
చిందర వందర చిత్తు ప్రతులలో సుందరమైన పదబంధాలెన్నో
గజిబిజి రాతల గిమ్మిక్కులలో సరికొత్తగ తేలే ప్రక్రియలెన్నో
పెన్నూపేపరు చుంబనాలలో వ్యాకరణాల మధురిమలెన్నో
అక్షరాల ఆలింగనాలలో అనుబంధాల సుమగంధాలెన్నో
విశేషాల జాడలలోన నిత్య నూతన సూచనలెన్నో
విశేషణాల సొగసులలోన మదిలో రేగే మతలబులెన్నో
అక్కరలేని పంక్తులలోన
లెక్కకు మిక్కిలి కవనాలెన్నో
పనికిరాని పదాలలోన పరిపక్వపు ఫలసారాలెన్నో
చెలిమెలో ఊరే నీటికి మల్లే
చిత్తుప్రతులలో సతత హరితాలెన్నో