The Cruise – ఓ దృశ్య ప్రయాణం -Part – 6

7 వ రోజు మా క్రూజ్ ప్రయాణం
డే సిక్స్త్ ప్రయాణమే ఉండింది. మార్నింగ్ 6:30 నుంచి 7 వరకు రీచింగ్ టైం. తర్వాత రిటర్న్ టైం 1.30 మధ్యాహ్నం. ఉదయం ఏడు గంటలకు రెడీ అయి అబ్జర్వేషన్ ఎక్కువైనా కూర్చున్నాం.
డే సిక్స్త్ ప్రయాణమే ఉండింది. మార్నింగ్ 6:30 నుంచి 7 వరకు రీచింగ్ టైం. తర్వాత రిటర్న్ టైం 1.30 మధ్యాహ్నం. ఉదయం ఏడు గంటలకు రెడీ అయి అబ్జర్వేషన్  డెక్ పైన కూర్చున్నాం.

ఏమైనా ” పదనిసలు కనిపిస్తాయేమో మా ప్రయాణంలో” అని ఆశ. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంత”ఇంత జార్ కా ఫల్ మిఠా హోతా హై” అన్నట్టు ఒక ఔటర్ (ooter) గుంపు కనిపించింది .అవి ఎంత బాగున్నాయంటే కొన్ని చిన్న చిన్న ఐస్ Berg ల మీద తేలియాడుతూ కనిపించాయి. ఒక పది నెలల పాపాయి ని కింద పడుకోబెడితే తన చేతులతో తానె పాదాలను పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ pictureఎంత బాగుందో మీరే చూడండి.


ఇది చాలా షై గా ఉంటాయి. మేము పిక్చర్స్ తీద్దామని క్రూజ్ బయట నిలబడి వీడియో ఆన్ చేయగానే అవి తుర్రుమని సముద్రంలోకి వెళ్లిపోవడం. చిన్నపిల్లలు ఏదైనా ముద్దు ముద్దు మాటలతోటి చెపుతుంటే పెద్దవాళ్లు రికార్డ్ చేయడానికి రెడీగా పెట్టుకున్న తర్వాత వాళ్లు మొబైల్ ను చూసి టక్కున ఆపేస్తారు కదా. అలాగే అనిపించింది. ఇంతలో ఒక పోలీస్ పెట్రోలింగ్ బోట్ అక్కడికి వస్తే అవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. అక్కడికొక ఫిషింగ్ బోటు కూడా వచ్చింది. బోటు కూడా చాలా క్యూట్ గా చాలా మోడ్రన్ గా ఉన్నది. సముద్రంపై వెళుతుండగా టూర్ ముగించుకొని సియాటిల్ రిటర్న్ అయ్యే “Carnival cruise “కూడా చూశాము.మాకు ఆ cruise కు మధ్య దాదాపు నాలుగు, ఐదు నాటికల్ miles ఉంటుందని అక్కడి సిబ్బంది చెప్పారు. ఈ క్రొత్త వింత అనుభవాలను అన్ని మననం చేసుకుంటూ లంచ్ కోసం వెళ్ళాం.

మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్రూజ్ Icy strait point చేరుకుంది. ఈ ప్లేస్ చాలా చిన్నది. అందుకే ఇక్కడ మధ్యాహ్నం నుండి సాయంత్రం ఏడు గంటల వరకు క్రూజ్ ఉంటుంది. Cruise నుండి బయటకు రాగానే అక్కడక్కడనే అన్ని ఉంటాయి .ఒక గిఫ్ట్ షాప్, ఒక రెస్టారెంట్, ఒక గండోలా రైడ్ ఉన్నాయి. ఈ గండోలా రైడ్ ఫ్రీ .10 మినిట్స్ ఉంటుంది. అయితే ఇంకో వైపు వేరే గండోల రైడ్ ఉంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. మేము వెళ్ళలేదు.

కొంచెం సేపు వెయిటింగ్ తర్వాత గండోలా రైడ్ బయలుదేరింది. దారంతా చాలా బాగున్నది .చెట్లు, చెట్ల పైన అందమైన birds ఇంకా పైనుంచి జిప్ లైనర్ కూడా ఉంది. గండోల రైడ్ నుండి కొంచెం కిందికి వెళ్తే పసిఫిక్ మహాసముద్రం కనిపించింది మళ్ళీ. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది. అక్కడ ఒక ఆర్కాస్ బొమ్మ ఉంది.

