జరిగిన కథ
ఆడుతూ పాడుతూ తిరిగే రాధ అతి చిన్న వయసులో విచిత్రమైన పరిస్థితుల్లో డాక్టర్ పద్మావతి తమ్ముడు, పోలియోతో అవిటి వాడైన కృష్ణమోహన్ ని మనస్ఫూర్తిగా వివాహం చేసుకుంటానని అన్నలకి,తండ్రికి చెప్తుంది. అన్నలు, తండ్రి బాధపడతారు.తమ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా రాధ అటువంటి నిర్ణయం తీసుకుందని.
సంతోషంగా సాగుతున్న రాధ, కృష్ణమోహనుల జీవితంలో కృష్ణమోహన్ రిటైర్మెంట్ పిడుగు లాంటి వార్త అయింది అప్పటివరకు రాధకి తనకి కృష్ణమోహన్ కు అంత తేడా ఉందని తెలియదు కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవటానకి ఎలాగైనా సగంలో ఆపిన తను చదువు కొనసాగించి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది రాధ. రాధ జడ్పీహెచ్ స్కూల్లో టీచర్గా నియామకం జరిగింది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న ప్రణవ్ పదేళ్ళకే సిగరెట్టు లాంటి చెడు అలవాట్లకి లోను అవుతున్నాడని తెలిసి బాధపడుతుంది. పట్టుదలతో బ్యాంకు పోటీపరిక్షలలో ఉత్తీర్ణులై స్టేట్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసరుగాచేరుతుంది. సాయంత్రాలు పిల్లలతో గడుపుతూ సంసారాన్ని సంతులనం చేసుకుంటోంది.బి.బి.ఏ పూర్తిచేసిన ప్రణవ్ విదేశంవెళ్ళి చదవాలని మంకుపట్టు పెట్టాడు.అందుకు తమకు తాహతులేదన్నందుకు తండ్రి కృష్ణమోహన్ జి చేతకాని వాడిని తూలనాడాడు.శాంతి స్వరూపుడైన కృష్ణమోహన్ అభిమానం దెబ్బతింటుంది. తల్లి త్యాగాన్ని తెలియచెప్పాడు.హఠాత్తుగా కృష్ణమోహన్ తీవ్రమైన హృద్రోగ సమస్యతో ఆసుపత్రిలో చేరుతాడు.
ఇక చదవండి….
ఇంతలో ఫోను మ్రోగింది. “ఇంకొక అరగంటలో అందరం టాక్సీలో వస్తున్నాము.ధైర్యంగా ఉండు.ఏమీకాదు.”అంటూ పెద్దన్న రాజారెడ్డి ఫోనుచేసాడు.”భగవంతుడా!నేనెప్పుడూ నీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.దయతలచుతండ్రీ! నాకు ధైర్యాన్ని ఇవ్వు తండ్రీ!” అంటూ పరిపరివిధాల శ్రీనివాసుని ప్రార్ధించింది రాధ.
ఇంతలో నర్స్ వచ్చి” ప్రణవ్ ప్రణవ్” పేషంటు కృష్ణమోహన్గారు రమ్మంటున్నారు.అంది.
గబగబా లోపలికి వెళ్ళాడు ప్రణవ్.
ప్రణవ్ ని చూడగానే దగ్గరకు రమ్మని చేయి ఊపాడు.కూర్చోమని స్టూలు చూపించాడు కృష్ణమోహన్.
“నాన్నా!ఎలాఉంది? ఎక్కువ ఆలోచించవద్దు” అంటూ తండ్రిచేయి తన చేతిలో తీసుకొని దుఃఖాన్ని పళ్ళబిగువున అదిమిపెట్టి అడిగాడు ప్రణవ్.
“చెట్టంతకొడుకు చేయిపట్టుకుంటే యముడుగూడా
పరారుకాడా!” అంటూజీవంలేని నవ్వు నవ్వాడు.కృష్ణమోహన్.
బంగారం నీపేర పదిహేనులక్షలు మాత్రం ఈపేద నాన్న నీచదువు గురించి దాచి ఉంచాడు పోస్టల్ లో. ఐ.సి.ఎఫ్.ఎ.ఐ లో ఎడ్మిషను తీసుకో.ఎమ్.బి.ఎ పూర్తిచేయి.మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్.అమ్మని అమ్మూని నువ్వే చూసుకోవాలి.నువ్వు ఇంటికి పెద్దవాడివి.కోపం ఉద్రేకం తగ్గించుకో.చెడుఅలవాట్లు, చెడుసహవాసాలు మానేయి.అమ్మని,అమ్మూని నువ్వేచూసుకోవాలి.నువ్వు ఇంటికి పెద్దవాడివి.నేను సర్జరీ తరువాత మునుపటిలాగా ఉంటానని నమ్మకం లేదు.నువ్వు మావరాలపంటవి.మీ అమ్మ గుండెచప్పుడివి.అమ్మ పిచ్చిదిరా.అమ్మ ,అమ్ము జాగర్త.అంటూ ప్రణవ్ చేతిని హృదయానికి ఆనించుకున్నాడు. ” కృష్ణమోహన్. అంతలోనే ఎగశ్వాస రావటంతో నర్స్ డాక్టరుని పిలిచింది.
ప్రణవ్ బటకు వచ్చి తల్లికి విషయం చెప్పాడు. అప్పుడే వచ్చిన పద్మావతి , రాజారెడ్డి మరియు కేశ రెడ్డిలని ఉండమని వార్డ్ లోకి వెళ్ళింది.తమ్ముడిని చూసి పరిస్థితి విషమించిందని తెలుసుకుంది మృత్యువు తో పోరాడుతున్న తమ్ముడిని చూసి ఆమె హృదయం రోదించింది.తమ్ముడు కాదు తనబిడ్డ.పిల్లలు లేని తనకు మాతృత్వపు మమకారాన్ని చవిచూపినబిడ్డ.చూస్తుండంగానే క్రష్ణమోహన్ ప్రాణం అనంతవాయువులో కలసిపోయింది .జీవాత్మ పరమాత్మలో ఐక్యంఅయింది అదేచిరునవ్వు ని ప్రాణంలేని కట్టెకొదలి.
ఇలా జరగకూడదనుకుంటే ఆపవిధి తరమా!
‘ఇంతవరకూ ఈ అక్క గురించే ప్రాణాన్ని నిలుపుకున్నాడా!అనిపించింది.’ పద్మావతికి.
‘తను ఒక డాక్టరు.ఎంతోమందికి డెలివరీలు చేసేది.కొన్ని సందర్భాల్లో బిడ్డ.మరికొన్ని సందర్భాలలో తల్లి ని కాపాడలేకపోయేది .బతకని బిడ్డని ఆతల్లికెందుకివ్వాలి?శ్రీనివాసా! ఈ బ్రతికిన బిడ్డకితల్లిలేకుండా చేసావా?వీడిభవిష్యత్తేమిటి శ్రీనివాసా అని ఏడ్చేది.’తలచుకుంది పద్మావతి.
‘ఈ జననమరణాలు భగవంతుని కేలిక్యులేషన్. లాజిక్, సైన్స్ ఎంత అభివృధ్ధి చెందినా తెలిసికోలేమనటం సత్యం.’అనుకుంది పద్మావతి.
‘నాన్నా నువ్వు,అమ్మ అదృష్టవంతులు పుత్రశోకం అనుభవించలేదు’ అనుకుంది పద్మావతి.
★★★
మనిషి పోయిన రోజునించీ కాలం స్పీడునందుకుంటుందా అన్నట్లు కృష్ణమోహన్ పోయి అప్పుడే పన్నెండు రోజులు అయిపోయింది. అందరూ రాధకి ధైర్యం చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి పోయారు.
