జునూ
Itinerary లో ఇచ్చిన ప్రకారము క్రూజ్ ‘జునూ‘ కు ఉదయం 6:30 కు చేరింది. మళ్లీ మా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది . జునూ లో చూడవలసిన ప్రదేశాలలో మెండల్ హాల్ నేషనల్ గ్లేషియర్, నెగ్గెట్ వాటర్ ఫాల్స్ చాలా ముఖ్యమైనవి. అసలు మొత్తం జునూ ఒక అద్భుతమైన ప్రదేశం. మాకున్న సమయాభావం వల్ల ఈ రెండే సెలెక్ట్ చేసుకున్నాము . మళ్లీ రిటర్న్ 6:30 కు సాయంత్రం వరకు క్రూజ్ కు రావాలి. అందుకే త్వరగా తయారై బయటికి వెళ్ళాం.
అలాస్కా కాపిటల్ జునూ. ఇది సముద్రానికి పర్వతాలకు మధ్యలో డెవలప్ అయిన సిటీ. ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొండలపైన ఇళ్లు ,కొండలను, సిటీకి కనెక్ట్ చేస్తూ వేసిన రోడ్స్ చాలా బాగుంటాయి. ప్రకృతిలో మమేకమై ఉండడానికి ఇష్టపడే వాళ్ళ కారు డ్రైవింగ్ స్కిల్స్ ను నిజంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు చాలా ఎత్తులో ఉంటుంది. 1880 సంవత్సరంలో రిచర్డ్ హారిస్ ఇక్కడ బంగారు గనులు ఉన్నాయని కనుక్కున్నాడు . ఇక అప్పటి నుండి tents, వర్కర్స్, యజమానులు, హోటల్స్, సెలూన్స్ తో ఈ ప్రదేశం కళకళలాడడం స్టార్ట్ అయిపోయింది. బంగారం కోసం వచ్చిన వాళ్ళ బంగారు కలలను నిజం చేసుకోవడానికి జునూ ఒక వేదిక అయింది . ఆ ప్రదేశం అంతా బంగారు కళను సంతరించుకున్నది. షోర్ లైన్ అంతా boats తో నిండిపోయింది . క్యాపిటల్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు.
ఇక్కడ సాల్మన్ ఫిష్ కు చాలా ప్రాధాన్యతను ఉండడాన్ని గమనించి వ్యాపారస్తులు సాల్మన్ ఎండబెట్టి స్టోర్ చేసే ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఐస్ లో కూడా స్టోర్ చేస్తారు . ఇక్కడికి విజిటర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి ప్రయాణ సౌకర్యాల కోసం ఊబర్స్ , పెద్ద బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రభుత్వ పరంగా నడుస్తాయి.

క్రూజ్ నుండి దిగిన తర్వాత 1 1/2 కిలోమీటర్స్ దూరంలో tour బుక్ చేసుకోవడానికి సౌకర్యం ఉంది . గండోలా టూర్, వేల్ వాచింగ్, మెండన్ హాల్ గ్లేసియర్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ గండోల రైడ్ , వేల్ వాచింగ్ చాలా ధర ఎక్కువ . ఈ Whale Watching ను Ketchikan లో చూసేసాము. గండోల రైడ్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. అందుకే అది తీసుకోలేదు. మెండన్ హాల్ గ్లేసియర్ చూడ్డానికి బుక్ చేసుకుందామని ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ “బస్ టు ది గ్లేషియర్ ” ట్రావెలర్ దగ్గర బుక్ చేసుకోవడానికి వెళ్ళాము. ఆమె చాలా సాదరంగా రిసీవ్ చేసుకుంది. నన్ను చూసి నమస్తే అన్నది. అయితే ఈమెకు ఇండియా గురించి అవగాహన ఉన్నదని మాకు అర్థం అయిపోయింది. “ఇండియాలో ఏ ప్లేస్ లో ఉన్నారని” మేము మాటలు కలిపాం.ఆమె “మైసూర్లో యోగా నేర్చుకునేదని” చెప్పింది.
యోగా నేర్చుకున్నదా!! అని మేం ఆశ్చర్యపోయాం, ఆనందించాం.

అయితే మేం మెల్లిగా ఆమెతోనే మాటలు కలిపి, కొంచెం టిక్కెట్ రేట్ తగ్గిస్తుందేమోనని బేరం చేశాం .కానీ ఆమె “పేకాట పేకాటె బామ్మర్ది బామ్మర్ది” అన్న చందాన వ్యవహరించింది. ధర తగ్గించలేదు. మా ముందే రెండు బస్సులు వెళ్లిపోయాయి .

