
అనుబంధం తోడుగా,
ఆత్మీయత నీడగా,తోడబుట్టిన బంధం సాక్షిగా,నీకంటికి రెప్పలా,ఉంటాను రక్షణగా.
నీచ నికృష్ట కీచక వీక్షణలు నీపైపడకుండా నీకు రక్షాబంధనమౌతాను .
ప్రేమ మాయమాటలు చెప్పే
కేటుగాళ్ళ వలలో నీవు పడవద్దు సోదరీ అదృశ్య తెరల మాటున పొంచి ఉన్నమోస పూరిత వలలొ నీవు చిక్కుకోకు చక్కనమ్మ.
అడుగున మగ మానవ మృగాలే, మేక వన్నె పులులే.
తేనెపూత కత్తులే, తోడుగా ఎవరు లేని సమయాన కాచి ఉన్న నయవంచకుల ఊచకోత
కోసే ధైర్యం నీలో రావాలి.
నిన్ను నీవు రక్షించుకునే రక్షాబంధ కవచంగా నీవె ఇక మారాలి.