ఆ పార్కులోనే ఇంకొంచెం ముందుకు వెళితే సిమెంట్ తయారు చేసిన” వేల్” బొమ్మలు ఉన్నాయి. వాటిని చూడటానికి వెళ్లేటప్పుడు చిన్న చిన్న చేపలు ఒడ్డున ఎగురుతూ కనిపించాయి. గుంపులు గుంపులుగా ఉన్నాయి .ఆ దృశ్యం చూస్తుంటే ఏవో కొన్ని చేపలు పైకి ఎగిరి “ఓహో బస్తీ దొరసాని – ఆహా ముస్తాబయింది” అని వేరే చేపలకు చెబితే అవి మేము కూడా చూస్తాం అన్నట్టుగా ఎగురుతూ కనిపించాయి. నా ఫీలింగ్ నాకే నవ్వొచ్చింది. అలా సరదా సరదా ఫీలింగ్స్ తోటి ఐసి స్ట్రెయిట్ పాయింట్ చూడడం జరిగింది .అక్కడ ఎక్కువగా పెద్దగా ఏమీ లేవు. మళ్లీ రోజుకు వచ్చాం నైట్ డిన్నర్ తినేసి పడుకున్నాం. రాత్రంతా ప్రయాణించి తెల్లవారేసరికి విక్టోరియా ఐలాండ్ చేరుకున్నాం. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు క్రూజ్ వాళ్ళు టైం ఇచ్చారు.

ఇది చాలా పెద్ద ఐలాండ్. బ్రిటిష్ రాణి విక్టోరియా పేరు పెట్టారు. ఇది చాలా పురాతనమైన సిటీ .పసిఫిక్ నార్త్ వెస్ట్ లోనే చాలా పురాతనమైన సిటీ ఇది. కానీ చాలా లైవ్లీగా ఉంటుంది .అందుకే త్వర త్వరగా బయటకు వచ్చి ముందు మేము బుక్ చేసుకున్న” బటర్ఫ్లై గార్డెన్స్” టూర్ బస్ ఎక్కి బటర్ఫ్లై గార్డెన్స్ కి చేరాం. మాకు ఒక రోజు నుండి బటర్ఫ్లై గార్డెన్స్ చేరడానికి దాదాపు 30 నిమిషాలు పట్టింది. ఇది చెప్పడానికి కొంచెం చిన్న గార్డెన్స్ అయినా పొందికగా చాలా చూడముచ్చటగా ఉంది. కౄజ్ నుండి బటర్ఫ్లై గార్డెన్స్ కు వెళ్లే దారిలో “పార్లమెంట్ భవనం”వస్తుంది. బటర్ఫ్లై గార్డెన్స్, బుచరీ గార్డెన్స్ చూసిన తర్వాత రిటర్న్ లో పార్లమెంట్ భవనం చూడడానికి బస్సు అరేంజ్ చేశారు. ఈ భవనానికి, పార్లమెంట్ అనే పదానికి, మా జీవితాలకి చాలా దగ్గర సంబంధం , చాలా ఎమోషనల్ సంబంధం కూడా ఉంది.ఎందుకంటే మా నాన్నగారు శ్రీ పెండ్యాల రాఘవరావు గారు ఇండియాలో 1952లో జరిగిన మొదటి పార్లమెంటు ఎలక్షన్స్ లో గెలిచి ఎంపీగా పార్లమెంటుకు వెళ్లారు .మా అమ్మ శ్రీమతి పెండ్యాల కౌసల్యాదేవి తను ఢిల్లీ వెళ్ళినప్పుడు వివరాలు అవన్నీ మాకు చెప్పడం ఇంకా గుర్తుంది .మా ఇంట్లో పార్లమెంట్ ఫోటో కూడా ఉంది .అందుకని పార్లమెంట్ అనగానే మాకు ఏదో ఎమోషనల్ బాండింగ్ లాగా అనిపిస్తుంది.

