* ఉపాధ్యాయిని -ఉపాధ్యాయులే విద్యారథానికి చక్రధారులు*

కవిత

శిలను ఉలితో చెక్కితే
అందమైన శిల్పం తయారైనట్లు
విద్యార్ధిణి -విద్యార్థులకు
విషయ బోధన చేసి వివేకవంతునిగా
మార్చేది ఉపాధ్యాయులే… !

మట్టి ముద్దను
చక్రంలో త్రిప్పితే
అపురూప వస్తువుగా మలిచబడినట్లు
విద్యార్ధిని – విద్యార్థులకు
తరగతి గదిలో కూర్చోబెట్టి
వ్యక్తిత్వాన్ని
ఉన్నతంగా తీర్చిదిద్దేది
ఉపాధ్యాయులే !

బంగారాన్ని
కొలిమిలో కాల్చితే
అందమైన నగ తయారైనట్లు
విద్యార్ధిని – విద్యార్థులకు
పాఠ్యాంశాల్లో..ని మగ్నం చేసి
జ్ఞాన జ్యోతిని వెలిగించేది
ఉపాధ్యాయులే !

నీటిని
పాత్రలో నింపితే
పాత్ర ఆకారం పొందినట్లు
విద్యార్ధిని – విద్యార్థులను
విషయ గదిలో ఉంచి
విజ్ఞాన గనిగా తీర్చిదిద్దేది
ఉపాధ్యాయులే!

పునాదిని
లోతుగా తవ్వితే నే
దృఢమైన సౌధం
నిటారుగా నిలబడినట్లు
విద్యార్థిని- విద్యార్థులను
బీజాక్షరాలతో ఆశీర్వదించి
బలమైన శక్తిగా
రూపుదిద్దేది ఉపాధ్యాయులే !

పాదాభివందనం
మహాను భావులారా
నమో నమామి
విజ్ఞాన ప్రదాయకు లారా!

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధర్మాచార్యులు

A walk & a realization