ఇది
నీకిచ్చిన మనసు
నువ్వు మెచ్చిన మనసు
అప్పుడు
నీలో లీనమై
నీకే అంకితమైన మనసు
ఇప్పుడు
నాకే భారమై
నాకే కరువైన మనసు !!
అది
నాకిచ్చిన మనసు
నను వలచిన మనసు
అప్పుడు
నేనే ప్రాణమై
నాకై బ్రతికిన మనసు
ఇప్పుడు
నేనే పాపమై
నను మరిచిన మనసు !!
నాడు
ఇరువురి మనసులు
విడదీయలేని
నదీ సముద్రులు !
నేడు
కడలికి అద్ధరి ఇద్దరి
అంటూ మిగిలిన
రణ ఘోషలు !!
(అద్దరి ఇద్దరి అంటే సముద్రానికి
అటు ఒడ్డు – ఇటు ఒడ్డు )