శ్రీశైలం నుంచి కర్నూలు మీదగా కారు నడుపుకుంటూ వస్తున్నాడు. ప్రద్యుమ్న. స్నేహితుడిని కలిసి రెండు రోజులు చుట్టుపక్కల ఉన్నావులన్నీ చూడాలని బయలుదేరాడు. ముందుగా విజయవాడలో దిగి కనకదుర్గమ్మను చూసుకొని ఆ తర్వాత పానకాల స్వామి మంగళగిరిలో, అలాగే దారిలో కాకాని చూసుకొని గుంటూరులో ఉన్న అనిరుద్దుని కలవాలనుకున్నాడు. “ప్రద్యుమ్న పదేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డాడు భార్య మనోజ్జ కూడా తన లాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నది. వాళ్లకు ఒక్కడే బాబు. ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు. ” పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం అమెరికా నుంచి వచ్చి హైదరాబాదులో దిగాడు. అటు నుంచి శ్రీశైలం దర్శనం చేసుకుని వస్తున్నాడు. నల్లమల అడవుల్లో నుంచి కారు వస్తున్నది. హెడ్ లైట్స్ కి జంతువులు ఏమైనా కనిపిస్తాయని చూస్తున్నాడు. చివరి మలుపులో ఒక వృద్ధురాలు గోడకానుకొని కూర్చొని ఉంది. వయసు 70 దాకా ఉండవచ్చు. వెంటనే కారు ఆపి దిగాడు. దాదాపు అడవులన్నీ దాటేసినట్లే. “ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి భుజం మీద చేయి వేసి తట్టాడు. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఏమిటి ఇక్కడ ఉన్నారు. ఇది ప్రమాదకరమైన ప్రదేశం అని మీకు తెలియదా. అందులోనూ ఒంటరిగా వచ్చారు. దారి తప్పేరా మీ వాళ్ళు ఎవరు రాలేదంటూ ఆమెని పరీక్షగా చూస్తున్నాడు. “ఆమె నోరు విప్పలేదు. ఎక్కడో చూసినట్లు ఉంది అనుకున్నాడు మనసులోనే. ఎక్కడికి వెళ్లాలో చెబితే తీసుకువెళ్తానన్నాడు. “అటు ఇటు చూస్తున్నది కానీ మాట్లాడటం లేదు. ఆమెను చెయ్యి పట్టుకుని కారు దాకా తీసుకొచ్చాడు. ఆమె పరిస్థితి చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నది. వెనక సీట్లో కూర్చోపెట్టాడు. కళ్ళు మూసుకొని పడుకుంది. ఆమె చేతి సంచిలో రెండు పాత చీరలు ఉన్నాయి. “తెలతెలవారుతున్నది. కారు విజయవాడ రాగానే ఒక క్యాంటీన్ దగ్గర కారు ఆపి రెండు కప్పులతో కాఫీ తెచ్చి అవ్వ ముందు కాఫీ తాగమంటూ అందించాడు.” “కళ్ళు తెరిచి చూసింది. ఆమె ఎక్కడ ఉన్నదో అర్థం కాలేదు. నాకెందుకు బాబు అంటూ నోరు విప్పింది. పరవాలేదు అవ్వ. ముందు వేడివేడి కాఫీ తాగితే కొంచెం నీరసం తగ్గుతుంది అంటూ కప్పు నోటిదాకా అందించాడు.” “వేడి కాఫీ తాగేసరికి శరీరంలో కొత్త శక్తి వచ్చినట్టుంది. “నీకు ఎవరైనా ఉంటే చెప్పు. మీ వాళ్ళ ఇంట్లో దింపుతానన్నాడు. “నన్నేదైనా ఆశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకో బాబు అన్నది. “అంటే నీకు ఎవరూ లేరా అడిగాడు.
“ఆ వివరాలు ఏమి సన్ను అడగవద్దు. చేతనైతే ఆశ్రమంలో చేర్పించు. అసలు అడవుల దగ్గరే ఉంచిన బాగుండేది. ఏ జంతువుకు ఆహారం అయిపోయేదాన్ని. దాని ఆకలి తీర్చిన దాన్ని అయ్యేదాన్ని. ఆమె కళ్ళల్లో నీళ్లు రావడం లేదు. ఎంత అడిగినా వివరాలు చెప్పడం లేదు. ఇంకొకరైతే నాకెందుకులే ఈ దరిద్రం అని వదిలేసి వెళ్లేవాళ్లు.” “అలాగే అంటూ విజయవాడలో ఉన్న స్నేహితుడు గోపి సర్ మీ ఇంటికి వెళ్ళాడు ప్రద్యుమ్న.” “ప్రయాణం బాగా జరిగిందా! ఇంకా