మన మహిళామణులు

గాంధేయ వాది,వినోబా పంథాను అనుసరించిన కీ.శే.బాపాయమ్మ

గాంధీజీ సూత్రాలు,వినోబాజీ ఆచరణలో తన భర్త తో పాటు అడుగులో అడుగేసి నడిచిన బాపాయమ్మగారి జీవితం నేటి తల్లులు,వనితలకు ఆదర్శం.చర్ల బాపాయమ్మ, వేదుల రమాదేవి రామచంద్రశాస్త్రిగార్ల రెండవ కుమార్తె.తెలుగు సంస్కృతం చదివిన ఆమెకు 1943 లో చర్ల జనార్దనస్వామితో పెళ్లి కావటంతో జీవితం మలుపు తిరిగింది.సర్వోదయ వ్యాప్తి, మహిళామండలి నిర్వహణ, 4గురు కొడుకులు,ఇద్దరు కూతు

ర్లతో సంసారం నడిపారు.అన్నివిధాల భర్త కి చేదోడు వాదోడుగా ఉంటూ సర్వోదయ మహిళామండలి తరుఫున విజయవాడ గాంధీపర్వతంమీద స్త్రీ శక్తిసమ్మేళనం నిర్వహించిందామె. హిందీవిశారద పాసైన బాపాయమ్మ ఉచితంగా హిందీ నేర్పుతూ వినోబా శిష్యురాళ్లతో కల్సి పశ్చిమ గోదావరిజిల్లా పాదయాత్ర లో పాల్గొన్నది.1977 లో దివిసీమ ఉప్పెన లో సేవాకార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఆమెది.

ఇక తల్లిగా పిల్లలను క్రమశిక్షణ లో పెంచి వారు బాగా చదువుకునేలా శ్రద్ధ తీసుకున్నారు.ఉదయం 5గంటలకే పిల్లల్ని లేపి ఇంటి పనులు చేసేలా బాధ్యతలు నేర్పిందామె.5.30నుంచి 6దాకా నిర్గుణ ప్రార్ధన భగవద్గీతాపఠనం,వంటావార్పు పూర్తిచేసి సోషల్ వర్క్ చేసిందామె.

ఆరుగురు పిల్లలు ఉన్నత విద్యావంతులై మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు.పెద్ద కూతురు విజయ లక్ష్మి హిందీ ఎం.ఎ.వీణ నేర్చుకుని సంగీతంచెప్తోంది. ఆఖరి సంతానం అన్నపూర్ణ హిందీ ఎం.ఎ.పిహెచ్.డి.చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్,హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు!10 ఆగస్ట్ 2013లో బాపాయమ్మ కన్నుమూసినా ఆమెసంతానం తల్లిదండ్రుల పేరు నిలబెట్టడం ముదావహం.
తల్లిని గూర్చిన సమాచారం అందించిన వారు పెద్ద కూతురు విజయలక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిట్టి కథ గొప్ప సందేశం

మన ఆరోగ్యం