హుళక్కి

దేవుడెక్కడ? అనే అన్వేషికి!
సాటి మహిళ బాధకు కరిగే
మనసున్న మనిషి
దేవుడి ప్రతి రూపం కాదా?

నిర్మల హృదయాల కన్నీటి చుక్కలో
కనిపించేది దైవమే కాదా?

బాల్యంనుండీ పరిచయమైనా…
ఆపదలో మాత్రం వారామడదూరం !
ఇక దైవమెక్కడ? దయ్యాలే అంతా!
గుడిలోనే బండలమాటునే
కోనేటి రాయడు కొలువై ఉంటాడా?

ఆర్తులకోసం కన్నీరు కార్చే
మండే గుండెలలో దాగుండడా జంగమ?
పండగనాడే కొలవాలా పరమాత్మను?
పరుల శోకం చూడని
భక్తి పరులకైనా చేరువయ్యేనా?
ఈనాడది దండగేనా!

ఆడా-మగా మధ్య ఇన్ని తేడాలెందుకు?
ఓదార్చే మాట చెప్పితే దోషమా?
సహృదయుల కన్నీటి చుక్కలో
చక్కని దేవుడుంటాడంటారే?
అంతా హుళక్కేనా?

రంగరాజు పద్మజ

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రేమ కులం

రమక్కతో ముచ్చట్లు – 29