పిల్లలు చాక్లెట్ తిన్నంత సంబరంగా పచ్చదనాన్ని చూస్తే పెద్ద వాళ్లకు ఉంటుంది. హృదయం కదిలిపోవాలి. హృదయం పరవశించి పోవాలి . హృదయంలోకి కన్నీటి బొట్టు చుక్కగా వెళ్లినట్టు కాదు. పెదవుల పైన నవ్వులు విరిసినట్టు. మనసు లోపలికి తొంగి చూసిన కోకిల పాటలా, నెమలి ఆటల, చల్లని చిరుజల్లులా ఎత్తైన పర్వతం లా , చల్లని హిమశిఖరంలా అలా ప్రకృతి మనుషులతో స్నేహం చేసినట్టు ఒక చక్కని ఊహ ఎంత బాగుంటుంది. బాగా దగ్గరివాడైన స్నేహితుడిలా ప్రకృతి మనిషికి ఉండాలి. కళలు సాహిత్యాన్ని కాదు చరిత్రను రాస్తాయి. కళాలు గుండె లోగిళ్లను కవిత్రీకరిస్తాయి. ఈ పచ్చని ఇల్లు green house గురించి ప్రతి మనిషి మనసు ఎత్తాల్సిందే. ప్రతి మనిషి మాట ఎత్తాల్సిందే.
ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము అని రెండు ప్రధాన జ్ఞానాలు ఉంటాయి. ఈ రెండు పంచభూతాల తో నిండిపోతాయి. గాలి నీరు నిప్పు భూమి ఆకాశం మనిషి లోపల ఉంటాయి కాబట్టి మనిషి శరీరమే ఒక పచ్చని ఇల్లు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? తూచలేని కన్నీళ్లను ఆలోచించగలిగేది ఆత్మజ్ఞానం. పంచలేని కఠినత్వాన్ని గురించి అర్థం చేయించేది ఆత్మజ్ఞానం. పరి పరి విధాల పోయే మూర్ఖత్వాన్ని పటాపంచలు చేసేది ఆత్మజ్ఞానం. ఇంతకన్నా “పచ్చందనం” ఇంకేముంటుంది. శుభ్ర సుందరమైన మనసు ఉండడం కన్నా మరి ఏమి “ధనం “ఉంటుంది?
భావం మిన్నేరు శబ్ద ఝరి అయినప్పుడే పరమాత్మ జ్ఞానం బోధపడుతుంది. పరమాత్మ అంటే ఎక్కడో లేదు మన మనసుల్లో స్వచ్ఛమైన ఆలోచననే పరమాత్మ. ఏ ప్రలోభాలకు లోను కాకుండా ఏ కోపతాపాలకు లోను కాకుండా ఆవేశకు ఆవేశాలకు లోను కాకుండా ఉన్నప్పుడే స్పటికమైనటువంటి నీవు కానీ నీ లోపల దాచలేనితనం నేను అనే అహాన్ని వదిలినప్పుడు కదా ఆత్మ పరమాత్మల సంయోగం అయ్యేది.
సమాజమూ ప్రకృతి రెండింటి కలయికనే పర్యావరణం అని ఒక కొత్త నిర్వచనాన్ని తెచ్చుకుంటే… మనమే పచ్చని ఇల్లు అవమూ! ఈ మర్మాలపై దృష్టి సారిస్తున్నాము. ఆ మర్మాలన్నీ అస్తిత్వాన్ని ప్రకటించేవే. ఇది Lyrical element లా అంటే గేయాత్మకత. అట్లా ఆలోచించే నడవడిక ఉన్నప్పుడే సాధ్యం. సంగీతం ఆకర్షణీయంగా ఉన్నట్టు సాహిత్యం హృదయగతంగా ఉన్నట్టు సమాజాన్ని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు బుద్ధి ద్వారాలు తెరచుకోవాలి.
ఈ రెండు రకాల జ్ఞానాలతో తోటి మనిషిని గౌరవించే అలవాటు, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే అలవాటు… ఇవే ! వీటితో మనిషిలోని పర్యావరణ పరిరక్షణకు పునాదులు వేసుకునే వారమవుతాం.
ఎలాంటి గౌరవం? ఆడవాళ్లు ఆడవాళ్లను, అందరినీ సమస్త జీవులనూ గౌరవించడం నేర్చుకోవాలి. మగవాళ్లు ఆడవాళ్లను సమానంగా చూడాలి. ఆత్మ పరిశుభ్రత వల్లనే ఇది సాధ్యం. స్త్రీ లు సృష్టి కర్తలు, ఇది కూడా ఆడవాళ్లు మగవాళ్లను గౌరవం గా చూడడం ఇలాకూడా సృష్టి కర్తలవుతారు. ఇంతకన్నా గొప్ప Green House ఏముంటుంది?