దారం నీవైతివి,
ముడిని నేనైతిని,
మన ఇద్దరి ఈ కలయికనే విడిపోని బంధంగా
దృఢంగా బంధించడానికే వచ్చింది
ఈ రక్షబంధన్…

జన్మజన్మ లకు ఈ బంధాన్ని
జాగృతి తో నిలుపుకుంటూ,
వినాశనం లేని ప్రశాంతత కోసం
విరామం లేకుండా ప్రయాణం చేస్తూ
మధురమైన ఈ బంధుత్వం కొనసాగాలి…