
రాధా అంటూ పరిగెత్తుకొచ్చింది శ్రీజ ఎందుకే ఆ పరుగులు అంది రాధా
అది కాదు మనం ఈరోజు సినిమాకి వెళ్దామా?
మధ్యలో నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే శ్రీజ నేను స్నేహితులు కానీ వాళ్ళ అక్క వాళ్ళ గురించి నాకు ఏమీ తెలియదు
మనం ఎన్ని గంటలకు వెళ్దాం అంది రాధ సాయంత్రం
ఫస్ట్ షోకి అక్కా అంది శ్రీజ
సరేలే వెళ్దాం నేను ఎన్ని గంటలకి రెడీగా ఉండాలి అడిగింది రాద. నాకు ఆశ్చర్యతో పాటు బాధ కూడా కలిగింది ఎందుకంటే వాళ్ళ అక్కకు రెండు కళ్ళు పుట్టినప్పటి నుండి కనిపించవు అయితే ఆమె ఇంట్లో బాగానే తిరుగుతుంది నా ఆలోచనలో నేనుండగా శ్రీజ నీ బట్టలు నువ్వు తీసుకుంటావా అంది అలాగే లేవే తల్లి ఎప్పుడూ నేనే కదా తీసుకుంటాను తయారుగా ఉంటాలే ఎప్పుడు ఉండాలో చెప్పు నీకోసం ఎదురు చూస్తూ ఉంటా సరేనా అంది రాధా
శ్రీజ సరే అక్క మళ్లీ వచ్చి చెప్తాను రమణిని ఇంటికి పంపి వస్తాను బయటకు వచ్చాక తన వంతు అయింది ఆశ్చర్యపోడం ఎందుకంటే నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం వల్ల. రమణి మా అక్క గురించి అడగవా అంది ఏం అడగమంటావ్? నీకేం బాధనిపించింది లేదా?
చిన్న బాధతో కూడిన నవ్వు నవ్వాలి కదా! అప్పటికే కళ్ళు చెమర్చాయి అప్పుడు చెప్పింది మా అక్కకి చేయని ప్రయత్నం అంటూ లేదు ఎంతమందికి చూపెట్టిన కళ్ళు రావడం కష్టమన్నారు ఆఖరికి కళ్ళు మార్పిడి చేద్దాం అన్న కుదరదు అంత సులభం కూడా కాదన్నారు అందుకే మా నాన్నగారు మా అక్కని చాలా అపురూపంగా చూసుకుంటారు
మా అక్క సంగీతంలో దిట్ట వీణ వాయిస్తుంది వయొలిన్ కూడా పాట కూడా బాగా పాడుతుంది ఇప్పుడు తను కావాల్సిన బట్టలన్నీ మ్యాచింగులతో సహా గాజులు కూడ తీసుకుంటుంది భగవంతుని ఆశీస్సులు మా అక్క సంగీతంలో పాటలో ఫస్ట్ కచేరీలు కూడా చేస్తుంది లెక్చరర్ గా పనిచేస్తుంది తెలుసా ఇంకా వెళ్దామా.
ఇద్దరూ మా ఇంటికి వెళ్ళాం మా అమ్మకి చెప్పి ఒప్పించి నేను రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ అక్క రాధ కూర్చుని ఉంది ఊదా రంగు పువ్వులు చీర కట్టుకొని గాజులు బొట్టుతో సహా మ్యాచింగ్ ఎంతో అందంగా అపురూపంగా తయారయింది నేనే దిష్టి పెట్టే అంత అందంగా ఉంది అప్పుడు నా మనసులో ఒక భావం తలుక్కుమంది ఇప్పుడు శాస్త్రీయ పరిజ్ఞానం చాలా విస్తృతంగా పెరిగింది కదా ఏ దేవుడైన కరుణించి రాధని దీవిస్తే కళ్ళు వస్తే బావుండు నని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కళ్ళు దానం చేస్తే ఎంత బాగుంటుందో కదా!
