రివ్వున ఎగిరే గువ్వలను చూసి, ఆకాశంలో విహరించే విమానాలను చూసి ఆహా అలా ఎగిరిపోగలిగితే ఎంత బాగుంటుంది అనుకోనివాళ్ళెవరు? కొత్త రోజులు, కొత్త కోరికలెన్నో రెక్కలు తొడిగి మనసును ముసురుకున్నట్టు అనిపించదా? అవాంతరాలు అడ్డుపడటమూ, నిలువెత్తు ఊహలు మెదడును ఆక్రమించడమూ కష్టసుఖాల జీవిత కాలఁలో బతుకుబండి లాగ కనపడుతుంది. ఎగుడు దిగుడు దారిలో సాఫీగా సాగాలనే ఒక చిన్న కోరిక తప్పక ఉదయిస్తుంది. గడిచిన రోజులలో మంచిని తలచుకొని చెడును కూడా గుర్తు తెచ్చుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
2024 నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన కొత్త క్యాలెండర్ సిద్ధం చేసుకోవాలి. ఉల్లాసోతాసహాలతో విందులు చేసుకుంటూ పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి. ఇంతేనా?
ఇంతే ఒకందుకు! ఏముంటుంది కాలెఁడర్ మారినంత మాత్రాన జీవితంలో మార్పు ఏముంటుంది? అనే వాళ్ళు ఉంటారు. మార్పు ఎందుకు లేదు, చాలా మారవచ్చు అనేవాళ్లు ఉంటారు. అయితే నేను ఎటువైపు అనే ప్రశ్న వేసుకోవాలి.
ఇంతేకాదు ఎంతోమంది! ఏమై ఉంటుఁది? ఒకసారి అవలోకనఁ చేసుకుంటే మంచిది. ఒక సింహావలోకనం చేసుకుంటే మఁచిది. రోజు ఒకటి మారింది అంటేనే వయసులో ఒకరోజు తిరిగి పోయినట్టు. తరిగిన రోజు ఎలా తిరిగిపోయిందన్నదే ఇక్కడ ముఖ్యం. శుభ్రంగా, స్వేచ్ఛగా, సత్యంగా కరిగిందా లేదా అనే ప్రశ్నలను సంధించుకోవాలి. ఏదో పుట్టాం, పెరిగాం, బ్రతుకు ఈడుస్తున్నాం అనుకోకుండా కాస్తంత మంచిగా, కాస్తంత ప్రయోజనంగా,కాస్తంత ఆదర్శంగా ఉండాలి అని అనుకొని ముందుకు సాగాలి. “మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే” అని ఆ మహానుభావుడు ఎందుకు అన్నాడో ఎలా అన్నాడో కాని అదే నిజమైపోయిన విచిత్రమైన రోజులలో ఉన్నాం. కాబట్టి అన్నీ ఈ భావం లోనికే రానీయకుండా కొన్నైనా సామాజిక సాంఘిక సంబంధాలుగా మార్చుకొని, అలవర్చుకొని బతుకును ఈడ్చుకుంటూ సాగుతున్నట్టు కాకుండా బతుకును భరోసాతో భరోసా ఇచ్చేలా ఇవ్వగలిగేలా అందంగా, ఆనందంగా, ఆలోచనాత్మకంగా గడిచేలా మార్చుకుంటూ సాగాలి.
సమయపాలన, సందర్భశుద్ధి, సంస్కరణలతో ముందుకు వెళ్ళాలి. గత సంవత్సరం ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నామో అవి పూర్తి చేసే దిశలో అడుగేయాలి. విజయాలను సాధించాలి. అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.