ఇది వేప కన్నా కూడా ఎక్కువ చేదుగా ఉంటుంది. కాండంలోనూ, 140 ఆకుల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. దక్షిణ ఆగ్నేయాసియాలో విస్తృతంగా పెంచుతారు. అంటువ్యాదులు వంటి కొన్ని రకాల వ్యాధులకు చికిత్సగా పనికొస్తుంది.
కుండీలలో పెంచుకోవచ్చనుకున్నాం కదా! విత్తనాలు చల్లిన 8 రోజులకు మొక్కలు మొలకెత్తుతాయి. దాదాపు మూడున్నర అడుగులు, పెరుగుతుంది. పిలకలు కత్తిరిస్తే మళ్ళి చిగుర్లు వస్తాయి. నేల నుంచి 10-15 సెం.మీ పై భాగాన కత్తిరించి మొక్కను ఎండ బెట్టుకోవాలి. ఎండి పోయక చూర్ణం చేసి దాచుకోవచ్చు. కోసేసిన దగ్గర నుండి మరల మొక్క పెరుగుతుంది. రెండోసారి కూడా మరల మొక్కను కోసుకోవచ్చు. రోజూ రెండు ఆకులు కోసుకొని తినవచ్చు.
ఈ చెట్టు ఆకులు లాన్స్ ఆకారంలో ఉండి 8 సెం.మీ పొడవుతో ఉంటాయి. పువ్వులు చిన్నవిగా గులాబి రంగులో పూస్తాయి. ఈ పూలు విడదీయబడిన రెసిమిలలో ఉంటాయి. పండ్లు గుళికలుగా ఉంటాయి. విత్తనాలు పసుపు గోధుమ రంగులో ఉంటాయి.
నేల వేము మొక్కను మలయాళ భాషలో ‘కిరియాతు’ అంటారు. ఇండోనేషియా భాషలో ‘సంబిలోటో’ అనీ, ఫ్రెంచి భాషలో ‘రోమ్ డెస్ అమెర్స్’ అనీ మలేషియాలో “హెండేడు బూమి” అనీ అంటూరు. నేనీ మధ్య ఒక కాలెజీకి వెళ్ళినపుయి అక్కడు ఔషధ మొక్కల్ని పెంచుతూ విద్యార్థులకు పాఠాలు చెపుతున్నారు. చూస్తూ పాఠం నేర్చుకోవడం వల్ల పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోవడం జరగదు. నేను ఈ చార్టులను తయారుచేసి మా హాస్పిటల్ కు వచ్చే బాలలకు అందుబాటులో ఉంచాను. తద్వారా ఉన్న కాసేపట్లో నైనా ఏదో ఒక విషయాన్ని గ్రహించగలుగుతారు.
ఈ మొక్కను కామెర్ల చికిత్సకు, జలుబు, ఇన్ ప్లుయెంజా లకు చికిత్సగా, భారత దేశం లోనూ, చైనా లోనూ ఉపయోగింపబడింది. కోవిడ్ సమయంలో థాయ్ లాండ్ ప్రభుత్వం సాంప్రదాయ చికిత్స అయినటువంటి నేల వేము మొక్కల సారాన్ని ప్రత్యామ్నాయంగా వాడవచ్చని తెలిపింది. కరోనా రెచ్చిపోయిన సందర్భంలో ప్రతి చిన్న ఆశను వదులుకోలెక సంప్రదాయ వైద్యాలనూ ఆశ్రయించారు.
‘సరాకా ఇండికా’ అనే శాస్త్రీయ నామం కలిగిన అశోక చెట్టు ఔషథంగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఈ చెట్టు అందరికీ తెలిసినదే. పెద్ద పెద్ద బిల్డింగులు, ఆఫీసుల దగ్గర అందం కొరకు బారుగా నాటబడి కనిపిస్తాయి. బిల్డింగ్ తో పోటీగా పెరిగి తుపాకులు పట్టుకున్న సైనికుల్లాగా కనిపిస్తాయి.
ఈ చెట్టును బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు అల్లర్లు, ఆర్ధరైటిస్ డిప్రెషన్ జబ్బులకు మందుగా ఉపయొగిస్తారు. అంతేకాక గుండె సంబంధ వ్యాధుల నుండి కాపాడుతుంది. నొప్పుల్వి తగ్గించే పని కూడా చేస్తుంది. రక్తంలో ఉన్న చక్కెర నిల్వల్ని తగ్గించి డయాబేటిస్ ను నియంత్రిస్తుంది

ఆశోక చెట్టు కూడా షాబేసి కుటుంబానికి, షాబేలిస్ క్రమానికి చెందినది. వీటి పూలు కాషాయం మరియు ఎరుపు వర్ణాలలో గుత్తులు గా పూస్తాయి. ఆకులు పొడవుగా ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. పుష్పాలు మoచి పరిమళం తో ఉంటాయి. దక్షిణ భారతదేశ మైదానాల లోనూ మధ్య హిమాలయ పర్వతాలలోనూ ఎక్కువగా కనిపిస్తాయి.
అశోక చెట్టు పురాణాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. రామాయణంలో సీతా దేవిని ఎత్తుకెళ్ళిన రావణుడు లంకలో సీతను ఉంచాడు. హనుమంతుడు సీతను వెతుకుతూ వెళ్ళినపుడు మొదటగా ఆశోక చెట్టు కింద ఉన్న సీతను చూశాడు. అలా అశోక చెట్టు రామాయణంలో పేర్కొనబడిది. అలాగే గౌతమబుద్ధుడు అశోక వృక్షం కిందనే జన్మించినట్లుగా వెలుస్తున్నది. మహావీరుడు కూడా వైశాలి నగరంలో అశోక వృక్షం కిందనే సన్యాసం తీసుకున్నాడు. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ జాషధ మొక్క గానూ అశోక చెట్టు పేరు గాంచినది.