వాన కోయిల

చిరుజల్లుతో తడిసిన నేలమ్మ అందాలకు మురిసి చింతలన్నీ
మాని గొంతెత్తి కూస్తుంది ఈ
వానకారు కోయిల

ఆరుగాలపు శ్రమతో అలసిన హాలికున్ని తొలకరి వచ్చిందంటూ తొందరపెట్టి నిద్రలేపే రైతునేస్తం
ఈ కొత్త కోయిల

స్వాతి చినుకులే అమృతమంటూ పొందువతో గొంతుకలో పొదువుకునే వర్షప్రియ
ఈ చిన్నికోయిల

గగనవీధులలో తీగలపై ఊయలలూగుతూ
ఎగిరే కీటకాలను ఒడిసిపట్టి సొంతం చేసుకుంటుందీ
చిట్టి కోయిల

దేశాలన్నీ చుట్టేస్తూ
నదులలో మునకలేసి
కొలనులో ఈదులాడుతూ
గుబురు పొదల్లో విహరించే నిరంతర సంచారి ఈ చాతకపక్షి

వాన చినుకులకై తపిస్తూ
కొత్త వసంతం కోసం ఎదురుచూస్తుంది
ఒంటరితనం అసలే గిట్టని
దీర్ఘశాంత ఈ గుంపుకోయిల

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బొమ్మ-బొరుసు

ఇంటి పని – The Home Work