ఈ టూర్ లో రిటర్న్ వచ్చినప్పుడు పార్లమెంట్ భవనంలో మేము చూసినవన్నీ వివరిస్తాను.

బస్సు టూర్ బటర్ఫ్లై గార్డెన్స్ కు వెళ్లే దారిలో పెద్ద పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఇంకా స్కూల్స్ ఉన్నాయి. మేము బటర్ఫ్లై గార్డెన్స్ చేరుకున్నాము. ఇక్కడ ఒక బటర్ఫ్లై కాకుండా కొన్ని విషపూరితమైన కప్పలు కూడా ఉన్నాయి. పెద్ద చేపలు, ఫ్లెమింగోసు, తాబేలు ఇంకా మక్కావు పక్షులు కూడా ఉన్నాయి. లోపల ట్రాపికల్ క్లైమేట్ ఉంది. కొంచెం హ్యూమిడ్ ఉంది. తీగల్లాగా ఉన్న చెట్లు వాటిపై బటర్ఫ్లైస్సు ఉన్నాయి. మకావ్ పక్షులు చూడడానికి పెద్ద ప్యారెట్స్ లాగా ఉంటాయి. దాదాపు 30 నుండి 50 సంవత్సరాలు జీవిస్తాయి. ఒకటి అవి జీవిత భాగస్వామిని అనుకుంటే లైఫ్ లాంగ్ బ్రతుకు ఉన్నంతకాలం అదే జీవిత భాగస్వామితో ఉంటాయి. Stunning మరియు vibrating కలర్స్ తో చాలా అందంగా ఉంటాయి. చూపర్లను ఆకట్టుకుంటాయి. వీటికి నట్స్ అంటే చాలా ఇష్టం ఎంత గట్టిగా ఉన్నా నట్స్ను ఈజీగా కొరకగలుగుతాయి. చాలా లౌడ్ వాయిస్ ఉంటుంది. ఇవి మిమిక్రీ కూడా చేస్తాయి. ఈ పక్షులకు చాలా డిమాండ్ ఉంది. ఇవి పళ్ళు మరియు నట్స్ తినేటప్పుడు వాటి గింజలు నేల మీద పడి చెట్లు పెరగడానికి పరోక్షంగా సహాయపడతాయి.

బటర్ఫ్లై గార్డెన్స్ లో ఫ్లెమింగోస్ కూడా ఉన్నాయి ఇవి పింక్ కలర్ లో ఉండి లాంగ్ లెగ్స్ తో మన కొంగలను పోలి ఉంటాయి ఇవి మధ్యమధ్య వాటి లాంగ్ లెగ్స్ తో నడుస్తూ అందాల భామలు అందాల పోటీలలో క్యాట్ వాక్ ను చేసినట్టుగా అనిపించింది.

ఇక బటర్ఫ్లై గార్డెన్స్ లో బటర్ఫ్లై ముచ్చట్లకొస్తే తెలిసిందే కదండీ. బటర్ఫ్లై చాలా అందంగా ఉంటాయి. అందానికి మారుపేరు. భావికుల ఊహలకు ప్రాణం పోసే అంత అందం .దాదాపు 80 రకాల బటర్ఫ్లై ఉన్నాయని ఇక్కడ బోర్డుపై వ్రాసింది. మనం తిరుగుతూ ఉంటే మన పైన కూడా వాలుతాయి.

ఇక్కడ ఒక గంట సేపు గడిపి అక్కడ నుంచి (Buchart garden )బుచట్ గార్డెన్స్ కు బయలుదేరాం.