ఇక లాభం లేదని టికెట్స్ కొనుక్కొని బస్సులో కూర్చున్నాం . ఈ బస్ టికెట్ కౌంటర్ ప్లేస్ నుంచి మండల్ హాల్ గ్లేషియర్ కు 32 to 40 మినిట్స్ పట్టింది. జనరల్ గా ఇక్కడ డ్రైవర్లే గైడ్ (Guide) గా కూడా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రక్కన ఒక చిన్న నది ఉన్నది. ప్రయాణం దాదాపు 15 నిమిషాలు ఈ నది పక్కన ప్రయాణమే ఉన్నది . ఒకవైపు కొండలు, కొన్ని వందల సంవత్సరాలు గా ఉన్న గ్లేషియర్స్ ! ఇవన్నీ చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండింది .
ఈ Glacier దాదాపు ఒక కిలోమీటర్ పొడవు విస్తరించి ఉన్నది. ప్రస్తుతం ఇలా ఒక్క కిలోమీటర్ ఉన్న గ్లేషియర్ ఒకప్పుడు ఇంకా వెడల్పుగా, ఇంకా ఎక్కువ పొడవు గా ఉండేదంట! గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్స్ కరిగి, వన్ మీటర్ కు కుదించబడింది. ఇప్పటికీ ఈ గ్లేషియర్ నార్త్ అమెరికాలో చాలా పెద్దది. ఇలాంటి విశేషాలు ఎన్నో మా హృదయ ఫలకాలపైన ముద్రించుకుని ఆనందించాం.
Whale అనే తిమింగలం సముద్రంలో లేస్తే ఎలా వాటర్ దాని చుట్టుపక్కల పడుతుందో అలాగే రూపొందించారు .చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది అక్కడి నుంచి మళ్లీ ఇంకా టైం ఉందని గ్లేషియర్ బస్ టూరిస్ట్ ట్రావెల్స్ దగ్గర నాకు పరిచయమైన ఆమె దగ్గరికి వెళ్ళాము.” మాకు టైం ఉంది . నెక్స్ట్ఇంకా ఎక్కడెక్కడడికి వెళ్లొచ్చు”. అని సలహా అడిగాం.ఆమె ఉబర్ తీసుకొని వెళితే 15 మినిట్స్ పడుతుందని ఒక ప్లేస్ చెప్పింది.అది గ్లేషియర్ గార్డెన్స్ .ఇది ఒక బొటానికల్ గార్డెన్ .కరెక్ట్ గా 15 నిమిషాల్లో బొటానికల్ గార్డెన్ కు వెళ్లాం. అక్కడ ఒక పెద్ద వ్యాన్ లాంటిది ఉంది. రెండు పక్కలా ఓపెన్ ఉంది. దానిలో కూర్చొని టూర్ చేశాము.ఈ బొటానికల్ గార్డెన్స్ చాలా చాలా బాగుంది .అందంగా ఉన్నది . నిజంగా ఎంత అందంగా ఉందో వర్ణించలేను .ఇదంతా ఆర్టిఫిషియల్ గార్డెన్స్ .కానీ కలర్ కాంబినేషన్స్, ఫ్రేమింగ్ అండ్ ఫిక్సింగ్ ఫ్లవర్స్ అత్యద్భుతం. ఒక దగ్గర హ్యాంగింగ్ గార్డెన్ కూడా ఉంది. పూర్తిగా Rain Forest theme . ఫారెస్ట్ లోకి పైకి వెళ్లి చూపించారు. రకరకాల పువ్వులే కాకుండా రకరకాల ఆకులు కూడా చాలా అందంగా ఉన్నాయి. పైకి వెళ్తుంటే ఫన్ అండ్ అడ్వెంచర్ లాగా అనిపించింది. ఇంకా పైకి వెళ్లాక టూర్ బస్ ఒక ప్లేస్ లో ఆపేశారు. అక్కడి నుంచి కొన్ని అడుగులు పైకి నడుచుకుంటూ వెళ్లి కిందికి చూస్తే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కనిపించింది. బొటానికల్ గార్డెన్స్ నుండి మళ్లీ cruise వద్దకు వచ్చాము.cruise బయలుదేరడానికి ఇంకా గంట టైం ఉంది. అలా వాటర్ ఫ్రంట్ దగ్గర ఉన్న ఉడెన్ బ్రిడ్జి పైన నడుస్తూ కిందికి దిగేసరికి sea shore కనిపించింది. కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాము. కానీ 10 నిమిషాల కన్నా ఎక్కువగా ఉండలేకపోయాం. నాచు వాసన ఉందక్కడ .