ధవళ కాంతులు

శ్వేత ప్రపంచం రెండవ & చివరి భాగం

మనకు తెలిసిన శ్వేత ప్రపంచం సొగసైనది  .వైవిద్య భరితమైనది  .విశాలమైనది  .విశ్వమంతా ఆక్రమించింది  .విశ్వమంతా ఆక్రమించడం అంటే ఏమిటో తర్వాత  ,మొదలు సుగంధాలతో తనువును  ,మనసును చల్లబరిచే మల్లెల సంగతి చూద్దామా!

 ఇది మల్లెల వేళయని తెలుగు సినిమాల్లో మల్లెల మీద వచ్చిన అన్ని పాటలు ఇంకే పూల మీద రాలేదు  .మంచి మనసును  ,తెల్లని దుస్తులను మల్లెలతో పోలుస్తారు తెల్లగా ఉండి  , అందమైన సువాసనను ఇచ్చే చిట్టి పూలు  .అవి ఆకుల మాటున దాగినా  వాటి సువాసన ఇట్టే పట్టిచ్చేస్తుంది . విదేశాల్లో జాస్మిన్ అని పేరు ఉన్న స్త్రీలు కోకొల్లలు  . పూల కుండీలకు అందాన్ని  , వేడుకలకు శోభను ఇస్తాయి అంతేకాదు రైతులకు మంచి ఆదాయాన్ని కూడా ఇస్తాయి .

మన వైపు వేసవిలో ఎక్కువగా పూ స్తాయి  .సూర్యాస్తమయం తర్వాత సువాసనలు బాగా వ్యాపిస్తాయి . వెన్నెల రాత్రుల్లో మత్తెక్కిస్తాయి ఇలా రాత్రుళ్ళు వచ్చే వాసన వల్ల క్వీన్ ఆఫ్ ది నైట్ అంటారు . అపార్ట్మెంట్ కల్చర్ పెరగడానికి ముందు  ,పెరట్లో బెడ్ రూమ్ కిటికీలకు దగ్గరగా మల్లెతీగను పాకిం చేవారు  .అందమైన రూపానికి  ,సుగందానికి మించి వీటి గురించి చెప్పుకోవడానికి చాలానే ఉంది .

చాలా దేశాలకు అంటే హవాయి , ఇండోనేషియా  ,పాకిస్తాన్సులకు జాతీయ చిహ్నం ఇది. పడమటి చైనాలోని హిమాలయ పర్వత సానువు లు దీని పుట్టిల్లని చెప్తారు  .బహుశా అందుకే అనుకుంటా దీన్ని చైనాలో స్త్రీత్వానికి  ,అందానికి  , అనుబంధానికి  ,సంతోషానికి చిహ్నం గౌరవిస్తారు .

ఫిలిప్పీన్స్ లో ఎక్కువగా పెళ్లిళ్లు  ,మత సంబంధ వేడుకల్లో వాడుతారు  .థాయిలాండ్లో మాతృత్వానికి , ప్రేమకు  ,గౌరవానికి గుర్తు.   మల్లెపూలు అనగానే ఎంతోమందికి ఎన్నో గుర్తొస్తాయి     . జాస్మిన్సెంట్ ,జాస్మిన్ క్యాండిల్స్ , తలకు నూనెలు  ఇలా ఎన్నెన్నో . జాస్మిన్ టీ అంటే మల్లె వాసనలతో  ,రుచిగా ఉండే గ్రీన్ టీ . ఇది చైనాలో చాలా ఫేమస్   .ఆరోగ్యానికి మంచిది అంటారు . ఇందులో హెచ్చు స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి .ఈ  టీ ని  తరచుగా తాగితే క్యాన్సర్ నివారణగా పనిచేస్తుందట  .హార్ట్ రేట్ ,బీపీ  ,కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతాయి . ఆశ్చర్య అనిపిస్తుంది కానీ వీటిలో 40 రకాలు ఉన్నాయి అందమే కాదు  ,ఇంకా ఎంతో ఉంది అని చెప్పుకున్నాం కదా !

