C-Section

కవిత

జనన మరణాలు
మనిషి చేతిలో లేవనే
ఒకనాటి మాట ఇప్పుడు ఒట్టి మాటాయె;
ప్రకృతి ధర్మాన్ని ఎదిరించి,
స్వార్థ చింతన ఎక్కువై …
మోయకుండా కడుపులో,
పదినెలల పాటు కన్నపేగును,
పురిటి నొప్పులు పడలేమని,
శాస్త్రవిజ్ఞాన అండతో అతివలు
శస్త్ర చికిత్స పేరుతో
ముహూర్తాలు చూసుకొని మరీ
కడుపుకు కోత పెట్టించుకుని
జన్మనిస్తున్నారు బిడ్డలకు.

కొత్త కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన
అమెరికా అధ్యక్షుని ఆంక్షల నడుమ,
గర్భిణులైన ప్రవాస భారతీయులు,
పుట్టబోయే బిడ్డల అమెరికా పౌరసత్వాలకై,
క్యూలను కడుతున్నారు ఆసుపత్రులకు
కడుపులకు కోతలకోతల కోసం
ఒకప్పుడు కడుపు కోత అర్థం వేరు..
ఇప్పుడేమో అది సి సెక్షన్ కు మీరు పేరు
పరాయి దేశ పౌరసత్వానికంత విలువా?
ఆధునికతనా? ఆడంబరమా?
పుట్టుకతోనే ప్రాంతీయత
పెరగాల్సిన బుద్ధి దో…!!
మనుషులు గా
మన పయనమెటు?????

Written by Dr. Majji Bharathi

ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరంలో ప్రొఫెసరుగా మరియు మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డా. మజ్జి భారతిగారు, మూడు కథా సంపుటాలు- 1. ఆలోచనా తరంగాలు (2022), 2. వేకువ (2024), 3. జీవన గానం (2025), 4. భారతీ! వందనము అనే పద్య సంకలనాన్ని వెలువరించి, నాల్గవ కథా సంపుటం "అనగనగా ఒక కథ" ప్రచురించబోతున్నారు. వందకు పైగా కథలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ వ్యాసాలు, ట్రావెలాగ్స్, కవితలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం అనుబంధం, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, మాతృక, భూమిక, పాలపిట్ట, ప్రసారిక, సాహితీ కిరణం మొదలైన పత్రికలలో, కథామంజరి, కౌముది, విహంగ, సారంగ, సంచిక, మాధురి, తరుణి, మయూఖ, రవళి, గో తెలుగు డాట్ కాం మొదలైన అంతర్జాల పత్రికలలో) ప్రచురింపబడ్డాయి. ఐదు కథలకు బహుమతులు, ప్రత్యేక బహుమతులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నేటి భారతీయమ్” (కాలమ్)

జీవితం fairy tale అంటారా?