పచ్చిఉల్లిగడ్డను తినరాదు.అందులోని సల్ఫర్ కాంపౌండ్స్ పొట్ట లో యాసిడ్ ని ఉత్పత్తి చేస్తాయి.ఇరిటబుల్ బౌల్ సిండ్రోంకి కారణం ఔతుంది.చర్మంపై రాషెస్, దురద,కంట్లోంచి నీరుకారటం జరుగుతుంది.లో బి.పి.వారు తినరాదు.జీర్ణవ్యవస్థ సరిగాలేనివారు తినకపోటమే నయం. ఆంగీ క్రేజ్ నేడు మహిళల్లో పెరుగుతోంది.చీర,లంగా కి పైన బ్లౌజ్,జాకెట్ ఫ్యాషన్ పోయి గ్లామరస్ లుక్ కోసం రాజస్థాన్, గుజరాత్ ఆంగీని ధరిస్తున్నారు.బాక్ లెస్,డీప్ బ్యాక్ కి త్రాళ్లు ఉంటాయి.వాటిని బిగించి కడ్తారు.ప్రాచీన భారత్ లో స్త్రీలు రవికె జాకెట్ ధరించేవారుకాదు. బట్ట ముక్కల్ని శరీరపైభాగాన చుట్టుకునేవారు. ఆతర్వాత అంగరఖా లాగా ఫిటెడ్ టాప్స్ ని త్రాళ్లతో సైడ్ కి బిగించేవారు.ఇదే ఆధునిక ఆంగీ! బ్లౌజ్ శరీరంని కప్పిఉంచితే, ఆంగీ వీపు అంతా కనబడుతుంది.లహంగా తో ఆంగీ ని ధరించటం నేటి ఫ్యాషన్. సాధారణంగా మనం ఆకుకూరల తొడిమెలు పారేస్తాం.కాలీఫ్లవర్ ఆకుల్ని చెత్త అని అనుకుంటాం.కానీ వాటితో వెరైటీ గా వంటకాలు చేసితింటే పోషకవిలువలు మనకి లభిస్తాయని అంటున్నారు వైద్యులు.మనం పారేసే కొత్తిమీర కాడల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.సూప్ ,చట్నీ కూరలా వెరైటీగా చేసి తినమంటున్నారు ఆహార నిపుణులు.బ్రోకలీ, కాలీఫ్లవర్ ఆకుల్ని పరాఠీలో స్టఫ్ గా,పప్పులో వేసి ఉడికించి తినొచ్చు. ముల్లంగి ఆకుల్తో చట్నీ కూర ,పులుసులో వాడితే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. స్ట్రెస్ ఈటింగ్ ఓజబ్బుగా మారింది నేడు.ఆకలిలేకున్నా నోటిని మిక్సీలాగా ఆడిస్తారు.అలసట,విసుగు,బంధాలు సంబంధాలు సరిగా లేక పోవటం కారణాలు.తీపి,వేపుడు, హైక్యాలరీ ఫుడ్ అలా తినడం జబ్బు.దానితో లావెక్కి హై బి.పి. మానసిక సమస్యలు వస్తున్నాయి.కోర్టిజోల్ అనే హార్మోన్ వల్ల ఆకలి పెరుగుతుంది.జంక్ ఫుడ్ తిన్నాక ఉషారుగా ఉంటుంది.ఆతర్వాత తిక్క రేగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.రాత్రి కూడా నోట్లో నమిలితే మూడ్ పాడవుతుంది.కోపం,ఒంటరితనం అలసట,నిస్సహాయత, పెరుగుతాయి.బాగా మంచినీరు తాగాలి.ఓబుక్ లో రాసుకోవాలి ఎప్పుడు ఏంతిన్నాను,మనసు ఎలాఉందని రాయాలి.నిద్ర తక్కువ, మంచినీరు తాగకపోటం ఈరోగానికి కారణం,యాంగ్జైటీ డిప్రెషన్ కారణాలు. టి.వి.చూస్తూ తినటంతప్పు.చిన్న ప్లేట్ లో తినాలి.