కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అట్టుకల్ భగవతి ఆలయం లో పురుషులకు ప్రవేశంలేదు.పొంగాలా ఉత్సవసమయంలో కేవలం మహిళలు మాత్రమే వస్తారు.ఆపరిసరాల్లో మగవారు ఉండకూడదు.చక్కులాథుకావు అనే ఆలయంలో అమ్మవారితో పాటు నారీపూజ చేస్తారు. ఆలయపూజారులు స్త్రీల పాదాలు కడిగి పూజిస్తారు.దేవీశక్తిఆరాధనగా భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.గౌహతీలోని కామాఖ్యా ఆలయంలో అమ్మవారు బహిష్టుకాలంకాబట్టి ద్వారాలు తెరవరు. మగవారు రాకూడదు.ఇక కన్యాకుమారిలో భగవతిఅమ్మన్ ఆలయంలో దేవీ కుమారి ని పెళ్లయిన పురుషులు ఆపరిసరాల్లో ఉండరాదు. మగసన్యాసులు ఆలయద్వారం దాకా వెళ్లొచ్చు. రాజస్థాన్ లో పుష్కర్ లోనిబ్రహ్మదేవుని ఆలయం గర్భగుడిలోకి పెళ్లయినమగవారు రాకూడదు.యజ్ఞంచేసేప్పుడు సరస్వతి ఆలస్యంగా రావటంతో,బ్రహ్మ గాయత్రిని పెళ్లాడి యాగం పూర్తిచేశాడుట! అందుకే అక్కడ మగవారు రాకూడదు.
వనదేవి ఆలయం పట్నాకి 25కి.మీ.దూరంలో ఉంది. ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంలో వింధ్యవాసినిమాత గా పూజలందుకుంది.16వశతాబ్దికి చెందిన ఈగుడిని గూర్చి చారిత్రక ఆధారాలు లేవు.సూర్యాస్తమయం లోపు అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందే! అక్కడ ఉంటే ఏదో జరుగుతుందనే భయం శంక జనాలకి ఉంది.అందుకే పూజారి చీకటి పడకముందే సూర్యాస్తమయం కాకముందే వెళ్లి పోతాడు.అమ్మవారు సంచరించే సమయంలో మానవులు ఉండరాదు అనే ఓ గాఢనమ్మకం, ఆచారం తరతరాలుగా వస్తోంది