ముందే వస్తావు అనుకున్నాను. పద! త్వరగా స్నానం ముగించి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుందాం అన్నాడు.” “నాకు హెల్ప్ చెయ్యాలి రా అన్నాడు.” “ఏమిటో చెప్పరా! “ “నాతో పాటు ఒక పెద్ద ఆవిడను తీసుకొచ్చాను. ఆమెకు ఎవరూ లేరుట శ్రీశైలం అడవుల్లో కనిపించింది. ఈ రెండు రోజులు మనతోనే ఉంటుంది. తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాను. మీ ఇంట్లో ఉంచుకోవడానికి నీకేమైనా అభ్యంతరమైతే చెప్పు అన్నాడు ప్రద్యుమ్న.” “అసలు ఆమె ఎవరు? ముక్కు మొహం తెలియని వాళ్ళని వెంటబెట్టుకొచ్చావు. ఆమె నీకు తెలిసిన బంధువా! అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావేమో! ఎందుకొచ్చిన గొడవ. ఎక్కడైనా గుడిమెట్ల దగ్గర వదిలేసి రాకపోయావా!” “అలా అనకు రా పాపం. ఆమెకు ఎవరూ లేరని తెలిసింది.” “ఈమధ్య ఎవరికి పడితే వాళ్లకి ఆశ్రయం ఇవ్వకూడదని టీవీలో చూడటం లేదా! పాపం అని జాలి తెలిస్తే అర్ధరాత్రి ఇంట్లో నగలు డబ్బు దోచుకుని పోతున్నారు.” “ఆమె ఎలాంటిది కాదురా. బాగా బతికిన మనిషి లాగా ఉన్నది. ఈ చిన్న హెల్ప్ చేయాలంటూ బతిమిలాడాడు. “ లోపల నుంచి గోపీశర్మ తల్లిదండ్రులు వచ్చారు. ప్రద్యుమ్న ని చూసి కుశల ప్రశ్నలు వేశారు. ప్రద్యుమ్న ఆ పెద్దావిడ గురించి చెప్పగానే ముందు సంశయించిన అలాగే తీసుకురమ్మన్నారు. “ఆమెను కారులో నుంచి దింపి లోపలకి తీసుకువచ్చారు అక్కడ అమ్మకన్నీ సదుపాయాలు చూపించారు.” “గోపి శర్మతో కూడా బయలుదేరి దుర్గ గుడి దర్శనం చేసుకుని అటు నుంచి మంగళగిరి పానకాల స్వామిని చూసుకొని కాకాని తర్వాత గుంటూరు చేరుకున్నారు మిత్రులు ఇద్దరూ.” “రేపు జరగబోయే పూర్వ విద్యార్థుల సభకు అందరూ కలుసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు.” గుంటూరు హిందూ కాలేజీలో జరగబోయే సభకు అందరికీ ఆహ్వానం పేపర్లో ప్రకటించారు. ముఖ్యంగా ఆ పని మీదనే వచ్చాడు ప్రద్యుమ్న.
“గుంటూరులో కారు దిగి శంకరంని కలవాలని ఇంటికి వెళ్లారు. ముందు గదిలో ఎవరూ కనిపించలేదు. లోపల నుంచి పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి.” మిత్రులిద్దరూ అక్కడే ఆగిపోయారు. మీ అమ్మని తిరిగి ఇంటికి తీసుకొస్తే మాత్రం నేను ఏ నుయ్యో గోయ్యో చూసుకుంటాను. ఇంట్లో కూర్చోబెట్టి ఎవరు చాకిరీ చేస్తారు. నావల్ల కాదంటున్నది శంకరం తల్లి. అదే నీ తల్లి అయితే ఇలా వదిలేస్తావా! నువ్వు అన్న మాటలకు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎవరిని అడిగినా ఎవరింటికి రాలేదంటున్నారు. ఈ వయసులో ఆమె ఎక్కడికి పోయిందో ఏమిటో? తెలిసిన చోట అంతా వెతికాను. ఇంక పోలీస్ కంప్లైంట్ ఒక్కటే ఇవ్వాలి. తల్లిని సరిగా చూసుకోలేని వాడివి నువ్వేం కొడుకువయ్యా? ఇప్పుడు నన్నే చివాట్లు పెడతారు. ఆమె నీకేం అన్యాయం చేసిందని ఇంత కక్ష కట్టావ్ అంటూ భార్య మీద విడుచుకుపడ్డాడు శంకరం తండ్రి. ఇప్పుడే శంకరం ముందు గదిలోకి వచ్చి వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతసేపు అయింది రా మీరు వచ్చి. కనీసం ఫోన్ అన్నా చేయలేదు. పేపర్లో ప్రకటన చూసే ఉంటావు అనుకున్నాము. ఒకసారి అందరినీ పలకరించి