“పులి కడుపున పులి పుడుతుంది.అన్నీఉన్న ఆకు అణిగి మణిగే ఉంటుంది.ఆకాలానికి ఈకాలానికి వారధులు తురగా సిస్టర్స్! అమ్మ నాన్నలకు శాశ్వత కీర్తిప్రతిష్ఠలు పెంచుతున్న వారు _ ఉషారమణి రేడియో న్యూస్ రీడర్ గా గళంతో వార్తలు చదవటంలో ఒరవడి సృష్టిస్తూ, యువత కు శిక్షణ ఇస్తున్నారు.ఇక వసంత శోభ చేతలతో రాష్ట్రానికి దేశానికి నిశబ్ద సేవ చేస్తున్నారు.వారిద్దరూ శ్రీమతి తురగాజానకీరాణి కృష్ణ మోహన్ రావు గార్ల నేత్రాలు గాత్రాలు.మాటలు చేతలతో తురగా వంశానికి తెలుగు వారికి స్ఫూర్తిదాతలు అంటే అతిశయోక్తి కాదు.
తల్లి ఆలన పాలనలో సంగీతం నృత్యం నేర్చుకున్నారు.నాటకాలు రేడియో ప్రోగ్రాంలలో పాల్గొన్నారు.వీరి అమ్మమ్మ ప్రఖ్యాత రచయిత చలం గారి మేనకోడలు.బడిలో చదువుతుండగా టి.వి.లో ఒకసీరియల్ చూశాక శోభకి ఆర్కిటెక్ట్ కావాలనే బీజం పడటం తల్లి చేయూత తో హైదరాబాద్ JNTU లోB.Arch చేశారు.అప్పుడే డ్రాయింగ్ బొమ్మలు గీయటంతో చిత్ర కళలో కూడా ఆరితేరారనే చెప్పొచ్చు.M.Arch(SPA Delhi) AP(ITPI),Phd(JNAFAU) చేశారు.ఆమె ఫరం”Vasaamaha”. దాదాపు 30ఏళ్ల అనుభవంతో ఆమె చేపట్టిన ప్రాజెక్టులు ఎన్నెన్నో! సత్యం ఫౌండేషన్ , సి.ఎస్.ఆర్.ఆఫ్ సత్యం కంప్యూటర్స్,UNDPGOI Endogenous TourismProject చెప్పుకోదగ్గవి.
విద్యాసంస్థలతో అనుబంధంతో పాటు న్యూస్ పేపర్లకు టెక్నికల్ జర్నల్స్ కి ఆర్టికల్స్ రాస్తారు.
2011లో యునెస్కో పారిస్,UN Habitat నైరోబీ కీన్యా2011, ,2013 ICOMOS బీజింగ్(2012) పెన్సిల్వేనియా యూనివర్శిటీ,ISOCARP( 2020) ముఖ్య మైన వాటిలో ప్రముఖ పాత్రను పోషించారు.
ఆమె ఇలా చెప్పారు”2003లోనే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కి డిటైల్డ్ మ్యాప్స్, డయాగ్రమ్స్ తో రిసెర్చి పేపర్లు పంపాను.కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైద్రాబాద్ కి ఘనచరిత్ర ఉంది.వేలాది చారిత్రక కట్టడాలు ప్రాంతాలున్నాయి. గోల్కొండ కోట పై రిసెర్చి ప్రాజెక్టు చేపట్టాను. మొహరం నెల మొదటిరోజున హైదరాబాద్ నగర శంకుస్థాపన జరిగిన శిలాఫలకం ఉంది.అలా 7 జులై హైద్రాబాద్ పుట్టిన రోజు జరపాలని నాసూచనకి ఆమోదముద్ర పడింది.హైద్రాబాద్ రెసిడెన్సీ కోసం హైకోర్టు లో కేసు కేసువేసి పరిరక్షిత జాబితాలో చేర్చడంలో నాశ్రమ కృషి ఫలించాయి అని చెప్పొచ్చు.సికింద్రాబాద్ కి 200ఏళ్ల ఉత్సవాలు వరంగల్ కాజీపేట హన్మకొండ వారసత్వ కట్టడాలు,కర్ణాటక ప్రభుత్వంకోసం మాస్టర్ ప్లాన్స్ _ కొన్ని చెప్పుకోదగ్గ విషయాలు.అలాగే నూజివీడు వీణ,కొండపల్లి బొమ్మలు ఇతర హస్తకళలకు ఉపాధి కల్పించడంలో ప్రధాన పాత్ర …
ఇక తురగా ఫౌండేషన్ కి ట్రస్టీలుగా ఈ అక్క చెల్లెళ్లు గాక పి.వి.రమణకుమార్ ఛార్టెడ్ ఎకౌంటెంట్,శైలజ పిల్లలమర్రి,రాధికా రమేష్,కల్పనా రాఘవేంద్ర, రేవతీ తురగా గార్లు ఉన్నారు.ఎలాంటి లాభాపేక్ష లేని రిజిష్టర్ చేయబడిన ఈఫౌండేషన్ సామాజిక సాంస్కృతిక సాహిత్యం జర్నలిజం మొదలైన రంగాల్లో తనవంతు కృషి చేస్తోంది.తురగా జానకీరాణిగారి పేరుమీద కథల పోటీలు,అత్తయ్య సత్యవతిగారి పేరుమీద టీచర్లకు ,శ్రీ నరేంద్ర రేవెళ్లి పేరుమీద జర్నలిజం రంగంలో ఉన్న వారికి అవార్డులివ్వడం జరుగుతోంది.బుక్స్ పబ్లిష్ చేశారు.
పూవు పుట్టగానే పరిమళిస్తుంది కి నిదర్శనం తురగా సోదరీమణులు.శోభ భవిష్యత్తులో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ తరుణి సెలవులు సెలవుతీసుకుంది.
శోభగారి ఫోన్ 9848035124