ఏం ఇంటి పంట
ఆయింటిదే
ఆశలూ కోరికలూ అలవికాని బాధలూ
మనుగడ కోసం వేడుకోవడం
ప్రతి గుండె నినాదం
వరలక్ష్మీ నమోస్తుతే !
మా ఒడిదుడుకుల జీవితంలో
చిరునవ్వుతో అడుగిడి
ఆదిలక్ష్మివై
ఆదుకోవమ్మా!
మా కష్టనష్టాల బతుకులో
ఇష్ట దైవంగా కొలువుండి
ధాన్యలక్ష్మివై కరుణించవమ్మా !
మా సంసార దుఃఖ సమయంలో
గజలక్ష్మివై కాలుమోపి
దారిద్ర్య ధ్వంసం చేయవమ్మా !
మా నిరాశా నిస్పృహల ముసురులో
ధైర్యలక్ష్మివై ఏతెంచి
శక్తియుక్తులీయవమ్మా !
మా జీవన పోరాట గమనంలో
ఆత్మవిశ్వాస శ్వాస నింపి
విజయలక్ష్మివై వరించవమ్మా !
మా కుటుంబ బాధ్యతల నిర్వహణలో
సంతానలక్ష్మివై తోడుండి
అభీష్ట సిద్ధి గావించవమ్మా!
మా జ్ఞాన సాధన పయనంలో
విద్యాలక్ష్మివై అలరించి
ప్రజ్ఞా బుద్ధి ప్రసాదించవమ్మా!
మా సుఖ సంతోషాల కోరికల్లో
ధనలక్ష్మివై ఆవహించి
కనక వర్షం కురిపించవమ్మా!
ఏక మొత్తం జీవితంలో
అష్టలక్ష్మివై అవతరించి
వరలక్ష్మి గా
ఆనంద డోలికలు మ్రోగించవమ్మా !
నారాయణీ నమోస్తుతే!