చూసినట్లు ఉంటుందని ఇంటికి వచ్చాను. ఎందుకు ఆలస్యం బయలుదేరు సభకు వెళ్తాం అన్నారు. నా మనసంతా చికాకుగా ఉంది రా. నాకైతే అసలు రావాలని లేదు. ఇలా మనం అందరం ఒకచోట కలుసుకోవడం చాలా సంతోషం. పదండి ఒకసారి అందర్నీ చూసి వద్దాం అన్నాడు. మీ ఇంట్లో ఏదో గొడవ పడుతున్నట్లు ఉన్నారు ఏదైనా సమస్య అన్నారు. పెద్ద సమస్య వచ్చి పడింది రా. ఏం చెప్పను. మా బామ్మ అంటే మా అమ్మకు సరిపడదు. ఇల్లు అమ్మిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేసిందని తాతయ్య పోయి చాలా కాలమైంది అమ్మకి కోపం. ఎప్పుడు సతాయిస్తూనే ఉంటుంది. నిన్న ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. పెద్ద గొడవే జరిగిందనుకో. అప్పటినుంచి మా బామ్మ కనిపించడం లేదురా! నేను ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాను ఆ విషయం గురించి అమ్మా నాన్న చర్చించుకుంటూనే గొడవ పడుతున్నారు బాగా శంకరం. ఈమె నా మీ బామ్మ అంటూ ఒక ఫోటో చూపించాడు ప్రద్యుమ్న. ఆ ఫోటో చూసి మరింత షాక్ అయ్యాడు శంకరం. ఈమె నీకు తెలుసా ఎక్కడైనా కనిపించిందా. చెప్పరా బాబు. మా బామ్మ ఇంటికి రాకపోతే మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆమె వస్తే మా అమ్మాయి ఇంట్లో ఉండనంటున్నది. దీనికి ఏదైనా పరిష్కారం నువ్వే చెప్పాలి రా అన్నాడు. “నేనా! అదెలా సాధ్యం. “సాధన చేస్తే సాధ్యం కానిదేముంది. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది. అయితే నేను చెప్పినట్లు చేస్తావా అన్నాడు ప్రద్యుమ్న. “గోపిశర్మకు కూడా అదేంటో అర్థం కాలేదు.” ఈరోజు మనం పూర్వ విద్యార్థులందరినీ కలవడానికి కాలేజీకి వెళ్తున్నాం కదా. మనం తీసుకుపోయే నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిద్దాం. అందుకు మన యువతరం అంత ఒక్కటే ఒక శఫదం చేయాలి. చెప్పరా ఏం చేయాలో అన్నారు ఇద్దరూ ఆత్రంగా. నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి. అక్కడ అందరూ మనలాంటి ఒక్కరే వస్తారు. అంటూ తన మనసులోని గూడు కట్టుకున్న ఆవేదనను దానికి పరిష్కార మార్గాన్ని ఇలా చేద్దాం అంటూ వివరంగా చెప్పేసరికి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సాయంత్రం వేదకు మీద పెద్దలందరూ ఉపన్యాసాలు ముగించారు. ముందుగా చెప్పి ఉంచాడు ప్రద్యుమ్న మిత్రులందరికీ. స్టేజి మీదకు వచ్చి విద్యార్థుల ఆహ్వానించారు. “అందరికీ వందనాలు. ఈ పాఠశాలలో చదువుకొని మేమంతా ఇంతటి వాళ్ళమయ్యామంటే అది మా గురువుల బోధన అనే చెప్పుకోవాలి.” కొట్టినా తిట్టినా కోపడిన మా భవిష్యత్తు బాగుండాలనే మాకు చదువు చెప్పారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేశారు. అలాంటి గురువులు తల్లిదండ్రులు రుణం ఎన్ని జన్మల కైనా తీరేది కాదు. ఆ వాతావరణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అయితే మీకు అందరికీ ఓ ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మన తల్లిదండ్రులు మనల్ని ఇంతటి వాళ్ళని చేశారు. అలాంటి తల్లిదండ్రులని మనం దూరం చేసుకోగలమా! లేదు! లేదు మేము ఎన్నటికీ దూరం చేసుకోలేమంటూ గళాలు గర్జించాయి. “మన భామలు తాతయ్య