మౌనస్వరాలే మన నేస్తాలు

కవిత

అవి కూడా మనలాగే
ఒకప్పుడు ఈ భూమి మీద,
అడవుల మధ్య, కొండల నడుమ,
ఎన్నో జీవులు స్వేచ్ఛగా తిరిగేవి.

కానీ…
మన స్వలాభం కోసం
అడవులను నరికివేస్తూ…
మన ఊపిరిని మనమే
ఆపేస్తున్నామని మరచిపోవద్దు..!

అభివృద్ధి పేరుతో
జంతువులే లేని లోకం లోకి …
మనకు మనమే శూన్యం లోకి అడుగులు
వేస్తున్నామని మరచిపోవద్దు..!

నరికిన అడవి ఆకుల గుసగుసల్లో గాలి కవిత్వమై
మనలని హెచ్చరిస్తున్నది
రోజులు దగ్గర పడ్డాయి అని..!

సమస్త జంతు ప్రాణాలు కాపాడుకుంటూ
వేడుకొంటున్నాయి కవిత్వమై నా కలాన్ని..!

జంతువు బతికితే అడవి బతుకుతుంది,
అడవి బతికితే మనం బతుకుతాం…

అందుకే…
అక్టోబర్ 4 ప్రపంచ జంతువుల దినోత్సవం
సందర్భంగా
ప్రకృతి ప్రేమికులారా అడవులను కాపాడుదాం..!
మినీ అడవులను ఏర్పాటు చేద్దాం..
సమస్త జంతు ప్రాణాలకు స్వేచ్ఛ ఇద్దాం..!

Written by Manjula Patipati

రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మౌనానికి ఆవల….

‘ఆమె’