నీ శ్రమ వలనే,
ఈ ఆనందం…
నీ ఓపిక వలనే,
ఈ ఆవకాశం…
నీ నమ్మకం వలనే,
ఈ అభివృద్ధి…
నీ మాటల వలనే,
ఈ జీవితం…
నీ ప్రోత్సాహం వలనే,
ఈ వర్తమానం…

నీ జ్ఞానం వలనే,
ఈ ఆధ్యాత్మికత…
నా సౌఖ్యం కోసం,
నీ సుఖం తాగ్యం…
నా విజయం కోసం,
నీ తాపత్రయం…
నా ఆలోచనికి ఆయుష్షు నీవు..
నా కోటి ఆశయలకి,
కనుక నీవు…
నా జీవితానికి
స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి నీవు…
నీ వలనే , నాకిీ రంజనం…
నీ వలనే నేను….