అమ్మమ్మలను దూరం చేసుకుంటున్న మన తల్లిదండ్రులని ఏమనాలి?” “ఇది అందరి మనసులోనూ ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. “మీరే చెప్పండి! మన చిన్నప్పటి నుంచి బామ్మ తాతయ్యలతో కలిసి పెరిగాం. వాళ్ల వల్ల ఎంతో సంస్కృతి సంప్రదాయాల్ని నేర్చుకున్నాము. చిన్నప్పటి నుంచి రాజనీతి కథలు, భారతం, భాగవతం నుంచి మంచి మంచి చందమామ లాంటి కథలెన్నో చెప్పేవాళ్ళు. మన ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారు. మనం స్కూల్ నుంచి రాగానే తినటానికి కమ్మగా వండి పెట్టేవాళ్ళు. పసితనములో ఎత్తుకొని ఆడించారు. అలాంటి వారిని మనం ఇప్పుడు దూరం చేసుకుంటున్నామా! ఇది న్యాయమేనంటారా?” “కాదని అందరూ గట్టిగానే చెప్పారు. మనది తాతయ్య భామలు కావాలి. వాళ్ళని దూరం చేసుకోకూడదు. వాళ్లని వాళ్ల పిల్లలు అంటే మన అమ్మానాన్నలు తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. వయసు అయిపోయిందని, ఏదైనా చెప్పబోతే మీకు ఏమీ తెలియదంటూ పక్కన పెట్టేస్తున్నారు. మీ మాటలు చాదస్తం అంటున్నారు.”
ముసలితనం వచ్చాక మూల కూర్చోవాలని ఆంక్షలుతో వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు. వాళ్లు మనలాంటి మనుషులే కదా! మన అమ్మానాన్నలని కానీ పెంచి ఇంత వాళ్లను చేస్తేనే కదా ఈనాడు వాళ్లంతా వృద్ధిలో ఉన్నారో అర్థమవుతుంది. ఇంతకీ నేను చెప్పబోయేది ఏమిటంటే ప్రతి ఇంట్లోనూ మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఇంట్లో ఉంచుకుంటే వాళ్లకి సేవలు చేయాల్సి వస్తుందని, భరించలేక కొంతమంది పట్టించుకోవటంలేదు. ఇప్పుడు మనమంతా ఆలోచించాల్సిన రోజులు వచ్చాయి. రేపు మన పిల్లలు కూడా మనల్ని ఇలాగే దూరం పెట్టేస్తే చూస్తూ ఊరుకుంటారా! “ఇప్పుడు మనం అంతా కలిసి ఈ సమస్యకు పరిష్కారం కొరకు ఆలోచించాలి. యువత ఏదో చేయాలని యువత ఏదో ఆలోచించాలని యువత ముందుకు రావాలని యువత నడుము కట్టాలని అంటారు కదా! అదే ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం. “సభా అంతా నిశ్శబ్దంగా ఉంది. “మనమందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. మన తాతలు బామ్మలు మన ఇంట్లోనే ఉండేటట్టు మన తల్లిదండ్రులకి చెప్పాలి. ఒకవేళ వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించితే ఇంటికి తీసుకొని రావాలి. వాళ్ళు అలా చేయడం ఇష్టం లేకపోతే మనం కూడా మన తల్లిదండ్రుల్ని దూరం చేసుకోవాలి. “ఇది ఎలా సాధ్యం! » “మన తల్లిదండ్రులకి మనం దూరమైతే ఎంత బాధ పడతారు వాళ్ల తల్లిదండ్రులు ని దూరం చేస్తే వాళ్లంతా బాధపడతారో వాళ్ళు ఆలోచించేలాగా చేయాలి! బామ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అప్పుడే మేము కూడా మీతో కలిసి ఉంటామని మనమంతా ఏకమై ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి సమస్యల్ని వ్యతిరేకించాలి. మన తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలు ఎంత ముఖ్యమో! వాళ్ల తల్లిదండ్రులకు వీళ్ళు కూడా అంటే ముఖ్యం.” ఈరోజు నుంచి మనం ప్రతి కుటుంబానికి నచ్చ చెప్పాలి. పెద్దవాళ్లు తాతయ్యలు బామ్మలు మనకి జీవితాన్నిచ్చి ఇంతటి వాళ్ళని చేసిన వాళ్ళని