బుచ్చట్ గార్డెన్స్ దాదాపు 121 సంవత్సరాలు నాటిది. ఇది 55 ఎకర్స్ లో విస్తరించి ఉంది .ఇది ఒక అందమైన గార్డెన్. ఇక్కడ రకరకాల కలర్స్ తో స్ప్రింగ్ సీజన్లో తులిప్స్, డేఫిడల్స్ ఇంకా దాదాపు 2500 రకాల గులాబీలు ఉన్నాయి. ఇక్కడ హిమాలయన్ బ్లూ పాపిస్ కూడా ఉన్నాయి. రోసెస్ కు ఒక పెద్ద ప్రదేశమే ఉంది .వేలకొద్ది హైబ్రిడ్ రోజెస్ ,creapers రకరకాల రంగులతో ఉన్నాయి. బోర్డ్స్ పై వివరాలు ఉన్నాయి. ఇక్కడ రెండు గంటలు టైం ఇచ్చారు. కానీ అంత పెద్ద గార్డెన్ రెండు గంటలలో తిరగడం సాధ్యం కాలేదు. రాత్రిపూట రకరకాల లైట్స్ తో చిన్న కలర్ఫుల్ ఫౌంటెన్ కూడా ఉంది. ఇక్కడ లేజర్ షో కూడా సాటర్డే సండే చేస్తారు. కానీ మాకు చూసే అవకాశం కలగలేదు .ఉన్న రెండు గంటలలో చాలా కవర్ చేసాం. Theme పార్క్స్ ఇంకా చాలా రకాల క్రీపర్సు రంగురంగులతో కాశ్మీర్ కాలువలను శాలువాలను పోలి ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పెట్స్ లాగా పరచుకొని ఉన్నాయి .ఇక్కడ ఒక పాట గుర్తు వచ్చింది “ఎంతో రసికుడు దేవుడు .ఎన్ని పూలు ఎన్ని రంగులు ఇచ్చాడు”.అని అలా సాగిపోతుందా పాట. మాకు గార్డెన్స్ కూడా అలాగే అనిపించింది. దాదాపు 55 ఎకరాల విస్తీర్ణమై 2,500 గులాబీలతో కనువిందు చేస్తున్న గార్డెన్స్ వర్ణించటానికి మాటలు రావడం లేదు. మాటల్లో చెప్పి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది.

బుచ్చట్ గార్డెన్స్ నుంచి బస్సు ఫుడ్ కోర్టుకు తీసుకొని వెళ్ళింది. మేము జపనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాము. అక్కడ” సూశి” ట్రై చేసాం .అందరూ చాప్ స్టిక్స్తో ఈజీగా తింటున్నారు. సరే మేము కూడా చాప్ స్టిక్స్ తో తినడానికి ట్రై చేశాము. నవ్వడం తప్ప ఒక్క బుక్క కూడా నోట్లోకి వెళ్ళలేదు. రెండు ఫింగర్స్ మధ్యన స్టిక్స్ ను పట్టుకొని సూశి నోట్లో పెట్టుకోవాలి. ఎంత try చేసిన ఎప్పుడు సూశి “ప్లేట్లో పడుతుంది” తప్ప నోట్లోకి వెళ్లడం లేదు .ఆకలి దంచేస్తుంది. ఇది ట్రయల్స్ టైం కాదు కదా నిర్ణయించుకుని అటు ఇటు చూసి చక్కగా చేతులతోనే తిన్నాం. ప్లేట్లో “వసాబి” ఉంది . “వసాబి”ఎప్పుడైనా ట్రై చేయమని మా అబ్బాయి చెప్పాడు. ఇప్పుడు వసాబి ఉంది కదా అని ట్రై చేద్దామని అది ట్రై చేయమని మా అనుకొని చాప్ స్టిక్ తో జస్ట్ ఒక చిన్న పోర్షన్ నాలుకపై పెట్టుకున్నాం. వసబి ఘాటు నశాళానికి ఎక్కింది. అలా మా లంచ్ పూర్తయింది.

