చిట్కాలు ఆరోగ్య సూత్రాలు

ఇప్పుడు కలబంద కి గిరాకీపెరిగింది.మనం తేలిగ్గా ఇంట్లో పెంచుకోవచ్చు. మంచి మాయిశ్చరైజర్!అందం చర్మసౌందర్యం కోసం కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ కొనే బదులు దీన్ని వాడితే చాలు.నేచురల్ గ్లో వస్తుంది.ముడతలు మచ్చలు,మొటిమలు పోయి చర్మం నిగనిగ లాడుతుంది.ఫ్రెష్ ఎలోవిరా జెల్( ముదురాకు తుంపితే జిగటగా ద్రవం)ని మొహానికి జట్టుకు పట్టిస్తే చాలు.కొద్దిగా నిమ్మరసం కల్పితే దుమ్ము జిడ్డు వదులుతుంది.ఒక చెంచా బ్రౌన్ షుగర్ చెంచాఆలివ్ ఆయిల్,2 చెంచాల ఎలోవిరా రసం కల్పి మొహాన పట్టించి మృదువుగా మసాజ్ చేస్తే నేచురల్ స్క్రబర్ తయారవుతుంది.డెడ్ స్కిన్ పోతుంది.2చంచాల కలబంద రసం ఒకచంచా తేనె కల్పి విటమిన్ ఈ కాప్సూల్ తుంపి కల్పి పట్టించాలి.ఎలోవిరా జెల్,ముల్తానీమట్టి, చందనపౌడర్ కల్పి మసాజ్ చేయాలి.
తాజా లేత ఆకు ఓ అరంగుళం కోసి శుభ్రంగా కడిగి నమిలి మింగితే ఆరోగ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు – కర్లపాలెం స్వరాజ్యలక్ష్మి గారు!

చిత్రకళ