ఈరోజుల్లో పనివత్తిడి, ఇంకా … బయట బిజీ బిజీ గా ఉంటున్నారు కాబట్టి దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం . జీవితం లో కెరీర్ ముద్దు , నాకు వివాహం వద్దు అని యువత అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు . కానీ మంచి హోదా, కారు , జీవితం లో డబ్బు ఉన్న ముదిరిన బెండకాయల్లా అమ్మాయిలు అబ్బాయిలు ఉండిపోతున్నారు . వాళ్లకి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టేటప్పటికీ 40 ఏళ్లు దాటితే వాళ్ళ కు కలిగే ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి ? ఈ రోజుల్లో దాదాపు అందరూ విదేశాల్లో సెటిల్ అయినారు .
ఇక ఉద్యోగం “నందో రాజా భవిష్యతి ” !! పిల్లలు స్కూల్ చదువు స్టేజికి వచ్చేప్పటికి ఈ అమ్మానాన్నలకి 45 దాటి వారిని పెంచే ఓపిక ఉండదు ఇక 30 , 35 వయసు పెళ్లి అయితే ఇంత వయసు దాటినాక ఆడపిల్లకి సంతాన ప్రాప్తి దాదాపు శూన్యం అయితుంది . పుట్టిన పిల్లల్ని అత్త మామ ల మీదనో అమ్మానాన్నల మీద నో పడేసి ఉద్యోగాలకు పరిగెత్తే దంపతులు ఎక్కువయ్యారు ఈ మధ్య ! కొందరికి అయితే తప్పదు కానీ కృష్ణా రామా అనుకునే వయసులో ఈ మానవుల పెంపకం కష్టంగా ఉందని చాలామంది సీనియర్ సిటిజన్స్ వాపోతున్నారు . గుడిలో కూడా ఇదే సంభాషణ మా తోటి వారితో జరుగుతుందీమధ్య !!
ఇక చిన్నప్పుడే అంటే డిగ్రీ కాగానే పెళ్లి అయితే కనీసం వారి రిటైర్ అయ్యే వాటికి పిల్లలు జాబ్ లలో స్థిరపడతారు . చదువు కెరీర్ జాబ్ ల్లో హైపోజిషన్ కోసం ఈ కాలం స్త్రీలు పోటీపడి పెళ్లి వాయిదా వేస్తున్నారు . ఆపై లక్షల్లో వచ్చే జీతం కెరీర్ కు తగ్గ వరుడు దొరక ఆవస్థలు పడుతున్నారు : ఒంటరితనంతో బాధపడుతున్నారు . వయస్సు సహకరించక తాము తిన్న గర్భనిరోధకమాత్రల ప్రభావంతో పిల్లల కోసం తాపత్రపడే 40 దాటిన దంపతులు ఉన్నారని ఒక సర్వేలో తేలింది. ప్రమోషన్ , విదేశీ యాత్రలు … వీటివల్ల ఉద్యోగం వల్ల గర్భం రాకుండా జాగ్రత్త పడితే 40 దాటాక రొటీన్ లైఫ్ తో విసిగి భౌతికంగా మానసికంగా నీరసించి , వాడి పోతున్నారు . అయ్యో ఇంకా పెళ్లి కాలేదా అని వెనకాల గుసగుసలు పోయే అమ్మలక్కల తోటి!
విద్యావతి ఉద్యోగిని బాధపడక మానదు కొన్నాళ్ళు ఉద్యోగం చేసి పెళ్లి పిల్లలతో ఇంట్లో కూర్చున్న స్త్రీ నా కెరీర్ వేస్ట్ అయింది మంచి జాబ్ జీతం పోయింది అని మానసికంగా కృంగిపోతున్నారని ఒక సర్వేలో తేలింది నెగటివ్ థాట్స్ నేను వేస్ట్ అనే భావాలు పెరిగిపోతున్నాయి గొప్ప ఎస్టిమేషన్ పొజిషన్ గురించి ఆలోచించే స్త్రీ అది అందుకోలేకపోతే రెంటికి చెడ్డ రేవడయ్యాను అని కృషించిపోతుంది తన పై ఆఫీసరు ఏదో అన్నాడని మాటలతో లైంగికంగా వేధించాడని స్త్రీల ఆరోపణలు ఎక్కువైతున్నాయి కొన్ని పరిశోధనల ప్రకారం తేలింది . ఆ స్త్రీ తనను తాను ఎక్స్పోస్ చేసుకుని నలుగురు దృష్టిలో పడాలనే తపన తో కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారుమానసిక విశ్లేషకులు ఇక కొంతమంది భర్త పిల్లల్ని తమ సుపీరియార్టీ కాంప్లెక్స్ తో సతాయిస్తున్నారని ఒక సర్వేలో తేలింది నా క్వాలిఫికేషన్ కు తగ్గవాడు దొరకలేదు అమ్మానాన్నల పోరు పడలేక చేసుకున్న. నా చెల్లెలు తమ్ముడి పెళ్లికి ఆటంకం కాకూడదని నోరు మూసుకున్న అని గొణుగుతూ స్త్రీలు అక్కడక్కడ కనబడుతున్నారు .
