కవి

నాపేరు శోభారాణి మాది మధ్యతరగతి కుటుంబం అమ్మా నాన్నలకు నేను ఒక్కతే కూతురుని,నాకంటే ముందు ముగ్గురు పుట్టి చనిపోవడంతో నన్ను గారాబంగా పెంచారు.నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో పెళ్లిచేశారు,నాన్న గారి ఆర్ధిక ,ఆరోగ్య పరిస్థితి అంతగా సంతృప్తి కరంగా లేకపోటంతో పెళ్లికి తలవంచవలసి వచ్చింది.నాకు చదువంటే చాలా ఇష్టం అప్పట్లో మా అత్తగారు వాళ్ళు మేము చదువు చెప్పిస్తామని చెప్పి పెళ్లి ఐన తర్వాత ఇప్పుడు చదివి ఉద్యోగం చేయాలా,ఊళ్ళు ఎలాలా అంటూ చదువుకు మంగళం పలికారు.ఆశలన్నీ అడియాసలయ్యాయి, కొంత కాలానికి నాన్న గారు కాలం చేశారు,

నాన్నగారు చనిపోడంతో చాలా డిప్రెషన్ కి లోనయ్యాను అప్పట్లో నా చిన్నప్పుడు నాన్న గారికి రేడియో వైన్ అలవాటు బాగా ఉంది మా ఇంట్లో మర్ఫీ రేడియో ఉండేది,అప్పట్లో నేను చిన్నపిల్లని ఉషశ్రీ గారి రామాయణం,వార్తలు చాలా కార్యక్రమాలు వినేవారు .నాన్న గారు కాలం చేశాక మర్ఫీ రేడియో నా కళ్ళ ముందు కదలాడింది వెంటనే ఆన్ చేసాను సుమారు 1999 వ సంవత్సరం ఆనాటి నుండి రేడియో వినటం అభిప్రాయాలు రాయటం అలవాటుగా మారింది.ఇక చాలా మంది కవులు విజయవాడ ఆకాశవాణికి కవితలు,కధానికలు, పంపినవి వ్యాఖ్యాతలు చదివి వినిపించేవారు,కొందరు కవులు వారే చదివి వినిపించేవారు అలా విని నేనుకూడా కవితలు,కదశనికలు ఎందుకు రాయకూడదు అనిపించి రాయడం మొదలు పెట్టాను,నా కవితలు,కథానికలు విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమై పారితోషికాన్ని కూడా అందుకునే స్థాయికి వచ్చాను,చాలా కధానికలు కవితలు ప్రసారమైనాయి.నాకు చిన్నప్పటి నుండి మైకులో మాట్లాడాలి అనే కోరిక ఉండేది ఆకోరికతో ఆకాశవాణిలో నావాణి తో చదివి వినిపించే దాన్ని,అక్కడ ఉన్న వ్యాఖ్యాతలు నన్ను అభినందించేవారు,నా స్వరం రేడియో కి బాగా సెట్ ఐనదని, మీరు Rj గా చేయచ్చు అందుకు డిగ్రీ చదివి ఉండాలి అన్నప్పుడు నా మనసు చాలా బాధ పడేది,చదువుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపించేది.కానీ అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది 2019 లో ఆన్లైన్ రేడియో NRI ఉన్నదని మా స్నేహితులు చెప్పటంతో ఆ రేడియో ట్యూన్ చేసాను గంటకొక RJ మారుతూ ఉంటారు నేను అలా ఒక వారం రోజులు మాట్లాడి నా కవితలు వినిపించేదాన్ని ,ఆ రేడియో యాజమాన్యం నాకు కాల్ చేసి మీ వాయిస్ చాలా బాగుంది తెలుగుభాష మీద మంచి పట్టు ఉన్నది మీరు తెలుగు లిటరేచర్ చేశారా అని అడిగారు,ఆమాటకు నాకు వెంటనే నవ్వు వచ్చి నేను అంత చదువుకుని ఉంటే ఉద్యోగం చేసేదాన్ని అని నవ్వేశాను. కానీ వారు మాత్రం నీకు మా రేడియోలో RJ గా అవకాశం ఇస్తాను చేస్తావా అని అడిగారు,నాకు అసలే మైకుచూస్తే ఒళ్ళు తెలీదు,నాకు ఈయన మీకు ఇస్తానంటున్నారు అని ఏంటండి జోకా అన్నాను,నాకు డిగ్రీ లేదు ఎలా ఇస్తారు అన్నాను?డిగ్రీ తో పనిలేదు చక్కటి భాషా పరిజ్ఞానం ఉంది,సరళమైన పదాలతో కవితలు,కధానికలు రాస్తున్నారు ఇంతకు మించి QUALIFICATION ఏమి కావాలి అనడంతో నా కోరిక నెరవేరబోతోందని సంబరపడ్డాను నాటి నుండి నేటి వరకు RJ గా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.ఈ ప్రయాణంలో కవితలు,కథానికలే కాక నాటికలు సుమారు 25నిమిషాలు,30 నిమిషాలు నిదివిగల నాటికలు రచించి ఎక్కడెక్కడి వారినో ఫోన్ లో కాన్ఫరెన్స్ ద్వారా కలిసి రెహార్సస్ చేయించి రేడియో లో కూడా స్కైప్ ద్వారా లైవ్ నాటికలు చేయించాను 40 నాటికలు వరకు యూట్యూబ్స్ చేయటం జరిగింది.రికార్డింగ్ కాకుండా ఎవరు ఇంటి వద్ద వాళ్ళు ఉండి స్కైప్ ద్వారా కలిసి నాటిక లైవ్ చేయించడం ఒక సవాల్ లాంటిది ఎందుకంటే ఒక్క అక్షరం తప్పు పలికినా భావం

