వినాయక చవితి

నానీలు

1)వినాయకుడికి
పుట్టినరోజు
మంటపాల్లో
సందడంతా పిల్లలదే మరి

2)పూజలు సరే!
పుస్తకాలుపెట్టి
ఒజ్జను బుద్ధినిమ్మని
కోరుకుంటున్నారా?

3)అమ్మలుంటారు
బిడ్డల జోలికెళ్లొద్దు
కోపంతో శాపమిస్తారు
జాగ్రత్త!

4)కన్నడు మంచోడే!
చంద్రుడే అల్లరోడు
పడితే
నవ్వుతారా ఎవరైనా

5)సిద్ధి బుద్ధి భార్యలట
క్షేమం లాభం బిడ్డలట
తత్వమేమిటో
తెలిసిందా?

6)గజాననుని జ్ఞానం
అనంతం
అందుకేగా
గణాధిపతి అయ్యాడు

7)ఆకారమే
ప్రకృతి సాకారం
అవగతమైతే
ఇచ్చే సందేశాలెన్నో

8)చవితి పాయసం
భలే కుదిరింది
భయం భక్తి ఉంటే
అన్ని పనులు ఇంతే!

9)కోరిన రూపంలో
కొలువై
ఊరంతా ఊరేగింపుగా నీటిలో నిమజ్జనం

Written by G. Sulochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘మన మహిళామణులు’ ఎం.వి. ఉమాదేవి

అక్షర ప్లాంట్స్