ఈ పూల వాసన ఒత్తిడిని తగ్గిస్తుంది . చిరాకును దూరం చేస్తుంది.  నీడలో ఆరబెట్టి    ,పొడిచేసి  ,మెంతి పొడితో కలిపి ముద్ద చేసి తలకు పెట్టుకుంటే , చుండ్రు మటుమాయం  .కొబ్బరి నూనెలో వేసి కాచిన నూనె జుట్టు ను నల్లగా  ,ఒత్తుగా నిగెనగలాడేలా చేస్తుందన్నది మనందరికీ తెలిసిన విషయమే  .మల్లె చెట్టు ఆకులు యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటాయి . అందువల్లే ఊళ్ళల్లో ఆకులు దంచి , గాయాలపై వేసి కట్టు కట్టేవారు త్వరగా మాన డానికి  . వృక్ష ఆయుర్వేదం అతి ప్రాచీన గ్రంథం . దీని రచయిత స్వరపాలుడు . పారిజాత వృక్షం వేరుకు రంధ్రం చేసి , అందులో మల్లే  తీగను దూ ర్చి , మట్టి కప్పితే  , ఏనుకుని చిగురులు వేస్తున్నప్పుడు . ఆ మట్టిని తవ్వి . మల్లెతీగను వేరు చేసి విడిగా నాటాలి  .అలా చేస్తే ఆ తీగకు ఎరుపు రంగులో చక్కని సువాసనతో మల్లెలు పూస్తాయని  వర్ణించాడు.

మన పూలు  ,మన ఊరు  ,మన పల్లెలు ఇవన్నీ కలిస్తేనే మన సంస్కృతి రూపుదిద్దుకుంటుంది  . అదే సంప్రదాయ సారం ఈ మల్లె మీకు ఎన్నో జ్ఞాపకాలను జ్ఞాపకం చేసిందని ఆశిస్తూ మరో పూల దుప్పటిని చూద్దామా.

పూల దుప్పటి అదే నేల మీద నక్షత్రాల్లాగా మెరిసే పారిజాతాలు  .ప్రకృతి వరం పారిజాతం. పిట్ట కొంచెం కూతఘ నం అన్నట్టు చూపుకు చిన్నదైనా  ,వాసనలో బహుదొడ్డది. పారిజాతం అనే మాట చెవిన పడగానే ఓ తరానికి పారిజాతాపహరణ కావ్యం గుర్తొస్తుంది  .కాస్త మధ్య వయసు వాళ్ళు  ఏ దివిలో విరిసిన పారిజాతమో అంటారు  .యువతరానికి  మనమే పరిచయం చేయాలి అందుకే ఈ ప్రయత్నం  .ఆధ్యాత్మిక పంధా లో  ఆలోచించేవారికి  ,పారిజాత తరుమూ ల వాసం చేసే మారుతి గుర్తొస్తాడు . అతి సున్నితము . తెల్లని ,మెత్తని రెక్కలతో ముట్టుకుంటే నల్లబడేటంత సున్నితత్వం  . గొప్ప సుగందాల మేళవింపు ఈ పారిజాతం  .దీని జీవితం కొద్ది గంటలే అయినా అందరికీ గుర్తుండిపోతాయి ఎన్ని పేర్లు ఉన్నాయ్ అనుకుంటారు దీనికి పారి భద్రము , కల్పవృక్షం  ,పగడం  ఇంకా ఎన్నో .

మంచి సువాసనతో  ,తెల్లగా పూలు కాడలు ఆరంజ్ కలర్లో  ఉంటాయి . అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు విరివిగా పూ స్తాయి . రాత్రులు  వికసించి , తెల్లారేసరికి  ,తెల్లటి తివాసి పరిచినట్లు   ,చెట్టు కింద నేల కనిపించనంత ఒత్తుగా పడి ఉంటాయి  .హిందూ సంప్రదాయాల్లో దీన్ని దేవత వృక్షంగా పూజిస్తారు  .ఇది సముద్ర గర్భం నుంచి పుట్టిందని , వీటితో దేవతార్చన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దల విశ్వాసం . సాధారణంగా తొమ్మిది రంగుల్లో ఉంటాయి  .ఎరుపు రంగులో ఉన్న దాన్ని ముద్ద పారిజాతం అంటారు పసుపు పచ్చ  ,నీలి  , గులాబీ , తెల్లని పాల రంగులో ఉంటాయి  .కానీ ఎక్కువగా కనిపించేవి తెల్లని పువ్వు ఆరంజ్ రంగు కాడలతో ఉంటాయి.

