మువ్వన్నెల జెండా

కవిత

ఆకాశాన్నంటుతూ రెపరెపలాడే త్రివర్ణ పతాకం
మన భారతమాత గుండె చప్పుడు!
ఎందరో వీరుల త్యాగాల ప్రతిరూపం!
కాషాయం చెబుతుంది త్యాగం చేయమని
తెలుపు చెబుతుంది శాంతిగా సాగమని
ఆకుపచ్చ చెబుతుంది అభివృద్ధి సాధించమని
మధ్యలోని అశోకచక్రం చెబుతుంది
నిత్యం.. సత్యం పలకమని, నిజాయితీగా ఉండమని.
సరిహద్దుల్లో సైనికుడు నిలబడితేనే
మన ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి
రైతు తన చెమటను చిందిస్తేనే
మన పళ్లెంలో అన్నం పండుతుంది
కార్మికుడి చేతులు కదిలితేనే
దేశ నిర్మాణం ముందుకు సాగుతుంది.
జెండా వందనం చేసే వేళ
చేతులు మాత్రమే పైకెత్తకండి…
దేశం కోసం మనసును పైకెత్తండి
దేశం కోసం ఒక మంచి పని చేయండి
దేశం కోసం ఒక్క అడుగు వేయండి
కులమతాల గోడలు కూల్చి
ప్రేమతో చేతులు కలుపుదాం
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి
భారతదేశాన్ని ఉన్నతంగా నిలుపుదాం
మువ్వన్నెల జెండాకు వందనం!
భారతమాతకు శతకోటి వందనం!
జై హింద్! జై భారత్!

Written by S Srilatha

చదువు ఇంటర్ మీడియట్
వృత్తి స్టోరీ రైటర్, 2d యానిమేటర్.
ఇప్పటి వరకు దాదాపుగా అన్ని పత్రికలలో కవితలు ప్రచురణ పొందాయి

9390572564

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఋషిక ఇంద్రాణీ

స్వాతంత్ర్య దినోత్సవం …