అందాలను పంచే ప్రకృతి చిట్టమ్మ..!
మన భారతదేశానికి అందమైన ముద్దుగుమ్మ..!
మన స్వార్థపు నీడలో పచ్చని చెట్లు
కనుమరుగైపోతున్నాయి..!
పక్షుల గూళ్లు నేలరాలిపోతున్నాయి..!
దర్శనం శుభశకునంగా విజయప్రాప్తికి ప్రతీకగా నిలిచిన
పాలపిట్ట నేడు…..
చిరుగాలిలో పాట కనుమరుగై పోతోంది..!
మనం వ్యవసాయంలో రసాయనిక పురుగుమందులు
వాడడం వల్ల పాలపిట్ట కనుమరుగై పోతోంది..!