ఇంకో విశేషం కూడా ఉంది దీని పూలను కోయరాదని అంటారు  .ఈ వృక్షం తపస్సు చేసి , తన పూలను తాను  ఇస్తే తప్ప ఎవరూ తన వద్ద నుంచి లాక్కోకూడదని వరం పొందింది . క్రింద పడ్డ పూలతో కూడా పూజ చేసుకునే ప్రత్యేకత ఒక్క పారిజాతానికి ఉంది . మన ప్రధాని అయోధ్య రామ మందిరం భూమి పూజలో పాల్గొనే ముందు ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కనే నాటారు  .పారిజాతాపహరణ కావ్యం  కథ అందరికీ తెలుసు కదా !అలా శ్రీకృష్ణుడు సత్య కోసం తెచ్చిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ లోని భారా బంకి జిల్లాలో ఉన్న కింటూర్ అనే గ్రామంలో ఉంది  .ఇది ఓ విలక్షణమైన వృక్షం  .ఎందుకంటే  పూలు తెలుపు ప్లస్ బంగారు రంగుల కలగలిసి ఉంటాయి. చాలా దూరం వరకు సువాసనను వెదజల్లుతాయి  .దీనికి పళ్ళు కాయవు ఆకులు ఎండి రాలవు .కొమ్మలు  ,ఆకులు కుంచికొని కాండంలో కలిసిపోతాయి . అక్కడ ఉన్న చెట్టు 5000సంవత్సరాల క్రితముది  . 

దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయి . పూల నుండి తీసిన నూనె సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు  .ఆకుల రసాన్ని చెవిపోటుకు మందుగా వాడతారు  .ఆకులతో కషాయాన్ని చేసుకొని గోరువెచ్చగా తాగితే ఆర్థరైటిస్ తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు  చెప్తారు తాజా ఆకుల రసాన్ని చిన్న పిల్లలకు విరోచనకారిగా వాడుతారు  .గింజలను ఎండబెట్టి  ,పొడి చేసి  ,నీటితో ముద్దచేసి తలకు పెట్టుకుంటే తలలో ఉండే పొక్కులు తగ్గుతాయి   .పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుంది .

ఆకుల రసాన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సయాటికా నొప్పి తగ్గుతుంది  .ఇన్ని చెప్పుకున్నాం కదా  .ఇది ఎక్కడ పుట్టిందట ?ఇది దక్షిణాసియాకు చెందింది  .ఎక్కువగా ఉత్తర భారతదేశం  ,నేపాల్ , పాకిస్తాన్  ,థాయిలాండ్లలో కనిపిస్తుంది . ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి జానకి గారు పారిజాతాన్ని ఎంతో బాగా వర్ణించారు .

 ఉదయాన తెరిచిన కిటికి తిలకించమందే అద్భుత దృశ్యం

 రాత్రంతా నేల తల్లితో చెట్టు చెబుతున్న మురిపాల ముచ్చట్లు

 రాలిన పారిజాత పుష్పాలు ఆరారగా అర్పించుకుంటున్న

 ధన్యవాదాలు ఆనంద భాష్పాలు

ఇవం డీ పారిజాతాల ముచ్చట్లు.

ఇక పెరట్లో నుంచి ఇంటి ముంగిట్లోకొచ్చేద్దాం  .తెలుపు ప్రశాంతతను   ,చల్లదనాన్ని ఇస్తుంది . అలా మనకు తరతరాలుగా అందిస్తున్న చందమామను గురించి చెప్పుకోకుంటే   చిన్న బు చ్చుకోడుమరి .

