ఆమె మాతృభాష ఉర్దూ! బాల్యంనుంచీ కష్టాలు ఆర్ధిక బాధలు.అన్నింటినీ తట్టుకుని ప్రొఫెసర్ గా రచయిత్రిగా ఎదిగిన షహనాజ్ బతుల్!…
పేరు: డాక్టర్. షహనాజ్ బతుల్. పుట్టిన తేదీ: 03-07-1953. చిరునామా: Dr.Shahnaz Bathul, F.no 205, BLOCK-4, Sri Kalyan Complex(RBR), MIYAPUR, HYDERABAD 500049. Phone: 9948491418. e-mail sbathul@gmail.com.
నా పుస్తకాలు1. స్వర్ణ(మూడు పెద్ద కథల సంపుటి). 2. మట్టిలో మాణిక్యం (కథల సంపుటి). 3. భావాల షహాన(సప్తపదులు 302). 4. జీవిత చక్రం (నవల) అవార్డ్స్ కాదు 1. ప్రతిలిపిలో ప్రతి భాగాల సీరియల్ కి ప్రత్యేక బహుమతి వచ్చింది. 2. జీవిత చక్రం (నా మొదటి నవల) కి తెలిపిన పోటీలో ప్రత్యేక బహుమతి వచ్చింది. చాలాసార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి. ఊసులు అనే ఒక పెద్దవిగా వచ్చి మళ్ళి ఆగిపోయింది అందులో మొదటి సంవత్సరం పూర్తి సందర్భంగా కథల పోటీ పెడితే అందులో ఒక కథకి బహుమతి వచ్చింది. మన కథలు డాట్ కాం లో 2022 వారం వారం బహుమతులలో రెండుసార్లు వచ్చాయి. విమల సాహితీ సమితి గ్రూప్లో కవితలు రాస్తున్నాను. రెండుసార్లు ద్వితీయ బహుమతి రెండుసార్లు తృతీయ బహుమతి వచ్చాయి చాలాసార్లు ప్రశం…
గణేష్ దినపత్రికలో 17 కవితలు ప్రచురించబడ్డాయి. విమల సాహితీ వార పత్రికలో మూడు తపస్వి మనహరం వారపత్రిక మాస్పత్రిగా ఉన్నాయి. వాటిలో నావి చాలా రచనలు వచ్చాయి కథలో కవితలు వ్యాసాలు. సహారి వార పత్రికలో ఒక కథ మాస పత్రిక ప్రచురించబడింది. ఇవన్నీ నేను చెప్పిన 2021 తర్వాత వే.
నా మొదటి వ్యాసాంగము గ్రీటింగ్ కార్డులు వ్యాసం నాలుగు విధాలైన గ్రీటింగ్ కార్డులు తయారు చేయు విధానం రాశాను. 1980 నవంబర్ దీపావళి ప్రత్యేకలో ప్రచురించబడింది. నా మొదటి కథ కన్నతల్లి 1987 ఆగ ష్టు ఆంధ్రభూమి మాస పత్రికలో ప్రచురించబడింది. నా మొదటి కవితలు మూడు కవితలు ఆంధ్రభూమి వారపత్రికలో (16-7-1987) ప్రచురించబడ్డాయి. విశేషం ఏంటంటే నా మొదటి కథ మొదట పంపిన కవితలు మొదటి వ్యాసం తిరిగి రాలేదు. నేను గణితంలో పీహెచ్డీ చేసి రిటైర్డ్ అయ్యాను ప్రొఫెసర్గా. మధ్యలో చాలా కాలం రచనలకి దూరంగా ఉన్నాను.2001నుండి 2021 వరకు.