“రాధా! నువ్వు నాకూతురు లాంటి దానివి.నీ ప్రతిఅడుగు లో నీకు నేను అండగా ఉంటా! తమ్ముడు లేడని బంధం సమసిపోలేదు. మరింతముడిపడింది. మాఇంటి కోడలివి.అంటూ రాధని గుండెలకి హత్తుకుంది.పిల్లలని బాగా చదివించు.నీ స్పోర్ట్స్ కెరీర్ మీద కాంన్సన్ట్రేట్ చేయి. నీవిషయంలో కృష్ణ కన్న కల. తోడేళ్ళనించీ పిల్లలు జాగ్రత్త.”అంటూసెలవ తీసుకుందిపద్మావతి.
పద్మావతివెళ్తుంటే ‘అత్తా’ అంటూ వెక్కీ వెక్కి ఏడ్చింది
రాగిణి.
రాజారెడ్డి ,అలిమేలుమంగ మూడునెలలు రాధ దగ్గర రాధ మనుషుల్లో పడేవరకూ ఉండి చిత్తూరు వెళ్ళారు.కొడుకులు చదువులు పూర్తి చేసుకుని స్టేట్స్ నించీ వస్తూఉండటంతో.
తండ్రిని అంటిపెట్టుకుని ఉండే రాగిణి మూగదయ్యింది.అసలే తండ్రి పోలిక.పది మాటలకి ఒకమాట మాట్లాడే రాగిణి ఇప్పుడువంద మాటలకి ఒకమాట మాట్లాడుతోంది.రాధపగలంతా ఆఫీసు పనితో కొంత ఏమారినా రాత్రి అయేసరికి కృష్ణమోహన్ జ్ఞాపకాలతో నిద్రలేమి రాత్రులతో చిక్కి సగం అయింది.
ప్రణవ్ ఎమ్.బి.ఏ లో జాయిన్ అయ్యాడు. పట్టదలతో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాసుతో కంప్లీట్ చేసాడు.
రాగిణి ఇంటరు సెకండ్ క్లాస్లో పాస్ అయింది.తండ్రి పనిచేసిన కాలేజీలో బి.ఏ ఇంగ్లీషు లిట్ మైన్ గా చేరింది.
పిల్లలిద్దరూ తల్లిని కనిపెట్టుకుని ఉంటున్నారు.
★★★
ప్రణవ్ ఎమ్. బి.ఎ డిస్టిన్కషన్ లో పాస్అయ్యాడు. రాధ చాలా సంతోషించింది కృష్ణ ఉంటే ఎంత ఆనందించేవాడో అనుకుఃది.
“ప్రణవ్! జాబ్ ప్రయత్నం చేయి నాన్నా.కనపడ్డ అన్ని కంపెనీలకి అప్లైచేయి.” అంది రాధ.
అమ్మా జాబ్ చేస్తే ఎంతవచ్చేను మహ అయితే ముఫై,నలభై లేకపోతే యాభై.ఈరోజుల్లో అదేంసరిపోతుంది . బిజినెస్ చేయాలని ఉంది.నువ్వు బ్యాంక్ లోన్ ఇప్పిస్తే.”అంటూ నసిగేడు ప్రణవ్.
‘ఇన్ని సంఘటనలు జరిగినా.తన కొడుకు మారలేదని,రాధకి అర్ధం అయింది.కొత్తగా కొడుకు గురించి తెలుసుకున్న నిజం ఈజీ మనీ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ అని ప్రణవ్ కి.’నిట్టూర్చింది రాధ.
“మాబ్యాంక్ లో రిలేటివ్స్ కి లోన్ ఇవ్వరు.మరో బ్యాంక్ ట్రై చేసుకో!” అంటు ఆ టాపిక్ క్లోజ్ చేసింది.
రాధ చురుకైనమెదడు ఆలోచించటం మొదలుపెట్టింది.
‘అమ్మూ పై చదువులకి వెళ్తుందనేఆశలేదు. అమ్ము చదువులో కొంచెం నిదానమవటంతో పంతొమ్మిది ఏళ్ళువచ్చాయి.ప్రణవ్ ఉన్నకొద్దిపాటి డబ్బు ,ఇల్లు కూడా రేపు వాటాకావాలన్నా ఆశ్చర్యపోవక్కరలేదు.’ అనుకుంది రాధ.
అంతే వెంటనే అన్నలకి అక్కకి విషయం తెలిపింది.”అమ్మూకి మంచి సంబంధం చూడండి పెళ్ళి చేయదలచు కొన్నాను.”అని
ఇప్పుడు రాధకి ఒకటేధ్యాస.చేతిలో పైకం ఖర్చు
కాకముందే అమ్మూకి మంచి సంబంధం చూడాలి.
చంకలో పిల్లని పెట్టుకొని ఊరంత వెతికినట్లు పిల్లాడురిటైర్డ్ మేనేజర్ కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజీనీర్ మల్టీనేషనల్ కంపనీలోపనిచేస్తున్న సంబంధం వచ్చింది. పెళ్ళిచూపుల కొచ్చినవాళ్ళు కుందనపు బొమ్మలాంటి రాగిణినిచూసి పిల్లనచ్చింది. ముహూర్తలెప్పుడన్నారు.
రాగిణి మంచి పొడగరి.పిల్లవాడు రాగిణికంటె ఒక గుప్పెడు ఉండవచ్చు.
“అమ్మూ!నాన్న పోయాక నాకు ధైర్యం చాలటం లేదమ్మా! నిన్ను బాగా చూసుకునేవాళ్ళకి నిన్నప్పగిస్తేగాని మనశ్శాంతి ఉండదు.నీ అన్న ప్రవర్తన మనని ఆదుకుంటాడనే ఆశ కల్పించటంలేదు.ఏమంటావు.?”అందిరాధ.
“అమ్మా! ఆ అబ్బాయి హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళకి నేనునచ్చాను.ముఖ్యంగా ఈఊరు దగ్గరలోనే ఉంటారు.నిన్నువదిలి ఎక్కడో దూరం సంబంధం చేసుకుని దూరంగా వెళ్ళాలని లేదు. దూరపుసంబంధం నాకు వద్దమ్మా !” అంది తల్లి వడిలో తల పెట్టుకునిరాగిణి.
నిజంచెప్పాలంటే పెళ్ళిధ్యాస లేదు.కారణం ఆ అబ్బాయిని చూసినప్పుడు.రాగిణి మనసు స్పందించలేదు.కానీ తల్లి ఆవేదన అర్ధం చేసుకుని ఒప్పుకుంది.
★★★
భర్త ప్రావిడెంట్ఫండ్ మొత్తం ఖర్చుపెట్టి, తనవంటిమీద నగలన్నీ చెరిపి కూతురికి చేయించి,లాంఛనాలలో ఎటువంటి ప్రోబ్లమ్ రాకుండా ఎంతోఘనంగా ఏమాత్రం పొరపొచ్చాలు లేకుండా రాగిణి పెళ్ళి జరిపించింది రాధ.
పెళ్ళయిన వెంటనే ముహూర్తం బాగాలేదు ,పిల్లని వచ్చేనెల తీసికెళ్తామని సత్యన్నారాయణ వ్రతం అవంగానే రాగిణిని రాధతో వెనక్కు పంపారు.
రాధ కూడా సంతోషించింది.కూతురు ఇంకొక నెల తనతో ఉంటుందని.నెల గడిచింది అటునించీ ఏఖబురూ రాలేదు.మధ్యవర్తి ద్వారా పిల్లని ఎప్పుడు పంపమంటారని ఖబురు చేసింది.”పిల్లవాడు ఆఫీసుపనిమీద ఊరూరా తిరుగుతున్నాడు. మాకులేని తొందర మీకెందుకు అని”అటునించీ ఖబురు తెచ్చాడు మధ్యవర్తి.అంతేకాదు ఇంకోపదిహేను రోజుల్లో ఆషాడం వస్తోందికదా!తరువాత పిల్లచేత వరలక్ష్మీ వ్రతం చేయించమని” ఖబురువచ్చింది.
