కలం కదలడం లేదు
ఎందుకో అర్ధం కావడం లేదు
Gender discrimination, Gender discrimination
ఏంటి ఈ పదం , ఎక్కడ చూడు
Gender discrimination
స్త్రీ పై జరిగే మరో విషాదగాద…
తిండికాడ, బట్టకాడ, ఉద్యోగం కాడ,..
చివరికి చదువుల తల్లి ముందు కూడానా..,
అమ్మాయి పుట్టగానే మహాలక్ష్మీ పుట్టిందని,
పెరిగే కొద్ది ధరిద్రంలా చుట్టుకుందాని,
ఒక ఆలీల, చెల్లిలా,కూతురిలా,తల్లిగా..
సేవచేయడానికే పుట్టిందాని ఒక్క ముద్ర వేసారు..,
ఈ Gender discrimination ఇంటి నుండి మొదలై,సమాజం అంతట పాకిపోయింది…
దీనిని రూపుమాపాలంటే మార్పు ఇంటి నుండే మొదలుకావాలి…
తన కలలను అణచివేసి,పుస్తకాలను పట్టుకునే వయస్సులో సేవలు చేసే స్థితికి చేరుకుంది స్త్రీ…
*_చదివి సరస్వతి లా అవ్వాలనుకున్న స్త్రీ సంసారం సాగరంలో తోలు బొమ్మయే…,
కన్నుల నిండా కోటి ఆశయాలతో వేరొక ఇంట అడుగు పెట్టిన స్త్రీ వంటగదికే పరిమితమాయే…,
జీవికి ప్రాణం పోసే సామర్థ్యత ఉన్న స్త్రీ ,సంపూర్ణంగా ప్రాణాన్ని వదిలే స్వతంత్రం లేదయే…,
అడుగడుగున కష్టాలే,అవమానాలే,ప్రతి దాంట్లో భేదాలే..,
ఆకాశాన్ని తాకే తన కలలు తన ముందే ఆవిరవుతుంటే ,
బిక్కు మంటున్న తన మనస్సు తో సంపూర్ణంగా జీవించలేక ,
నిస్సాహాయురాలుగా జీవితాన్ని గడిపేస్తుంది స్త్రీ…,
రాతిని పూజించే ఈ సమాజం,స్త్రీ త్యాగాన్ని గుర్తించడం లేదాయే…_*
అందరూ చూసి అయ్యో అనడం తప్ప , అడ్డుకునే వారేవరు లేరాయే…
అందుకోలేని అంతరిక్షానికి పరుగులు తీస్తుంది సమాజం…
కానీ, అదుపెరుగని ప్రేమను చూపిస్తున్న స్త్రీనీ మాత్రం పాతాళంలోకి నెడుతుంది…,
ఈ దరిద్రమైన సమాజం లో స్త్రీ బ్రతుకుకి అర్థం లేదు…
ఇలాంటి వాటిని ఎదుర్కొనే కొంతమంది స్త్రీలు శవంలా..,
మరికొందరు జీవశవంలా ఉన్నారు…
ఈ విషాదం మన సమాజానికి గర్వించతగినది కాదు…
స్త్రీ లేనిదే జననం లేదు,స్త్రీ లేక జీవనమే లేదు…
స్త్రీ సహనమే సృష్టిజాగృతికై బాటవేసే,
స్త్రీ శక్తియే సర్వదా శుభం పలికే…