సంతోషంగా అందరం కారులో సినిమాకి వెళ్ళాం పిక్చర్ బాగా ఎంజాయ్ చేసాము తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళ అక్క ఎంత బాగా విశ్లేషించి సినిమా గురించి చెప్పిందంటే కళ్ళు ఉన్న వాళ్ళు కూడా చెప్పలేరు అంత గొప్పగా చెప్పింది
నేను పై చదువులకు యూనివర్సిటీకి వెళ్ళాను అంచేత మా మధ్య చాలా గ్యాప్ వచ్చింది నేనేదో మాగ్జిన్ చదువుతూ ఉంటే పుట్టి గుడ్డికి కూడా ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి అని ఎంత సంతోషకరమైన వార్త మాఅమ్మకి రమణ మహర్షిగారు అంటే దేవుడే చాలా ఇష్టం అంత భక్తి అందుకే నాకు రమణి అని పేరు పెట్టుకుంది
ఎప్పుడు ఒకరి గురించి మంచిగా ఆలోచించడమే ఇంకో భావన లేదు రాదు కూడా అదే నేను చెబుతాను కూడా మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు ఎందుకంటే భావనలు ఎక్కువ ఇంతలో మా అమ్మ రమ్మని కబుర్లు బంధువులు ప్రమాదంలో ఉన్నారని వారిని కలవాలి తొందరగా రమ్మని అందరూ అక్కడికి వెళ్లాను
అందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు అతను ఆకరీదశ చూస్తూ ఉంటే బాధ కలిగింది ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కానీ ఇది ప్రమాదంలో కూడుకున్నటువంటి ఆపద అనుకొని మనం దుఃఖ పడక తప్పదు ఏ ఒక్కరూ తప్పించుకోలేరు మనిషి ఉన్నప్పుడు ఒక విలువ ఊపిరి పోయినప్పుడు మరొక విలువ ఇది సహజం నేను ఎంతమందిలో ఉన్నా నా ఆలోచనలు పద్ధతే వేరు అందరూ విభిన్నంగా ఆలోచిస్తావంటారు కానీ అదే జరిగింది నా మనసులో వచ్చిన ఒక ఆలోచన మంచిదేననీ అనుకుంటున్నా కానీ అందరూ ఏమనుకుంటారో అనే భయం ఇంతలో వారి అమ్మాయి అటుగా వస్తే పక్కకి తీసుకెళ్లి నా ఆలోచన చెప్పాను చెప్పి ఎంతగానో అర్ధించాను పెద్దవాళ్లతో మాట్లాడుతానని చెప్పి ఆమె లోనికి వెళ్ళింది
నేను శ్రీజ కి ఫోన్ చేసి విషయం అంతా వివరంగా చెప్పాను డాక్టర్ గారితో మాట్లాడమన్నా ఆయన్ని సంప్రదించక నాకు ఫోన్ చేయమన్నా మనసులో ఏదో బాధ, గాబరా, భయం అన్ని మిళితమై కంగారు ఈ పరిస్థితులు ఎవరితో పంచుకోలేనివి కారణం లేని దుఃఖం కళ్ళు తుడుచుకుంటూ ఉంటే వారి అమ్మాయి వచ్చి సరేనన్నట్టు చెప్పింది ఇప్పుడు నా మనసు ఎగిరి గంతేసింది నా 1
భగవంతునికి దండాలు సమర్పించుకున్నారు వెంటనే శ్రీజ కి ఫోన్
చేశా తను డాక్టర్ గారిని తీసుకొని నేనున్నస్థలానికి వచ్చింది వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పాను అనుకున్నంత సేపు పట్టలేదు తృటిలో డాక్టర్ గారు పని పూర్తి చేసి బయటకు వచ్చి అందరికీ నమస్కారాలు చెప్పారు ఎందుకంటే ఆ కళ్ళతో ఇంకో వ్యక్తి చూడగలుగుతుందని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు నమస్కారాలు చెప్పుకుని పని ముగించుకొని ఇంటికి వచ్చాంవారందరూ భాదలో
వున్నా కన్నీరు కారుతూ వుంటే పేదలమీద నవ్వుని
వర్ణించలేను.
కొద్దిరోజుల తర్వాత ఫోన్ వచ్చింది అక్క ఆపరేషన్ థియేటర్లో ఉంది ఆపరేషన్ జరుగుతుందని నేను వెంటనే బయలుదేరి వెళ్లాను నేను వెళ్ళేసరికి ఆపరేషన్ సక్సెస్ అయింది ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు అందుకే ప్రతి ఒక్కరూ పెద్దమనసుతో తమ తమ కళ్ళని డొనేట్ చేస్తే ఎంతో ఆనందం కదా!