వృద్ధాశ్రమాల్లో ఉంచడం లేదా గాలికి వదిలేయటం మంచిది కాదు. అటువంటి వాళ్ళని ఇంటికి రప్పించేలాగా చేయాలి. అప్పుడే మనం ఒక మంచి పనికి శ్రీకారం చుట్టిన వాళ్ళమవుతాం ఏమంటారు ఆవేశంగా అన్నా ప్రద్యుమ్న. “అక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులంతా ప్రద్యుమ్న మాటలకు కారతాళ ధ్వనులు మారుమృగాయి.” “మేమంతా మీ మాటే వింటాం. అంతా శపథం చేద్దాం. ఒకే మాట మీద నిలబడదాం అంటూ విద్యార్థులంతా స్టేజి పైకి వచ్చారు. ఎవరింట్లో తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో చేర్పించారు ఎవరినైతే దూరం చేశారో వాళ్ళందరూ తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేదాకా మనం ఇంటికి రాకూడదని నిశ్చయించుకున్నారు.” పూర్వ విద్యార్థుల సభ కార్యక్రమం ముగిసింది. ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల్ని నిలదీస్తున్నారు. తాతయ్య బామ్మల్నీ ఇంటికి తీసుకొచ్చే వరకు మేము ఇంటికి రామని ఎదురు తిరిగారు. కొడుకుల కోసం ఎక్కడ దూరమైపోతారో నన్ను తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. వాళ్ల వల్ల ఉన్న నిరుపయోగాలన్నీ బయట పెడుతున్నారు. మీరు ఎన్ని చెప్పినా మేము వినం. ప్రతి ఇంట్లోనూ ఆశ్రమంలో ఉండాల్సిన పెద్ద వాళ్ళందరూ ఎవరింట్లో వాళ్ళు ఉండాలి అప్పుడే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవిస్తారు. లేకపోతే ఇప్పటినుంచి వాళ్ళకి దూరం కావాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. “ప్రతి తల్లిదండ్రి ఆలోచనలో పడ్డారు. నేను చేసింది తప్పే మా కోసం మీరు దూరం కావొద్దు. మీరు మాకు దూరం అయిపోతే ఒక క్షణం కూడా భరించలేమంటూ ప్రాధేయపడ్డారు.” ఒక ఉద్యమంలో సాగిన నినాదాన్ని నెమ్మదిగా ఆలోచనలో పడవేసింది. మనుషుల్లో మార్పు ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. మా పిల్లలు మాకు దూరం కాకూడదు అనుకున్నారు. వెంటనే ఆశ్రమల్లో చేర్పించిన తల్లిదండ్రులని గౌరవ మర్యాదలతో ఇంటికి రప్పించారు. ప్రద్యుమ్న కారులో నుంచి అవ్వని బయటికి పిలిపించారు. ఆమెను చూసిన శంకరం తల్లిదండ్రులు నిర్గంత పోయారు. అమ్మ! నన్ను క్షమించు. నువ్వు ఎందుకు పనికిరాని దానివని అవమానించాను. నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోయావు. తిరిగి ఇంటికి తీసుకొని రాలేని అసమర్థుడిని. భార్య మాట కాదనలేక చేయరా నేరం చేశాను. కన్న తల్లి పని కూడా చూడకుండా కఠినంగా ప్రవర్తించాను. నా కొడుకు నా కళ్ళు తెరిపించాడు. చివరి రోజుల్లో జీవితాన్ని ప్రశాంతంగా గడపమంటూ తల్లిని చేయి పట్టుకుని పాదాలకు నమస్కరించాడు. ఆమె చిరునవ్వుతో ఆశీర్వదించింది. ప్రద్యుమ్న తీసుకున్న నిర్ణయం బలంగా మారింది కొంతమంది వృద్ధులైన ఆశ్రమ జీవితం నుంచి బయటపడేసి వాళ్ళ పేగు బంధాల దగ్గరకు చేర్చాడు. ప్రద్యుమ్నా లాంటి కొడుకు ఉంటే చాలు ప్రతి తల్లిదండ్రి వాళ్ళ తల్లిదండ్రులని ఆశ్రమల్లో చేర్పించాలని ఆలోచన ఎవరికి రాదు రాకూడదు. యువ సందేశం అమలైంది.. నీలాంటి బిడ్డలు ఉంటే తల్లిదండ్రులందరూ సుఖంగా శేష జీవితాన్ని గడపగలుగుతారంటూ అందరూ ప్రద్యుమ్న ని అభినందించారు.