అదీ ఇదీ అంటూ ఐదు నెలలైనా రాగిణిని అత్తవారు తీసికెళ్ళలేదు.దానితో రాధకు అనుమానం ,భయం పట్టుకుంది .నెమ్మదిగా తనఫ్రెండ్ లాయర్ జ్యోత్సన కి విషయం చెప్పి సలహా అడిగింది.”ఇది డౌటుఫుల్ కేసులానే ఉంది. నువ్వొక పనిచేయి.మన పురోహితుడిని మంచి రోజు చూడమని సారెతో పిల్లని అత్తారింట్లో దింపు.మీఅన్నవదినలను తతీసుకెళ్ళు.”అనిసలహా ఇచ్చింది.జ్యోత్స్న.
“పెళ్ళయిన క్రొత్తజంట ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే శోభనానికి ఇంతమీనమేషాలు లెక్కపెట్టుకుంటున్నారు.వాళ్ళడిమాండ్స్ ఏమిటో తెలుసుకో.పెళ్ళయ్యాక వాళ్ళే గొంతెమ్మ కోరిక ఏకోరికైనా తప్పదుకదా!”అంది జ్యోత్స్న.
సరే అని అన్నవదినలను పిలిచి మంచిరోజు చూసి,సారెతో రాగిణిని తీసికెళ్ళారు.రాగణికి ఎలానడచుకోవాలో చెప్పి జాగ్రత్తలు చెప్పింది రాధ.
రాగిణితో వచ్చిన వారినిచూసి వారు వస్తారని తెలియక తత్తరపాటుపడ్డారు రాగిణి అత్త,మామ.
“అదేమిటి వదినగారు! నిన్న మా పురోహితుడు కోడల్ని ఈవారంలో తీసుకురండి అని చెప్పాడు.నేనే మీకు ఖబురు పెడదామనుకుంటున్నా.ఇంతలోకి మీరువచ్చారు.అంటూ ‘రండి రండి’ అని ఆహ్వానించింది రాగిణి అత్తగారు.
“మీ ఆయనమీద బెంగొచ్చి వచ్చేసావా! అంటూ రాగిణి బుగ్గలు నొక్కిజోక్ చేసింది.”రాగిణి అత్తగారు.
రాగిణికి ఆవిడ జోకు జుగుప్స కలిగించింది.’అమ్మో ఈ ఇంట్లో నేనుండాలి’ అనుకుంది మనసులో ఈ.
రాధవదిన అలిమేలుమంగ రాగిణి అత్తగారికి బొట్టు పెట్టి సారెఇచ్చి,అబ్బాయి ఏడండీ అని అడిగింది. ఆఫీసుపనిమీద.బాంబే లేదు లేదు మాఅమ్మకి వళ్ళుబాలేకపోతే చూడటానికెళ్ళాడు
రెండురోజులు పట్టొచ్చు అంది తత్తరపడుతూ.
ఒక్కసారి నీరసం ఆవహించింది అందరికీ.
వారిచ్చిన కాఫి త్రాగి రాగిణికి చేయి ఊపి ఇంటికి బయలుదేరారు.
“అన్నా! నాకు బెంగగా ఉంది పులి బోనులోకి లేడిపిల్లని వదలలి వచ్చినట్లుంది.అదేమిటిరా అన్నా!ఆ మామగారు ఒక ఉలుకూ లేదు పలుకూలేదు. ఆ చూపులుకూడా కంపరంగా ఉన్నాయి.మనం తప్పటడుగు వేసామా!”అని అందిరాధ.అన్నగారితో.