అక్కడినుండి బస్సులో “చైనా టౌన్ “వెళ్ళాం. ఇది ఒక పెద్ద టౌన్. అనుకున్నాం కానీ చిన్నగా ఉంది. ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద డ్రాగన్ బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలు ఉన్నాయి. పైన అంతా రెడ్ బెలూన్స్ కట్టారు. మధ్యమధ్య లాంతర్లను అలంకరించారు. అక్కడ అందరూ ఏమన్నారు అంటే అక్కడ అందరూ” చైనా టౌన్ నైట్ లో చాలా బాగుంటుంది” అన్నారు. కానీ మాకు ఆ ఛాన్స్ లేదు. ఇంకో 30 నిమిషాలు మాత్రమే టైముంది. అక్కడే నడుస్తుంటే ఒక న్యారో స్ట్రీట్ ఉంది. ఇద్దరు వ్యక్తులు ప్రక్కన నడిస్తే స్ట్రీట్ లో రెండు గోడలు తాకుతాయి. అంత నారో గా ఉంది .జస్ట్ ఒక 20 నిమిషాలలో చైనా టూర్ ముగించుకొని బస్సులో కూర్చున్నాం. బస్సు మమ్మల్ని క్రూజ్ పోర్టు వద్ద దింపేసింది. కానీ మేము క్రూజ్ లోపలికి వెళ్లలేదు. కౄజ్ బయలుదేరడానికి ఇంకా చాలా టైం ఉంది. అక్కడే ఉన్న పార్లమెంట్ భవనం మరియు ఆ ప్రక్కనే ఉన్న ఎంప్రెస్ హోటల్ చూడ్డానికి బయలుదేరాం. జస్ట్ అంత వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. అన్ని అక్కడ అక్కడే ఉంటాయి. విక్టోరియాసిటీని 1843లో స్థాపించారు. గోల్డ్ రష్ కోసం చాలామంది వ్యాపారస్తులు గోల్డ్ కోసం ట్రై చేస్తున్న నేపథ్యంలో విక్టోరియా “ప్రొవెన్షనల్ క్యాపిటల్గా” ప్రాచుర్యం పొందింది. పోర్టుకు ఆనుకొని ఉన్నందువల్ల బిజినెస్ పరంగా చాలా అభివృద్ధి చెందింది. కెనడా మొత్తంలోనే మంచి క్లైమేట్ ఉన్న ప్రాంతంగా చెప్తారు. North పోలిస్తే వర్షాలు కొంచెం తక్కువ. బ్రిటిష్ కొలంబియా యొక్క ట్యాగ్లైన్” బ్యూటిఫుల్ బ్రిటిష్ కొలంబియా “అని ఉంటుంది .ఇక్కడ కార్ నెంబర్ కింద ప్లేట్ పైన ‘బ్యూటిఫుల్ బ్రిటిష్ కొలంబియా” అని రాస్తారు. రకరకాల పూల చెట్లతో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా పచ్చదనం విస్తరించినట్టుగా ఉంటుంది. ఇక్కడి నుంచి బ వ్యాన్కోవర్ వరకు ఫెర్రీస్ చాలా ఉంటాయి .ఒకటిన్నర గంట సమయం పడుతుంది. అలా నడుస్తూ నడుస్తూ పార్లమెంటు భవనం చేరుకున్నాం. ఈ భవనాన్ని కొంతవరకు చూడడానికి అవకాశం ఉంది. ఇది 1893లో కట్టడం స్టార్ట్ చేసి 1897లో కంప్లీట్ చేశారు .ఫ్రీ గైడ్ టూర్ కూడా ఉంటుంది . ఇది ఇంటీరియర్ కు చాలా ఫేమస్. ఇక్కడ చాలా పెద్ద గ్లాస్ విండోస్ కలర్ఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. మెట్లు ఎక్కుతుంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన ఫిలాసఫర్ అరిస్టాటిల్ ,ఫ్లూటో వంటి గొప్ప వ్యక్తుల “కోట్స్” గోడల పైన వ్రాసి ఉన్నాయి. పైన ఉన్న సీలింగ్లో గోల్డ్తో చేసిన డిజైన్స్ ఉన్నాయి. ఇవి ఎండకు మెరుస్తున్నాయి. అత్యంత మనోహరంగా ఉన్న పార్లమెంట్ భవనం రాత్రి వేళలో ఇంకా ఎంతో అందంగా ఉంటుంది. ఇది మేము 2016 లో క్రూజ్ కు వెళ్ళినప్పుడు చూసాం. ఇక వివరాల్లోకి వెళితే 3,600 lite bulbs ఉన్నాయంట. పార్లమెంట్ భవనంలోనే ఒక పెద్ద లైబ్రరీ ఉంది.