బాల్యం గురించి పంపించమన్నారు. నేను ఏలూరులో పుట్టి పెరిగాను. ప్రభుత్వ బాలికో నేత పాఠశాలలో 6 నుండి 12వ తరగతి వరకు చదివాను. B.Sc ఏలూరు సెంట్ థెరీసా కాలేజీలో చదివాను. M.Sc (Applied Mathematics)ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. రీసెర్చ్ I.I.T Kharagpur. నా బాల్యం లోనే నాన్న గారు పదవీ విరమణ చేసారు. సొంత ఇల్లు కూడా లేదు. చాలా ఆర్థిక ఇబ్బందులు. ఇంటిలో పరిస్థితి బాగోలేదు. నేను 9 వ తరగతి లో ఉన్నప్పుడు ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే, మా అమ్మ ఫైన్ తో కడతాను అని చెప్పినా, 15 రోజులు గడువు అడిగినా రిజిస్టర్ లో పేరు తీసేసారు. హాజరు లేకపోయినా పాఠశాలకు వెళ్లే దాన్ని. 15 రోజులకు అన్నయ్య దగ్గర్నుండి డబ్బు వస్తే ఇచ్చారు. అప్పుడు మళ్ళీ కొత్తగా పాఠశాల లోచేరినట్లు అడ్మిషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయించుకొని, మళ్ళీ పేరు వ్రాసారు. 13 రోజులు పాఠశాలకు వెళ్ళినా, ఆబ్సెంట్ పడింది. ఇంటిలో విద్యుత్ లేద…
చాలా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసే దాన్ని. నా మొదటి రచన వ్యాసంగం గ్రీటింగ్ కార్డులు తయారు చేసే విధానం (నాలుగు పద్ధతులు) వనిత మాస పత్రికలో 1980 నవంబర్ దీపావళి సంచికలో ప్రచురించబడ్డాయి. మూడు పేజీలు వచ్చింది. ప్రింటిలో మొదటిసారి నా పేరు చూసుకున్నాను.
నేను డిజైన్స్ సొంతంగా వేస్తాను. అలా వేసిన డిజైన్స్ ఆంధ్రప్రభ లో, కలువవాలలో ప్రచురించబడ్డాయి. నా డిజైన్స్ చాలా వచ్చాయి. కార్టూన్స్ కూడా వేసాను ఐదు కార్టూన్స్ పబ్లిష్ అయ్యాక మానేశాను.
నేను చదివింది తెలుగు మాధ్యమం. అన్ని సబ్జెక్టులు బాగా చడివేదాన్ని. ఒకసారి మా తెలుగు టీచర్ అన్నారు ప్రతిపద తాత్పర్యాలు ఒక సాయిబు చెప్పింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెద్ద తాత్పర్యాలు చెప్పలేకపోయావు కులానికి చెడ్డ పూర్తి తెచ్చావు అని బ్రాహ్మిన్స్ అమ్మాయిని తిట్టారు. ఆమె చెప్పలేదు నేను చెప్పాను. నన్ను ఆమెని కొట్టమన్నారు. కొట్టలేను టీచర్ అన్నాను. టీచర్ గారు. అమ్మాయి ని పుట్టారు ఆ టీచర్ గారి కొట్టేవారు హోంవర్క్ చేయకపోయినా కొట్టేవారు. కానీ టీచింగ్ చాలా బాగుంటుంది చాలా మంచి మేడం చాలా స్ట్రిక్ట్. నేను ఎంఎస్సీ చదివేటప్పుడు చనిపోయారు. ఆస్తి కోసం హత్య చేశారు బంధువులే. ఆ కాలంలోనే ఉండేవారు ఇటువంటి వాళ్ళు.
మా టీచర్స్ ఎవరిని నేను మర్చిపోలేదు. ఎందుకంటే అందరూ నన్ను బాగా అభిమానించేవారు. పదవి విరమణ తర్వాత జేఎన్టీయూలో బీటెక్ పేపర్లు వ్యాల్యూ చేయడానికి వెళ్లేదాన్ని. అందులో ఫుల్ బిజీ. 2017 లో.S.I.T లో M.C.A వాళ్లకు గెస్ట్ ఫ్యాకల్టీ గా టీచ్ చేసి దాన్ని. వాల్యుయేషన్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు మానేశాను. 8-4-2022 లాస్ట్ క్లాస్ తీసుకున్నాను ఆ తర్వాత మానేశాను. 2021 లో ప్రతిలిపి అని ఒక అప్లికేషన్లు చేరాను. అందులో చదువుతున్నాను వ్రాస్తున్నాను.
నుండి రచనలలోనే బిజీ వాల్ డెకరేషన్ పీసులు నేను చాలా చేశాను అన్నీ లేవు ఇప్పుడు ఏమైపోయాయో. వేస్ట్ మెటీరియల్స్ తో చేసేదాన్ని.
నా లో ఉన్న కళలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు.