అస్త్రం …శస్త్రం… శాస్త్రం….

మన భారతీయ విజ్ఞానం అపూర్వమైనది. ఆధ్యాత్మికతకు సంస్కృతికే పరిమితం కాక,
ప్రాచీన కాలం నుండి అత్యద్భుతమైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి పురిటిగడ్డగా విలసిల్లింది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులుగా నిలిచిన ఎన్నో ఆవిష్కరణలు కొన్ని వేల ఏళ్ళ క్రితమే భారత దేశంలో రూపుదిద్దుకున్నాయి. ఈ ఘనత ప్రాచీన భారతీయ మహర్షులు శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి. ఈ ప్రగతి ప్రపంచ విజ్ఞాన చరిత్రలోనే భారత దేశ సాంకేతిక విజ్ఞానానికి మకుటాయమానంగా నిలిచింది. మన భారతీయ సనాతన సంస్కృతిలో మహర్షులు మరియు మునులు కేవలం ఆధ్యాత్మిక గురువులే కాదు ,వారు అసాధారణమైన సైనిక మరియు అస్త్ర శాస్త్ర సాంకేతిక నిపుణులు .ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేడు ప్రయోగిస్తున్న క్షిపణులు (missiles),అణు బాంబులు (, nuclear weapons)జీవ రసాయన(bio chemical weapons) ఆయుధాల వంటి సాంకేతికతను వేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు మంత్ర ,యంత్ర రూపాలలో ఆవిష్కరించారు.
ముందుగా మనం వారి అద్భుత సృష్టిలో భాగమైన అస్త్రాలను, శస్త్రాలను గురించి తెలుసుకుందాం.

“అస్త్రం” అంటే మంత్రాలను ఉపయోగించి దూరం నుండే శత్రువుల పైన ప్రయోగించే శక్తివంతమైన ఆయుధం.
“శస్త్రం అంటే చేతిలో పట్టుకుని నేరుగా యుద్ధంలో రక్షణ కోసం ఉపయోగించే ఆయుధం. “

ఇతిహాస, పురాణాల ప్రకారం అస్త్రాలు కేవలం భౌతిక ఆయుధాలు కావు అవి మంత్రయుతమైన దైవిక శక్తితో పని చేసే
పరమ పవిత్రమైన, అతి బలీయమైన శక్తులు.
వాటిని ప్రయోగించటానికి నిర్దిష్టమైన మంత్రాలను ఉచ్చరించాల్సిన అవసరం ఉంటుంది. విల్లు నుండి వదిలే ఒక సాధారణ బాణానికి ఈ మంత్ర శక్తిని జోడించినప్పుడు అది అస్త్రం గా మారుతుంది. ప్రతి అస్త్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవత యొక్క సంపూర్ణ శక్తి ఆ అస్త్రంలో దాగి ఉంటుంది.
అస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే కాకుండా దానిని వెనక్కి తీసుకోవడం కూడా తెలిసి ఉండాలి. అంటే ఉపసంహరించడం కూడా తెలిసి ఉండాలి అది తెలియకపోతే తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఉదాహరణ మహాభారతంలో అశ్వద్ధామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు. ఉపసంహరించడం తెలియదు. అది తెలిసిన వాడు అర్జునుడు. అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడే ఉపసంహరిస్తాడు.
ఇప్పుడు మనం కొన్ని ప్రముఖ అస్త్రాల గురించి చెప్పుకుందాం.
బ్రహ్మాస్త్రం ;
సృష్టిలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాలలో అతి ముఖ్యమైనది.ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన చోటు దశాబ్దాల పాటు కరువు కాటకాలతో నిండిపోతుంది.
పాశుపతాస్త్రం ;
ఈ పాశుపతాస్త్రం అతిశక్తివంతమైనది. దీని అధిష్టాన దేవత సాక్షాత్తు పరమశివుడే. ఈ అస్త్రాన్ని కంటి చూపుతో ,మనసుతో లేదా మాటతో కూడా ప్రయోగించవచ్చు .ఈ విశ్వంలో దేనినైనా సర్వనాశనం చేయగల శక్తి కలది.
నారాయణాస్త్రం ; ఈ అస్త్రం యొక్క అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు. దీనిని ప్రయోగించినప్పుడు ఆకాశం నుండి లక్షలాది ఆయుధాలు కురుస్తాయి. శత్రువు ఆయుధాలు కింద పడేసి లొంగి పోతేనే ఇది శాంతిస్తుంది.
అంత శక్తివంతమైనది ఈ నారాయణాస్త్రం.
ఆగ్నేయాస్త్రం ;
ఈ అస్త్రానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు.
ఇది భయంకరమైన మంటలను సృష్టిస్తుంది శత్రు సైన్యాన్ని బూడిద చేయడానికి దీనిని వాడేవారు.
వరుణాస్త్రం ;
వరుణ దేవుడు ఈ అస్త్రానికి అధిష్టాన దేవత.
ఆగ్నేయాస్త్రం వంటి అస్త్రాల మంటలను ఆర్పడానికి ,వరదలను సృష్టించడానికి దీనిని ప్రయోగించేవారు.
వాయువ్యాస్త్రం ;
దీని అధిష్టాన దేవత వాయుదేవుడు. అతి భయంకరమైన తుఫానులను, సుడిగాలులను సృష్టించి, శత్రువులను చెల్లాచెదురు చేస్తుంది ఈ అస్త్రం.
ఇవి ముఖ్యమైన అస్త్రాలు. ఈ దివ్యాస్త్రాలు అంత సులభంగా పొందలేరు .తీవ్రమైన తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకున్న తర్వాతే, ఈ అస్త్రాలు వారికి చేరుతాయి . గురువుల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండి, వారి అనుగ్రహం తనే
మంత్రోపదేశం ద్వారా ఈ అస్త్రాలను పొందాలి.
మానసిక నిగ్రహం ,ధర్మం తప్పని గుణం ఉన్నవారికి మాత్రమే గురువులు వీటిని రహస్యంగా ఉపదేశించేవారు.
ఈ అస్త్రాల గురించి మనం రామాయణ, మహాభారత కాలంలో వాటి ప్రయోగం జరిగినట్లు విన్నాం.
రాముడు రావణుడి నాభిలో ఉన్న అమృత భాండాన్ని ఛేదించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
అలాగే రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను మరియు వానర సైన్యాన్ని బంధించడానికి నాగాస్త్రాన్ని, వారు మూర్చపోవడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగింవారు. తరువాత లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తును సంహరిస్తాడు.
అలాగే మహాభారతంలో కర్ణుడు నాగస్రాన్ని అర్జునుడి మీదకి ప్రయోగిస్తాడు అయితే శ్రీకృష్ణుడు ప్రధాని భూమిలోకి తొక్కడం వల్ల అది అర్జునుడి తలకి తగలకుండా కేవలం కిరీటాన్ని మాత్రమే ఎగుర గొడుతుంది .
అలాగే అర్జునుడు విరాట రాజు కొలువులో ఉన్నప్పుడు,గోగ్రహణ కాలంలో సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి ,అందరిని మూర్చపోగొడతాడు.
తరువాత కురుక్షేత్ర యుద్ధ సమయంలో జయద్రధుని అంటే సైంధవుని తల తెగవేసేటప్పుడు పాశుపతాస్త్రాన్ని వాడతాడు.
ఇక శస్త్రాలు అంటే బాణాలే.
ఈ విధంగా అద్భుతమైన శక్తివంతమైన అస్త్ర ప్రయోగాలు ఇతిహాసాల కాలంలో ప్రయోగింపబడినట్లు తెలుస్తున్నది.

**ఇది ఒక సుదీర్ఘమైన వ్యాసం. ఈ వ్యాసంలో అస్త్రాల, శస్త్రాల గురించి చెప్పాను. ఇక ఆధునిక కాలంలో ఆ అస్త్రాలకి ఉన్న పేర్ల గురించి రెండవ పార్ట్ లో వివరిస్తాను. **
* ఈనాడు పాశ్చాత్య నాగరికత మోజులో పడి, మన భారతదేశం విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్న వారికి ,మన దేశం ఎంత గొప్పదో చెప్పడానికే నా ప్రయత్నం .అందుకే నా ఈ కథనం *

* * *
పాశ్చాత్య నాగరికత కోసం పరుగులు పెడుతున్న నేటి తరం వారికి ముఖ్యంగా యువతకు” మన సనాతన సాంకేతికత” గురించి చెప్పాలనే తపనతో ఆధునిక క్షిపణులు అనుభవములను గురించి మీ ముందు ఉంచబతున్నాను.
1. బ్రహ్మాస్త్రం: అణుబాంబు.
(Nuclear weapon /atomic bomb).
సృష్టిలోనే అతి భయంకరమైన అస్త్రం ఇది. దీని నుండి కోటి సూర్యుల కాంతి ఒకేసారి ఉద్భవిస్తుంది. పర్యావరణం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వృక్షాలు జంతువులు మనుషులతో పాటు అంతరించిపోతాయి. ఈ అస్త్రం ఏ ప్రాంతం మీదకు ప్రయోగింపబడుతుందో ,ఆ ప్రాంతంలో దశాబ్దాల పాటు వర్షాలు పడవు. అపాయకరమైన రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. కరువు,కాటకాలు ఏర్పడతాయి. అంత భయంకరమైన శక్తివంతమైనది ఈ అస్త్రం. ఆధునిక కాలంలో హిరోషిమా , నాగసాకి లపై ప్రయోగించడం జరిగింది. దీని ప్రభావం వల్ల దశాబ్దాల పాటు అక్కడ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులుగా పుట్టారు. బ్రహ్మాస్త్రం కూడా ఇలాంటిదేనని మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వివరింపబడింది.
2. బ్రహ్మ శిరోనామకాస్త్రం: హైడ్రోజన్ బాంబ్.
(Thermo nuclear/ Hydrogen bomb ).
పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రం అన్నది సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్మించిన అత్యంత శక్తివంతమైన దైవీకమైన ఆయుధం. దీనిని రామాయణ కాలంలోనూ మహాభారత కాలంలోనూ ప్రయోగించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
రామాయణ కాలంలో శ్రీరాముడు రావణాసురుడి పైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతడిని సంహరించాడు. అలాగే సముద్రుడిని మార్గం ఇవ్వమని కోరుతూ గురి పెట్టాడు కానీ సముద్రుడు క్షమాపణ వేడటంతో దానిని, ద్రూమకుల్య(ప్రస్తుత రాజస్థాన్ ఎడారి) వైపు దారి మళ్ళించాడు.
మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత అశ్వద్ధామ పాండవ వంశ నాశనానికి ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ను, ఉత్తర గర్భం మీదకి ప్రయోగిస్తాడు. ఆగ్రహించిన అర్జునుడు తను కూడా ప్రతిగా ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పటికీ, లోక వినాశనాన్ని అరికట్టటానికి వేద వ్యాసుడు నారదుడు ఇచ్చిన సలహా మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అశ్వద్ధామ ఉపసంహరించుకోలేక దానిని ఉత్తర గర్భం వైపు మళ్ళించాడని ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ శిశువుని రక్షించాడని చెప్పబడింది. అయితే కొన్ని పురాణాల ప్రకారం అర్జునుడే ఆ అస్త్రాన్ని కూడా ఉపసంహరించాడని చెప్పబడింది.
ఆధునిక కాలంలో ఈ హైడ్రోజన్ బాంబ్ ఎక్కడ ప్రయోగింపబడలేదు. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ బాంబు పరీక్షల అమెరికా నిర్వహించింది
. 1952 నవంబర్ 1 న పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ ఐలాండ్స్ లో గల
ఎలుగెలాబ్. ఇది బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు శక్తివంతమైనది .బ్రహ్మాస్త్రానికి ఒక ముఖం ఉంటే, ఈ ఆస్త్రానికి నాలుగు ముఖాలు ఉంటాయి.
ఈ అస్త్రం ఎంత శక్తివంతమైనది అంటే భూగోళాన్ని మొత్తం నాశనం చేయగలదు.
* ఈ వ్యాసం సుదీర్ఘమైనది .ఇంకా ఉంది. అందువల్ల దీని కొనసాగింపు ఇంకొక పార్ట్ ఉంటుంది.*

3. పాశుపతాస్త్రం: (inter continental ballistic missile ICBM). ఖండాంతర క్షిపణి.
పరమశివునికి సంబంధించిన ఈ అస్త్రం కంటిచూపుతో గాని మనసుతో గాని శబ్దంతో గాని ప్రయోగించవచ్చు ఇది శత్రువు ఎంత దూరంలో ఉన్నా వెతికి పట్టుకొని సర్వనాశనం చేస్తుంది నేటి గైడెడ్ క్షిపణులు మరియు శత్రువులను ట్రాక్ చేసే ఆర్డర్ వ్యవస్థలు దీనిని పోలి ఉంటాయి.
ఈ అస్త్రాన్ని అర్జునుడు మహాభారత యుద్ధ కాలంలో జయద్రధుని పై ప్రయోగిస్తాడు.జయద్రధుని తండ్రి వృద్ధక్షత్రుడు తన కుమారుని తల ఎవరైతే నేలపై పడవేస్తారో
వారి తల ముక్కలవుతుందని శాపం పెడతాడు.. అందువల్ల కృష్ణుడు అర్జునునితో సైంధవుని తల నేలపై పడకుండా అతని తండ్రి ఒడిలో పడేట్లుగా వేయమంటాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవుని తల అతని తండ్రి ఒడిలో పడేట్లుగా వేస్తాడు. అదేదో అని ప్రేమపడి అతని తండ్రి నేలపై విదిలించి తల పగిలి చనిపోతాడు.
4.నాగాస్త్రం:(The serpent weapon /snake noose) ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ,వేల సంఖ్యలో విష సర్పాలు ప్రత్యక్షమై శత్రువులను కదలకుండా గట్టిగా చుట్టేస్తాయి. రామాయణంలో ఇంద్రజిత్తు లక్ష్మణునిపై ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు.
రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీనినే నాగ పాశం అని కూడా అంటారు .దీని వలన వారు స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు గరుత్మంతుడు స్వయంగా అక్కడికి వచ్చి, తన శక్తితో ఆ నాగ బంధాల నుండి వారిని విముక్తులను చేస్తాడు.
మహాభారతంలో కర్ణుడు అర్జునుడిపై నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు .ఆ బాణంలో “అశ్వసేనుడు,,” అనే పాము దాగి ఉంటుంది. అది అర్జునుడి తలను తాకే సమయానికి, శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలుతో రథాన్ని భూమిలోకి కొద్దిగా నొక్కుతాడు .దీనివల్ల బాణం అర్జునుడి కిరీటాన్ని మాత్రమే ఎగరగొడుతుంది.

5.గరుడాస్త్రం: (eagle weapon) ఇది నాగాస్త్రానికి విరుగుడు అస్త్రం. నాగాస్త్రం వల్ల వచ్చే పాములను అంతం చేయటానికి గరుడ పక్షులను రప్పించే అస్త్రం ఇది.

6.వజ్రాస్త్రం: (thunderbolt weapon) ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధం వంటి శక్తిని కలిగిన అస్త్రం ఇది. ఇది యుద్ధ సమయంలో పిడుగుల వంటి భయంకరమైన విద్యుత్ శక్తిని విడుదల చేసి శత్రువులను దెబ్బతీస్తుంది.
7. ఇంద్రాస్త్రం: (the weapon of Indra )
దేవతల రాజైన ఇంద్రుడి అస్త్రం. దీనిని ప్రయోగిస్తే ఒకేసారి వేల సంఖ్యలో బాణాలు వర్షంలో కురుస్తాయి.
రామాయణంలో ఈ అస్త్రం శ్రీరాముడు లక్ష్మణుడు మరియు రామణుడి కుమారుడైన ఇంద్రజిత్తుల వద్ద ఉండేది.
శ్రీరాముడు ఈ అస్త్రాన్ని రాక్షస వీరుడైన ఖరుని పై , కుంభకర్ణునిపై ప్రయోగిస్తాడు.
లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై ప్రయోగించి అతనిని సంహరిస్తాడు.
మహాభారతంలో అర్జునుడు పలుమార్లు ఈ ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఉత్తర గోగ్రహణం సమయంలో కూడా అర్జునుడు కౌరవ సైన్యంపై,17 వ రోజు యుద్ధం లో సంశప్తకుల పై, సుదక్షిణుడు పై ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు.

8. ఆగ్నేయాస్త్రం: (the fire weapon /weapon of Agni) ఈ అస్త్రానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు దీనిని ప్రయోగించినప్పుడు ఆకాశం నుండి విపరీతమైన మంటలు నిప్పులు వర్షాల్లా కురుస్తాయి శత్రు సైన్యాన్ని కాల్చి బూడిద చేయడానికి దీనిని వాడుతారు..

9. వరుణాస్త్రం: (the water weapon) ఈ అస్త్రం ఆగ్నేయాస్త్రానికి విరుగుడు. దీని అధిష్టాన దేవత జలాధిపతి అయిన వరుణుడు. దీని ద్వారా విపరీతమైన నీటి ఉధృతి పుడుతుంది.
ఇలా ఈ అస్త్రాలు అన్నీ కూడా రామాయణ, భారత కాలాల్లో వాడబడినట్లు పురాణ గాథలు చెబుతాయి.

Written by Shasi Bala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దశహరా