పార్లమెంట్ భవనంలో ఒక గాజు పేటికలో” మేస్ ” ఉంది. ఇది మన “గద” టైపులో ఉంటుంది. ఒకటేమిటి ఇలా ఎన్నో విశేషాలతో పార్లమెంట్ భవనం మాకు మా జ్ఞాపకాలను మళ్లీ తాజా చేసింది .అక్కడి నుండి ఎదురుగా ఉన్న “ఎంప్రెస్” hotel చూడటానికి వెళ్ళాము .ఎంట్రీ ఫీజు 76 డాలర్స్ .మేము అక్కడిదాకా వెళ్లి బయటనుండే అంతా తిరిగి చూసి క్లోజ్ వద్దకు వచ్చాము. క్రూజ్ సిబ్బంది సాదర ఆహ్వానాలతో, వెల్కమ్ డ్రింక్స్ లతో లోపలికి వెళ్ళాం .ఈరోజుతో మా క్రూజ్ యాత్ర ముగుస్తుంది. రాత్రి డిన్నర్ అయిన తర్వాత మా బట్టలన్నీ ప్యాక్ చేసాం .రాత్రి మన లగేజ్ మన రూమ్ బయట పెట్టాలని చెప్పారు .హ్యాండ్ బ్యాగ్ లు ఉంచుకొని , లగేజ్ రూమ్ బయట పెట్టాం. 8th deck లో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి వెళ్ళాం. అక్కడ వీనుల విందుగా ఒక పదం వినిపించింది.” ఆఫర్ ఆఫర్ ఆఫర్ “అని అదేమీ ఆఫర్ అని తెలుసుకోవడానికి రిసెప్షన్ వద్దకు వెళ్లాం.” క్రూజ్ నెక్స్ట్” ప్రోగ్రాం లో ఒక ఆఫర్ అదేంటంటే. 500 డాలర్లు ఇప్పుడు పే చేసి రిజర్వ్ చేసుకుంటే ఆ డాలర్స్ కి 1000 పాయింట్స్ వస్తాయి. ఇది ఎప్పుడైనా మనం use చేసుకోవచ్చు .ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఎక్స్పైరీ డేట్ లేదు. ఇంకేంటి వెంటనే బుక్ చేసుకున్నాం వాటిలోని 500 పాయింట్స్ తో ఫిబ్రవరి 2026 లో “ఎన్సీఎల్ “లో మెక్సికో వెళుతున్నాం. ఐటనరీ ప్రకారం ఉదయం 7 గంటలకు సియాటిల్ పోర్ట్ లో దిగాం .ఈ పది రోజులు చాలా refreshing గా అనిపించింది.

అలా మా క్రూజ్ ప్రయాణం ముగిసింది.

గతాన్ని ఒక్కసారి తిరగేసి చూడందే, భవిష్యత్తు ప్రణాళిక సరిగ్గా అవదు. అందుకే మనం ప్రతిసారి గతంలో ఏం జరిగింది అనేది ఒక పద్ధతిగా పెట్టుకొని దాన్ని అనుసరించడం పరిపాటయింది ఆ క్రమంలోనే నాకు అనిపించింది అప్పుడే అన్ని సంవత్సరాలు క్రితమే 14 98 లోనే వాస్కోడెగామా అని పౌర్చుగీస్ నావికుడు ఇండియాను కనిపెట్టిండని తెలుసుకున్నాము. అంతకన్నా ముందు ఎన్నో సంవత్సరాలు కృషి కూడా దీని వెనకాల ఉన్నది. విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకొని , జిపిఎస్ నావిగేషన్ లేని రోజుల్లో వాళ్ళు ఎంతో తెలివిగా ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని మనకు ఆదర్శప్రాయలు అయినారు. అప్పటి నుంచి మనవాళ్లంతా ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పుడు క్రూజ్ కనిపెట్టి మనమంతా ఎంజాయ్ చేసేట్టుగా చేయడం ఎంతో హర్షనీయం. ఇప్పుడు అన్ని వసతుల తోటి ఉన్న క్రూజ్ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది నాకు. ఒక పాట కూడా గుర్తు వచ్చింది. “హైలే హైలే సా హసం కదా నా పడవ”5G అనే పాటను ఎన్నోసార్లు పాడుకున్నాం ఈ ప్రయాణంలో. మీరందరూ కూడా ఈ క్రూజ్ జర్నీని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.
(The Cruise ఓ దృశ్య ప్రయాణం )
( సమాప్తం)

Written by Nellutla Indrani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉమా చిత్రాలు

మార్పు కోసం నా అక్షరాలు