ఎన్నెన్నో అందమైన స్మృతులు,
ఎన్ని పోగేసిన మిగిలిపోయిన అనుభూతులు….
మదిలో తారావలే మెరిసిన జ్ఞాపకాలు,
మాటలో చెప్పలేని మధుర భావాలు..
తిరిగిరాలేని ఆహ్లాద క్షణాలు,
నా సోదరుడితో గడిచిన ఆ చిన్ననాటి రోజులు…
పుట్టుకతో వచ్చిన ఈ తోడుగా,
వినాశనం వరకు నిరంతరం మనసులో నిలుపుకుంటూ, మనోజ్ఞమైన ఈ బంధాన్ని అనురక్తితో ఆహ్వానిస్తూ,
అడుగడుగున అనంతమైన ప్రేమ పోగేస్తూ,
ఎడతెగకుండా ఎనలేని కూరిమి తో,
ఈ బంధం జన్మజన్మల కు నిలిచిపోవాలి…