మృదుమధురమైన స్వరం తో చక్కని కీర్తనలు పాడిన శ్వేతా రాణి గానాన్ని వీనండి. ఆమె తనను గురించి ఏమంటున్నారంటే…
” నా పేరు శ్వేతా రాణి నెల్లుట్ల. ఆమెరికాలో సాఫ్ట్ వేర్ రంగం లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాను.నా తల్లి తండ్రులు- నెల్లుట్ల సంధ్యా రాణి మరియు జగన్నాథ రావు గారులు. నా భర్త సంపత్ కుమార్ మల్లెల. నేను సంగీతము మరియు నృత్యము నేర్చుకున్నాను. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ”
మనమంతా శ్వేతా రాణి కి అభినందనలు చెబుదామా!
డాక్టర్ కొండపల్లి నీహారిణి
– తరుణి సంపాదకులు
