
ఆకాశం అనంత విశాలమై….
అన్నిటికి ఇస్తుంది అవకాశం,
గుప్పెడంత ఉన్న ఓ హృదయమా
నీవు కూడా ఆకాశానికి సరిసాటి
ఆకాశమంటే శబ్దస్వరూప మంటారు
నీలోన ఉన్నాయి ఎన్నో మూగ భాషలు,
ఆకాశం కదలదు మెదలదు
ఎన్నో భవన భాండాలను తనలోన ఈ ఇముడుచుకుంది,
ఎన్నో సుగుణాలు నిండి ఉన్నాయి ఓ హృదయమా
నీలోన,దయ, కరణ , ఓర్పు, పరోపకారం నిండిన భాండాగారానివి. అందుకేఅంటారు నిన్ను విశాల హృదయవని….
ఓ హృదయమా నీవు లేని మనిషి ఉంటాడా జగతిని…
ఆకాశము లేని తావు ఉందా విశ్వాన,
నీ స్పందనే మనిషికి ఉనికినిస్తుంది…
నింగే సర్వానికి చోటునిస్తుంది….
గుప్పెడంత హృదయంలో గుబులు దాచుకోకు
దివివలె ధిక్కరించి నిలువెత్తు నిలబడు…
అంతరిక్షమంతా వ్యాపించి ఉంది శూన్యం,
స్థితప్రజ్ఞ వైతే నీలోనే ఉంది శూన్యం.
. గుప్పెడంత ఉంటేనేమి ఓ హృదయమా…
జీవులందరికీ ఉన్న గుప్తనిధివి..
..