మన ప్రబంధ నాయకలకు మిత్రుడు . పరమ శత్రువు కూడా చంద్రుడే  .చూడ్డానికి వెన్న ముద్దలా కనిపించినా లోన అంతా రాళ్లు  , రప్పలు, గోతులు అయినా మనకి ఇష్టం. రాత్రిపూట ఆకాశంలో మంత్రముగ్ధ సహచరుడు చంద్రుడు  .శతాబ్దాలుగా దేశ కాలాలకు అతీతంగా ప్రజల మనసు చూరగొ న్న అందాల మామ . మనం పృధివిని వదిలి అంతరిక్షంలో నడవగల ప్రదేశం కేవలం చంద్రుడి మీదే  .బలహీనమైన గురుత్వాకర్షణ శక్తి ఉన్నందున ఇక్కడ నడిచినప్పుడు ప్రతి అడుగు జారుతున్నట్టు  ,ఎగురుతున్నట్టు అనిపిస్తుంది . ఇంకో వింత చంద్రునికి వాతావరణం లేదు అంటే గా లీ  ,శబ్దం లేవు కాబట్టి  ,ఎవరైనా మీ పక్కనే అరుస్తున్నా మీరు వినలేరు . భూమ్మీద మ ల్లే చంద్రుని మీద కూడా భూకంపాలు సంభవిస్తాయి  .వాటిని క్వేట్స్ అంటారు .అయితే  ,ఇవి అంత శక్తివంతమైనవి కావు .

చల్లని కాంతితో జగతినే అహ్లాదపరిచేవాడు చంద్రుడు అలాంటి చంద్రునికి కృతజ్ఞతలు చెప్పాలంటే ఎలా దానికి ఓ పద్ధతి ఉంది  .అమావాస్య నాటి తెల్లవారి సన్నని రేఖలా కనిపిస్తాడు చంద్రుడు  .అప్పుడు మనం కట్టిన వస్త్రంలో నుంచి ఓ దార పోగును తీసి ఆయనకు ఇచ్చి  ,నమస్కరించడం మన సంప్రదాయం  .గొప్ప వారి స్థాయికి సరిపడేలా కానుకలు ఇవ్వలేని సందర్భంలో మనకున్న స్వల్పమైనదాన్ని ఇచ్చి  ,కృతజ్ఞతలు చెప్పుకుంటాం  .దాన్ని చంద్రునికో నూలు పోగు సమర్పించడం అంటారు .

మనదేశంలో శ్రావణ పౌర్ణమి  , మాఘ పౌర్ణమి  ,కార్తీక పౌర్ణమి అని నక్షత్ర గమనం ఆధారంగా పున్నములకు పేర్లను ఉపయోగిస్తాం . అలాగే ఇతర పురాతన సంస్కృతుల నుండి వచ్చిన నెలవారీ పున్నముల పేర్లు విశేషాలు క్లుప్తంగా చెప్పుకుందాం. ఇవన్నీ ప్రకృతి మార్పులు , జంతువుల ప్రవర్తనలు లేదా వ్యవసాయ కార్యకలాపాలే ఆధారం . వీటిని పురాతన కాలంలో కాలాలను గుర్తించడానికి వాడేవారు .

జనవరి Hungry Moon

ఈ నెలలో తోడేళ్లు ఆకలితో ఆహారం కోసం ఎక్కువగా అరుస్తాయి  .ఆ నమ్మకం ఆధారంగానే ఈ పేరు వచ్చింది .

 ఫిబ్రవరి     snow Moon

 సమృద్ధిగా మంచు ఉండడం వల్ల  ,శీతకాల మధ్యలో ఆహార వనరులు తక్కువగా ఉండటం , వల్ల కొన్ని ఉత్తరా అమెరికా ప్రాంతాలలో హంగ్రీ మూన్ అని కూడా  పిలుస్తారు    .

మార్చ్Crow Moon

 మార్చిలో  శీతాకాలపు చివరి పౌర్ణమి వస్తుంది . వాటికోసం కాకులు వస్తాయి . అందుకని క్రోమోన్ అని అంటారు

April   Pink Moon

 వసంతకాలం ప్రారంభంలో ఉత్తరా అమెరికాలో గులాబీ రంగు ఫ్లాక్స్ అనే అడవి పూలు వికసించే కాలం  .ఏప్రిల్ పౌర్ణమిని ఈస్టర్ తేదీని  లెక్కించడానికి వాడేవారు పూర్వం

May         May Flower Moon

 ఇది వసంత కాలంలో వికసించే అన్ని పూల ఆగమనాన్ని సూచిస్తుంది .