మసరిపోతుంది.నేను చేసే షోస్ అన్నీ కూడా లైవ్ షోస్ అందరు RJ లు కూడా లైవ్ షోస్ చేస్తారు.ఇంకా యాత్రారంజని అనే షో కూడా 40 ఎపిసోడ్స్ చేశాను,పురాతన దేవాలయాలు, కట్టడాలు వాటి చరిత్ర,ఎలా వెళ్ళాలి ఇవన్నీ చేసాను ఆ షో కి చాలా మంచి పేరు కూడా వచ్చింది.ఇలా నేను కావాలి అనుకున్నది నేను చేయగలుగుతున్నాను,అది నాకు కేవలం రేడియో వినటం ద్వారా అలవడిన,నేర్చుకున్న విజ్ఞానం,ఏకలవ్యుడు ద్రోణాచార్యుని బొమ్మను చేసి గురువుగా భావించి ఆయన తన శిష్యునకు నేర్పుతున్న విద్యను చూసి ఏక లవ్యుడు ఎలా నేర్చు కున్నాడో అదే విధంగా రేడియో నా గురువుగా భావించి అందులోని ప్రసారాలను వింటూ నేర్చుకున్న నా విజ్ఞానం నేను అనుకున్న ప్రొఫెషన్ కి చేరువచేసింది అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.నాకు ఇద్దరు కొడుకులు నాకు చదువు అంతగా లేకపోయినప్పటికీ నా పిల్లలు బాగా చదువుకోవాలి అని నా కోరిక ఆకోరికతోనే ఇద్దరు పిల్లలు MCA చేశారు పెద్ద బాబు అమెరికా లో సాఫ్ట్ వేర్ గా స్థిరపడ్డాడు, చిన్న బాబు కూడా హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ గా చేస్తున్నాడు.పెద్దబాబుకు వివాహం కూడా జరిగింది ఒక పాప,బాబు కూడా ఉన్నారు.ఒక మధ్యతరగతి కుటుంబం లో పుట్టాను, మరో మధ్యతరగతి కుటుంబంలో కోడలిగా వెళ్లాను,అక్కడ అత్త మామలతో,తోడికోడలితో,ఆడపడుచుతో ఎన్నో కష్టాలకోర్చి బతుకు బండిని లాగి ఎన్నో ఓడిదుదుకులను ఎదుర్కొని స్వశక్తితో ఈ

ఒడ్డుకు చేరాను.నా బ్రతుకు పూలదారి కాదు ముళ్లదారి చాలా కష్టాలను అతవారింట ఎదుర్కొని జీవితం నేర్పిన పాఠాలే కవితలుగా,కథలుగా మలచుకుని సాగిస్తున్న ప్రయాణం నాది. మా నాన్న గారు శ్రీ దేసు మల్లిఖార్జున రావు గారు,మా అమ్మ గారు శ్రీమతి దేసు శశిరేఖ గారు వారు చిన్న నాటి నుండి నాకు ఏ కష్టం లేకుండా వారికి కలిగినంతలో గారాబంగా పెంచారు,వారి ద్వారా మంచి సంస్కారాన్ని నేర్చుకున్నాను నాకు జన్మ నిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు,వారు గత్తించినా వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఉంటాయని నా నమ్మకం.అలాగే జీవితంలో ఎన్నో కష్టాలకు గురిచేసిన నా అత్తమామలకు కూడా కృతజ్ఞతలు,ఎందుకంటే వారు నన్ను కష్టపెట్టకుంటే దాదాపు 1000 కవితలు నేను రాసి ఉండేదాన్ని కాదేమో… నా కవితల్లో ఎక్కువగా నా జీవన పోరాటం కనిపిస్తుంది అందుకు వారికి కృతజ్ఞతలు. మా మామగారు శ్రీ సంకా కృష్ణారావు గారు,అత్తగారు శ్రీమతి సంకా పుల్లమ్మ గారు వీరికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మామిళ్ళ ముచ్చట్లు

రైతు