“ఏమీలేదురా!నీకు’ అమ్ము’ మీద ప్రేమ అలా అనిపిస్తోంది.అమ్ము బంగారుతల్లి. ఎలాంటివాళ్ళైనా దాని మంచితనానికి పడిపోవలసిందే.బావ లేకపోవటంతో నీకు ఎక్కడలేని అనుమానాలు వస్తున్నాయి.”అన్నాడు.రాజారెడ్డి.
“ఇవన్నీ కాదుగాని అతగాడు అదే నీ అల్లుడుంగారు కనపడలేదు.”అన్నాడు రాజారెడ్డి .
“మనంవస్తామని తెలియదుకదా!వాళ్శ అమ్మమ్మకి వంట్లోబాగాలేకపోతే అక్కడికి వెళ్ళాడుట.” అంది రాధ.
“లేదండీ! చేతికి పసుపంటిందని చేతులు కడుక్కోవటానికి వాష్బేసిన్దగ్గర కెళితే అటు రూమ్ లో కూర్చని పుస్తకం చవదువుకుంటున్నాడు.”అంది అలిమేలుమంగ.
“నీమొహం ఎవరిని. చూసి ఎవరనుకుంటున్నావో!” అన్నాడు రాజారెడ్డి.
“రాధా!మా పెళ్ళయినవెంటనే తిరుపతి వెళ్ళాం గుర్తుందా!మీవదిన నావేలుపట్టుకొని నడుస్తోంది. నేను వెలు విడిచి ప్రసాదం తేవటానికి ప్రసాదంకౌంటరరుదగ్గరకెళ్ళా.ఈలోగా ఇంకో పెళ్ళికొడుకు పసుపుబట్టలతో వెళ్తుంటే నేననుకొని వెనక వెనకే పోయింది.నేనుచూస్తూఉన్నా ఈ అయోమయం ఏమి చేస్తుందా అని.కొంతదూరం వెళ్ళాక ఆపెళ్ళికొడుకు పెళ్ళి కూతురు దగ్గరకు వెళ్లి ప్రసాదాన్నిచ్చి చెట్టాపట్టాలేసుకుని వెళ్లి పోయారు. అప్పుడు ఈవిడగారు ఎడుపు ముఖంతో
కౌంటరుదగ్గరకు వచ్చింది. నేనుకనపడలేదు. గుడ్లనీరుకక్కుకుంటూ నుంచుంది.నాకే జాలివేసి దగ్గిరకెళ్ళా.”అంటూ పౄద్దపెట్టున నవ్వాడురాజారెడ్డి.
అప్పటి సంగతి తలచుకొని అలిమేలుమంగ సిగ్గు పడింది.
సిగ్గుల.మొగ్గైన వదిననుచూసి”హేభగవంతుడా మా అన్నావదినలని ఇలాగే సంతోషంగా కలకాలం ఉండేట్టు ఆశీర్వదించుతండ్రీ!”అంటూ మనస్సు లో ఆ ఏడుకొండలవాడిని ప్రార్ధించింది రాధ.
“అలిమేలుమంగ చెప్పిన దాన్ని గురించి సీరియస్గానే ఆలోచిస్తున్నాడు రాజారెడ్డి. కానీ అసలే దెబ్బమీద దెబ్బతో ఉన్న చెల్లెలుకు నిజమేమిటో తెలియకుండా క్షోబపెట్టడం ఇష్టంలేదు.అందుకే తమపెళ్ళికధ చెప్పి రాధ మైండ్ ని డైవర్ట్ చేసాడు.”రాజారెడ్డి.
భర్తపోకడ అర్ధం అయీ అవనట్టుంది. అలివేలుమంగకు.
అలసిపోయిన మనసూ శరీరం ఈవిషయాన్ని సీరియస్గా పట్టించుకోలేదు రాధ.
ప్రణవ్ కిచెల్లిలిని కాపురానికి తీసికెళ్ళలేదని చెప్పినా దానిని సీరియస్గా అర్ధం చేసుకునేమెచ్యురిటీగానీ శక్తిసామర్ధ్యాలుగాని లేవు.
సశేషం