క్రుచ్షిప్ యజమానులు వాళ్ళ స్పోర్ట్స్ దగ్గర ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. కొన్ని ప్రైవేటు బీచ్ వాళ్లు నాచు తీసేసి వాసన లేకుండా చేస్తారు. కానీ ఇది ఓపెన్ beach. వాసన ఉంది వెంటనే అక్కడి నుంచి తిరిగి cruise వద్దకు వచ్చేసాము.నాచును ప్రాసెస్ చేసి రకరకాల వంటల్లో వేస్తారట. హెల్త్ కు చాలా మంచిదట. టైప్ టు డయాబెటిస్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జపాన్ వంటల్లో ఇది ఎక్కువగా వాడుతారు. జపాన్ వంటల్లో ముఖ్యమైన వంటకం పేరు “సుశి.” ఈ వంటకంలో ఈ “sea wead ” ను ప్రాసెస్ చేసి, లోపల రైస్ ఉంచి సివీడ్ లో ర్యాప్ చేస్తారు. అలా ఆ రోజంతా తిరిగి తిరిగి అలసిపోయి క్రూజ్ లోకి వెళ్ళగానే సిబ్బంది చిరునవ్వుతో టీ కాఫీ ఫ్లేవర్ మిల్క్ లతో ఆహ్వానించారు . రూమ్ కి చెక్ చేసి చేశారు రూమ్‌లో రెస్ట్ తీసుకొని రేపు ఉదయం గ్లేషియర్ బె అండ్ సి మొత్తం ప్రయాణం ఎల్లుండి ఉదయం వరకు ఈరోజు సిక్స్త్ డే ఈరోజు అంతా పసిఫిక్ మహాసాగరంలో మధ్యలో ప్రయాణం ఆరవ రోజుల్లో ప్రయాణం అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు ఉదయం లేచి మామూలుగా అబ్జర్వేషన్ టిక్ పైకి వెళ్లాం అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ మొత్తం మార్చేశారు రెడ్ కార్పెట్ వేసి డెకరేట్ చేశారు ఎందుకంటే క్రూజ్ లో నుండే గ్లేషియర్స్ ను చూడబోతున్నాం. మాకు ఐడియా లేక బైనాకులర్స్ తెచ్చుకోలేదు కానీ ఉంటే ఇంకా బాగుండేది అయితే ఇక్కడి నుండి చూసే వాళ్లకు ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు క్రూజ్ ముందు భాగంలో ఉన్న దాన్ని బో అంటారు మనకు బిల్లు బో ఆకారంలో దాన్ని భూ ఆకారంలో ఉంటుంది భువైపు వెళ్లడానికి అనువుగా ఆరో మార్క్స్ పెట్టారు దాదాపు ప్రతి 100 అడుగులకు ఒక ఎన్సీఎల్ ఉద్యోగి మనకు గైడ్ చేస్తాడు భూపైకి ఎలా వెళ్లాలో అప్పటికే అందరు చేరుకున్నారు అక్కడికి టీ కాఫీ టీకాఫీలే కాకుండా త్రో కూడా అందించారు త్రో అంటే ఒక చిన్న షాలు అలాంటిది ఉంటుంది అది అందించారు ఎంత జూలై మాసమైనా వెళ్ళేది షేర్‌ను చూడడానికి కదా చాలా చల్లగా ఉంటుందని ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారు అక్కడ పిక్చర్స్ దిగేవాళ్లకు వసతి కూడా ఉంది ప్రైవేట్ కెమెరామెన్లు ఉన్నారు కానీ ఇది చాలా ఖరీదు ఇక్కడ పిక్ ఉంది ఆ ప్రాంతం పేరు గ్లేషియర్ దే నేషనల్ పార్క్ చుట్టూ ఎటువైపు చూసినా కనుల పండుగ కనుల నిండుగా గ్లేషియర్స్ వివరాల్లోకి వెళితే ఈ గ్లేషియర్ బే నేషనల్ పార్క్ సౌత్ ఈస్ట్ అలాస్కాలో దాదాపు 3.3 మిలియన్ ఎకర్స్ లో విస్తరించి ఉంది చిన్నవి పెద్దవి అన్ని గ్లేషియర్స్ కలిపి దాదాపు 1000 వరకు ఉన్నాయి రెండు మ్యాప్స్లలో ఈ వివరాలన్నీ ఉంచారు అన్ని వివరంగా పెట్టారు దీనిలో అన్ని వివరంగా ఉంచారు మైక్ లో వివరాలు అన్ని చెబుతున్నాడు గ్లేషియర్‌కు ఇంకా దగ్గరలో చూడాలని కొంచెం చిన్నచిన్న పడవలు పడవల మీద కూడా వెళ్లారు వాటికి టికెట్ కొనాలి మేము 2016 లో వెళ్ళినప్పుడు వాటిలో వెళ్ళాం అందుకే ఈసారి వెళ్లలేదు ఇక్కడికే సరిపెట్టుకున్నాం. కొంచెం సేపటి తర్వాత ఇక్కడ కూడా ఇంద్రధనస్సు చూసే అదృష్టం కలిగింది ఆ మంచు కొండల్లో గ్లేషియర్ మధ్యలో ఉన్న ఇంద్రధనస్సు అందానికి అలోహిక ఆనందాన్ని పొంది పొందాం కొంచెం ఈ గ్లేషియర్స్ కి పేర్లు కూడా ఉన్నాయి అందులో ఒకటి హబర్బ్ గ్లేషియర్ ఇది చాలా ఇది దాదాపు 30 అంతస్తుల బిల్డింగ్ అంతా ఎత్తు ఉంది ఇది సెయింట్ ఎలియస్ మౌంటెన్ దగ్గర ఉంది ఇంకో గ్లేషియర్ పేరు మాలస్పినా గ్లేషియర్ ఈ పర్వతాలు మరియు గ్లేషియర్స్ కూడా కెనడా బోర్డర్‌ను అనుకొని ఉన్నాయి అప్పుడు చిన్న చిన్న ఐస్ బర్గ్స్ హంసలు ఏరోప్లేన్ షేపుల్ల అలా సముద్రంలో తెలియాడుతున్నాయి మా మనవల కోసం వాటిని పిక్చర్స్ తీసుకున్నాము ఇంకొక గ్లేషియర్ పేరు ధర్నార్ గ్లేషియర్స్ జూలై ఆగస్టులలో ఎండలకు బ్లేస్ షేర్లు కరిగి నీరు సముద్రంలోకి వెళుతుంది పర్వతాల నుండి పర్వతాల పై నుండి మంచు కరిగి చిన్న చిన్న కాలువల్ల నీరు వస్తుంది వీటిని ఫియోర్స్ అంటారు ఈ అందానికి మేము సాక్ష్యం అయ్యాంధానికి మేము సాక్ష్యం అయ్యాం. ఇది చాలా అందంగా ఉంది ! నిజం!! చాలా చాలా అందంగా ఉంది కదలడం ప్రారంభించింది మా నెక్స్ట్ స్టాప్ చిట్కా కొంచెం దూరం ప్రయాణించేసరికి వాతావరణం చల్లగా మారింది చిట్కా ఇంకా నార్త్ వైపు ఉంటుంది చాలా చల్లగా అయిపోయింది స్నోఫ్లేక్స్ పడడం ప్రారంభమైంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మనసు వర్షం ఆ తరువాత ఆదృశ్యం మనోహరంగా ఉంది నాకు సడన్‌గా ఒక పాట గుర్తు వచ్చింది డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు రాసిన కొండపైన వెండివాన అబ్జర్వేషన్ డెక్ లో బయట సముద్రాన్ని చూస్తుంటే సడన్‌గా ఒక వేల్ జంపు చేసి వెళ్ళిపోయింది చాలా అద్భుతంగా ఉండింది ఆ దృశ్యం ఎక్కడో అడవిగాచిన వెన్నెల అన్నట్టుగా సముద్రంలో ఎక్కడో దూరంగా ఉంటే మనకేంటి లాభం మన ముందర వచ్చి అవి డాన్స్ చేసినట్టుగా ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అలాగే జరిగింది ఒక్కసారి జంప్ చేసింది చాలా బాగుంటుంది అదృశ్యం ఆ రోజంతా ఆద్యంతం అత్యంత మనోహరంగా సాగింది. డిన్నర్ చాలా రుచికరంగా ఉంది. ఆఫ్ కోర్స్ ఎప్పుడూ రుచిగానే చేస్తారు చాలా వెరైటీస్ తోటి ఉన్నాయి. డిన్నర్ తర్వాత రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ రేపటి రేపు చిట్కాలో చూడవలసిన ప్రదేశాలు మేము ఆల్రెడీ యూట్యూబ్ లో చూసి ఒక నోట్ పాడ్ లో నోట్ చేసుకుందాం. ఒకసారి నోట్ ప్యాడ్ లో చెక్ చేసుకున్నాం. విసిటింగ్ నేషనల్ పార్క్ అలాస్క ర్యాప్తుర్ సెంటర్ అండ్ ఫోర్ ప్లస్ ఇంకా ఇంకా మ్యూజియం రష్యన్ ఆర్తోడక్స్ చర్చ్ దర్శన్ బిషప్ హౌస్ ఇలా ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి టైమ్ ఉంటే ఉంటే చూడాలని అనుకున్నాం. ఏ ప్లేస్ లో ఏమి చూస్తామో రేపు చెప్తాను గుడ్ నైట్!!( ఇంకా వుంది)