Sompaka Seetha
సోంపాక సీతకవి,రచయిత.వీరుతెలంగాణాసాహితి భద్రాచలం శాఖ మరియు జీవన్ దాన్ సంస్థల ద్వారా సాహితీ,సామాజిక సేవలందిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోప్రఖ్యాతిగాంచినపద్యకవిమాల్యశ్రీగారి సహస్రాధిక పద్యకావ్యం'మన్యభారతం' గ్రంథం పై విశ్లేషణ గావిస్తూ రూపొందించిన ఇరువది వీడియోలు పలువురు కవుల మన్ననలను అందుకున్నాయి. విమల సాహితి ఇ- వారపత్రికలో 'విమలపదం' (పజిల్)ను నిర్వహిస్తున్నారు.'నాన్నా మాట్లాడు'కవిత్వం;(నేషనల్ బెస్ట్ పొయెట్రీ అవార్డు..2023)'గజల్ కౌస్తుభం'గజల్స్ సంపుటాలను(వి.జి.ఎఫ్ నేషనల్ గజల్ అవార్డు 2025, గిడుగు జాతీయ పురస్కారం..2025)వెలువరించి ఇప్పుడు'అయితే మీరే..' (భుజాలుతడుముకుంటున్నారుగా!)అను నవలను సీరియల్ గా మీ ముందుకు తెస్తున్నారు.