“ప్రకృతే ఒక ప్రేమ గీతం”

కవిత

నీటిలో అలలై నవ్వే అందం ప్రకృతిదే,
నేలపై పచ్చని పరిమళం ప్రకృతిదే.

ఆకాశంలో మేఘాలై తేలే మధుర భావం,
నీలిమలో నిశ్శబ్ద గీతం ప్రకృతిదే.

పూలలో విరిసే రంగుల రాగమై,
తేనెలో దాగిన మధుర గానం ప్రకృతిదే.

ఉదయపు సూర్యకిరణం తాకిన వేళ,
భూమికి బంగారు కిరీటం ప్రకృతిదే.

పక్షుల కిలకిలలో పలికే స్వరమై,
గాలిలో వినిపించే సంగీతం ప్రకృతిదే.

చెట్ల నీడలో చల్లని హాయిగా,
ఆకుల సవ్వడిలో ఆనందం ప్రకృతిదే.

కొండల నిశ్శబ్దం, నదుల పరవళ్లు,
ప్రతి క్షణం ఒక కొత్త కావ్యం ప్రకృతిదే.

మనసు అలసిన వేళ ప్రకృతిని చూస్తే,
మరలా నవ్వించే మధుర ఔషధం ప్రకృతిదే.

నీటిలోనూ, నేలలోనూ, నింగిలోనూ నిండినది,
జీవానికి జీవం పోసే శాశ్వత ప్రేమ ప్రకృతిదే.

ప్రకృతిని ప్రేమిస్తే మనసు పులకిస్తుంది,
మనిషి హృదయంలో వికసించే వసంతం ప్రకృతిదే.

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు 38

సాహిత్య సుగంధాలను వెదజల్లుతున్న యలమర్తి అనూరాధ