June       Strawberry Moon

ఈ సమయంలో ఎర్రటి చిన్న చెర్రీలు విరగ కాస్తాయి . స్థానిక అమెరికన్ తెగలు వాటిని సేకరిస్తారు . గ్రీన్ కార్ మూన్ అని హార్ట్ మూన్ అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు .

  July        BUCK Moon

ఈ సమయంలో జింక బక్ నుదుటిపై కొమ్ములు పుట్టుకొస్తాయి  .పట్టుకుచ్చు లాంటి బొ చ్చు మధ్యలో ఇవి వస్తాయి  అంటారు .

August  టార్జన్ మూన్ 

గ్రేట్ లేక్స్ లేక్ చాంప్లేన్ లలో పెద్ద సంఖ్యలో పెద్ద సైజు చేపలు సులువుగా దొరుకుతాయి  .ఈ ప్రాంతంలోని స్థానిక అమెరికన్ తెగలకు ఇవి ముఖ్య ఆహారం అందుకే ఈ పేరు .

Octoberవేటగాడి చంద్రుడు   Hunter’s Moon

ఉత్తరార్ధగోళంలో ప్రజలు రాబోయే శీతాకాలం కోసం సిద్ధం కావడానికి వేటాడడం  ,జంతువులను వధించడం  ,మాంసాన్ని నిల్వ చేయడంలో గడుపుతారు      . దీని వల్ల హంటర్స్ మూన్ అనే పేరు వచ్చింది .

November       Beaver Moon

శీ తాకాలం కోసం సిద్ధమవుతున్న బీవర్ల పేరు పెట్టారు . స్థానిక అమెరికన్లు ఫ్రాస్ట్ మూన్ అని కూడా పిలుస్తారు .

December   చల్లని చంద్రుడు    Cold Moon

ఉత్తరార్థ గోళంలో చాలామందికి శీతాకాలం మొదలవుతుంది ఇది ఉత్తరార్ధగోళంలో అతి పొడవైన రాత్రిని సూచిస్తుంది

చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం దాదాపు 29.5 రోజులు దీన్ని చాంద్రమాసం అంటారు ఈ రకంగా మనకు సంవత్సరంలో 12 పౌర్ణమిలే  వస్తాయి . ఉష్ణ మండలాల్లో  రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి అదనపు పౌర్ణమి వస్తుంది  .ఈ చంద్రుడిని బ్లూ మూన్ అంటారు. వేరే పేరు లేదు .

ఇదేనండి కౌముదికి కహాని

గమనించారా ప్రకృతితో ముడిపడ్డ జీవనం మనది  .దాని నిర్లక్ష్యం చేసి  ,నాగరికత పేరుతో దూరంగా జరిగిపోయాం  .ఎంత దూరంగా అంటే ఊహించలేనంత ,అందుకోలేనంత     . ఆ ప్రకృతి కన్నెర్ర చేస్తే వరదలు , భూకంపాలు , అతి వేడి అతి శీతల వాతావరణం . ఇవే మనకు దక్కుతున్నాయి  .ఇప్పటికైనా పర్యావరణహితమైన ప్రవర్తన అందరి బాధ్యత అనుకుంటే   ,అందుకునేది ప్రణవం ఆ ప్రకృతి పగబడితే వచ్చేది ప్రళయం . ఈ ప్రకృతి మనకే కాదు అన్ని జీవరాశులకు సొంతం అనుకుంటే జగత్ కళ్యాణం .

చివరగా ఈ శ్వేత ప్రపంచంతొ లుత చెప్పుకున్నట్లు అతి విస్తృతం . వైవిద్య భరితం  .ఆ విశాల జగత్తు నుండి ఏరిన కొన్ని ఇసుక రేణువుల చిరు పరిచయం . ఇందులోని కొన్ని విషయాలు కొందరికైనా పరిచయం చేయాలనే  సంకల్పం ఈ వ్యాసానికి పునాది . ఇది విశాలం  , సవివరం కాదని నాతో పాటు మీకూ  తెలుసు  .ఓ చిన్న ప్రయత్నం .

ఆదరిస్తారని నమ్మకంతో

విజయ కందాళ

9912842104

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తల్లిమనసు–బుజ్జికథ

కోడలమ్మ కథలు (కాలమ్)