కెరీర్ కె ప్రాధాన్యత ఇవ్వటంతో బంధువుల ఇంటికి వెళ్ళక భర్తతో సరిపడక స్త్రీ అగాధాన్ని సృష్టించుకుంటుంది నీతి సూత్రాలను!!
క్రీడలు మీడియా సినిమా మోడలింగ్ లో ఉన్న స్త్రీలు పెళ్లి చేసుకునే టైం తీరిక లేక వాయిదా వేస్తారు పర్వం ఉన్నంతవరకే కెరీర్ అనే భావంతో డబ్బు! మెడల్స్ చూసి తృప్తిపడిన లేటు వయసులో కుదేలై నిరాశ నిష్పాలలకు లోనవుతున్నారు . ఇక నేటి పిల్లలు సూపర్ యాక్టివ్ గా తయారై ఆడ పిల్లలు ముఖ్యంగా మొబైల్ చేత్తో పట్టుకుని సంభాషణలు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అవటంతో స్కూలు కాలేజీ డుమ్మా కొడుతున్నారని ఈ మధ్యనే ఒక పేపర్ హిందీ పేపర్లు చదివాను. పిల్లలు నోట్స్ రాసుకోవాలని లెక్కలు అర్థం కాలేదని ట్యూషన్ పేరుతో వెళ్తూ అక్కడ ఏం చేస్తున్నారు తెలియక పేరెంట్స్ తికమక పడుతున్నారు . ఒక్కొక్క ట్యూషన్ టీచర్ దగ్గర 30 40 మంది పిల్లలు ఉంటారు వారు అంతగా శ్రద్ధ పెట్టక పరీక్షల టైంలో కూర్చో పెడతారు కానీ ఆ పిల్లలు చదువుతున్నారో లేదో గమనించరు పేపర్లు చింపి బంతుల్లాగా ఆడటం చిన్న చిన్న కాగితాల మీద మెసేజ్లు పంపటం ఒక ట్యూషన్ లో నేను చూశాను , ఆ టీచర్ ని అడిగాను . ఆమె ఇలా అన్నారు ” నన్ను ఏం చేయమంటారండి? ప్రతిదీ స్కూల్లో వాట్సాప్ లో హోమ్ వర్క్ ఇస్తున్నారు . దాన్ని చేయించాలి . అందుకని ప్రతివారు స్మార్ట్ ఫోన్ తో వస్తారు . నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి , నా భర్త సంపాదన సరిపోవడం లేదు ” అని వాపోయింది .
నిజమే కదా మరి ! ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటి? కాలం మారింది కానీ జీవితాల్లో ఒత్తిడి పెరిగింది . సంతృప్తి తగ్గింది ఒకటికి నాలుగు చీరలు కావాలి . కొత్త నగ ఆర్టిఫిషల్ వి కొనాలి అని పోటీ తత్వం స్త్రీలలో పెరగటం గమనించాను. ఇవి చేదు నిజాలు!
మరి దీని పరిష్కారం గురించి ఆలోచించాలి. చర్చించాలి. అన్నీ జరుగుబాటు ఉన్నవారు కూడా ఉద్యోగం చేయకుండా ఉంటే బాగుంటుంది. భర్త ఆఫీసర్ . విల్లా, కారు ఉన్న స్త్రీ ఇంట్లో కూర్చోవచ్చు కదా ! నిజంగా అవసరం ఉన్న ఆర్థిక ఇబ్బంది ఉన్న స్త్రీ ఉద్యోగం చేయాల్సిందే తప్పదు ! అలాంటి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాల దొరక్క సేల్స్ విమెన్ గా చేరటం నేను చూస్తున్నాను . అవసరమైతేనే స్త్రీ జాబ్ చేయాలి . ఇది నా అభిప్రాయం మాత్రమే . చాలా పుస్తకాల్లో మ్యాగజైన్సులో చదివి వారు సేకరించిన విషయాలను క్రోడీకరించి ఇలా వ్యాసంగా రాశాను
ఆలోచించండి మరి!